ప్రకాశ్ రాజ్ మరో శ్రీమంతుడు
posted on Sep 8, 2015 @ 11:20AM
మహేశ్ సినిమా శ్రీమంతుడి సినిమా ప్రభావం బాగానే పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే శ్రీమంతుడి సినిమాలో మహేశ్ తన ఊరిని దత్తత తీసుకొని దాని అభివృద్ధికి పాటుపడుతాడు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా తను తెలంగాణలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని రియల్ లైఫ్ లో కూడా శ్రీమంతుడు అని అనిపించుకున్నాడు. ఇప్పుడు అదే తరహాలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఊరిని దత్తత తీసుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.
ప్రకాశ్ రాజ్ ఇప్పటికే ప్రకాశ్ రాజ్ ట్రస్ట్ పేరుతో తమిళనాడు, కర్ణాటకలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని తనవంతు సాయం అందించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా కేశంపేట్ మండలంలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు సుముఖంగా ఉన్నట్టు సమాచారం. ఈ సందర్బంగా ప్రకాశ్ రాజ్ మాట్లడుతూ కావాల్సినంత సంపాదించా. ఇక సమాజానికి ఏదైనా చేయాలి. సమాజం వల్లే వచ్చింది. తిరిగి సమాజానికే ఇచ్చేయాలి.. అదే నా సిద్ధాంతం అని చెప్పారు. అందుకే నావంతుగా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని అన్నారు. పంటల్ని మెరుగైన పద్ధతుల్లో పండించడం ఎలా? అందుకు ట్రాక్టర్లు కావాలన్నా సైంటిఫి క్ మెదడ్స్ పై సలహాలు కావాలన్నా.. తనవంతుగా సాయం చేయనున్నానని ఏపీలో కూడా ఓ గ్రామాన్ని ఎంపిక చేసుకునేందుకు పర్యటనలో ఉన్నానని చెప్పాడు ప్రకాష్ రాజ్ వివరించాడు. మొత్తానికి మన నటులు రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోలని నిరూపించుకుంటున్నారు. వీరిని ఆదర్శంగా ఇంకా కొంతమంది హీరోలు ముందుకువస్తే బావుంటుంది.