ప్రాణం తీసిన ఈఎంఐ..
posted on Jun 25, 2021 @ 5:59PM
ఒకప్పుడు మాములుగా మనిషిని చావడానికి ఏ ఆరోగ్య సమస్యలు కారణం ఐతే, ఇప్పుడు మనిషి చనిపోవడానికి కారణాలు కూడా మారుతూవస్తున్నాయి. ఒక వైపు కరోనా కూడా మనిషి ప్రాణాలు తీస్తుంటే.. మరో వైపు ప్రజల భయం కూడా ప్రజల ప్రాణాలు పోతున్నాయి. అన్నింటికంటే మించి నేటి సమాజంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల మనిషి ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఈఎంఐ వల్ల చనిపోయాడు. అది ఎలా అనుకుంటున్నాడా ? మీరే చూడండి..
సాధన్ సిన్హా (40) అనే వ్యక్తి ప్లంబర్ గా పనిచేస్తూ.. భార్యా 18 సంవత్సరాలు, 15 సంవత్సరాలు వయస్సున్న ఇద్దరు కొడుకులతో ఉంటున్నారు. గతంలో టూ వీలర్ కొనుగోలు చేసే ప్రక్రియలో భాగంగా ప్రైవేట్ ఫైనాన్స్ ఏజెన్సీ నుంచి రూ.లక్ష వరకూ అప్పు తీసుకున్నారు. నెలకు రూ.3వేల 400 చొప్పన చెల్లించాల్సి ఉండగా రెండు నెలలు మే, జూన్ నెలలకు రూ.6వేల 800కట్టలేకపోయాడు.ఈఎమ్ఐ కట్టలేకపోయాడని ఏజెంట్లు వేధింపులు మొదలుపెట్టారు. రోజు ఫోన్ చేసి టార్చెర్ చేసేవాళ్లు అయితే నెల వాయిదాలు కట్టలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తి.. ఈఎమ్ఐ కట్టేందుకు డబ్బుల్లేక, ఏజెంట్లకు సమాధానం చెప్పలేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. సమయానికి ఈఎమ్ఐ కట్టలేకపోయాడని ఏజెంట్లు వేధింపులు మొదలుపెట్టారు. నెల వాయిదాలు కట్టలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తి.. ఈఎమ్ఐ కట్టేందుకు డబ్బుల్లేక, ఏజెంట్లకు సమాధానం చెప్పలేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. రోజు వచ్చి ఇంటి ముందు గొడవలు పడితే తట్టుకోలేకపోయాడు. తీరా ఇంటి ముందు కూర్చొని వాయిదాలు కట్టకపోతే కదలమంటూ మొండికేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
నెలకు రూ.15వేల నుంచి 20వేల వరకూ సంపాదించే వ్యక్తి.. మహమ్మారి కఠిన నిబంధనలతో ఒక్కసారిగా తన సంపాదన ఆగిపోయింది. టూ వీలర్ తీసుకుంటే తక్కువ సమయంలో వేర్వేరు చోట్లకు వెళ్లి, వేరువేరు పనులు చేయొచ్చని దాని ద్వారా ఎక్కువ సంపాదించగలమనుకున్నాడు. కానీ, కరోనా టైం లో, అందులోను లాక్ డౌన్ ఉండడం వల్ల సరిగ్గా దొరక్కపోవడంతో రెండు నెలల వాయిదా కట్టలేకపోయాడు. సాధన్ ఈఎమ్ఐ కట్టకపోవడంతో రికవరీ ఏజెంట్లు బిందుపారా గ్రామంలోని ఇక అంతే గడ్డలు వచ్చి ఇంటిపై వాలినట్లు, ఇంటికి ఉదయం 9గంటలకే వచ్చి కూర్చొన్నారు. కట్టాల్సిన వాయిదా చెల్లించకపోతే అక్కడి నుంచి కదిలేది లేదంటూ మొండికేశారు. నన్నమాటలు అన్నారు. వారిని కొద్దిరోజులు ఆగమని బ్రతిమాలాడు. అయినా వినలేదు ఆ ఫైనాన్స్ రాబందులు. వాళ్లు ఇంటి బయట కిందే కూర్చొని డబ్బులు ఇవ్వందే వెళ్లమంటూ కూర్చొన్నారు. నా భర్త తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు’ అని మమోనీ (మృతుడి భార్య) అంటున్నారు. ఈ ప్రాంతంలో బాగా తిరిగిన వ్యక్తి.. అలా ఏజెంట్లు అవమానించడంతో భరించలేక ఇలా చేసుకుని ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. ఏజెంట్లు ఎంతకూ కదలకపోవడంతో గదిలోకి వెళ్లి తలుపు లాక్ చేసుకన్నాడు. సీలింగ్ ఫ్యాన్ చప్పుడు వినిపిస్తుండటంతో కిటికీలో నుంచి తొంగిచూసింది. అప్పుడే సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకున్నట్లు తెలిసింది. అని మమోనీ చెప్పింది.