బాహు"బలి"అయ్యాడా?
posted on Mar 8, 2014 @ 10:57AM
యంగ్ రెబెల్ స్టార్.. యరక్కపోయి ఇరుక్కున్నాడా? తాత్కాలిక ఓదార్పు కోసం వెళ్లి కబంధహస్తాల్లో ఇరుక్కుపోయడా? ఇవే ఇప్పుడు అంతర్జాలంలో అత్యంత వేగంగా వైరస్ లా విస్తరిస్తున్న పుకార్లు. ఎక్కడ ఏ రాజకీయ సభలో ఎవరు ఎవరిని విమర్శించినా కౌంటర్ గా ప్రభాస్ కేంద్రంగా మారుతున్నాడు? షేర్లు, పోస్టులు , కామెంట్లు రూపంలో నెటిజన్ల వాల్ కు ఎక్కుతున్నాడీ రాజుల అబ్బాయి.
సినిమా ప్రమోషన్ కోసమేనా?
మిర్చి సూపర్ హిట్ అయిన తరువాత ప్రారంభమైన ప్రభాస్ సినిమా బాహుబలి. ఈ సినిమా రాజమౌళి చెక్కుతున్నారు. అంటే ఇది రిలీజయ్యేందుకు ఇంకా చాలా సమయం పడుతుంది. ఈ మధ్యలో ఇంకో ప్రాజెక్ట్ ఒప్పుకునే అవకాశాలు లేవు. అంతవరకూ గ్యాసిప్స్ తో గ్లామర్ మేంటైన్ చేసేందుకు పనిగట్టుకుని కొందరు అభిమానులు ఇలాంటి ప్రచారం చేస్తున్నారనే విమర్శలున్నాయి. అందుకే వీటిని సీరియస్ గా తీసుకోకుండా చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని సినీవర్గాలు అంచనా వెస్తున్నాయి.
ప్రభాస్ అభిమానుల మీద, సినీ జనాలపైన అత్యంత ప్రభావంతంగా పనిచేసే హాట్ హాట్ గ్యాసిప్స్ ఫేస్ బుక్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. మతం మారాడా? సినిమా ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ప్రభాస్ పై రూమర్లు సినిమా రంగం నుంఛి రాజకీయరంగం వైపు మళ్లాయి. కడపలో ఒకరిని మరొకరు విమర్శిస్తే.. కౌంటర్ గా విశాఖపట్నం ఓ వాయిస్ ప్రతిధ్వనిస్తోంది. ఏ ఒక్క రూమర్ పైనా ప్రభాస్ ఇప్పటివరకు స్పందించింది లేదు. ఆయన అభిమతం ఏమైనా మారిందా? మతం మారడం వెనుక కారణాలేంటి? అనే దానిపై నెటిజన్లు చర్చా కార్యక్రమాలు నడిపిస్తున్నారు.
రెబెల్ స్టార్ ని ఎదుర్కొనేందుకేనా? ..
ఈ మధ్యే బీజేపీలో చేరిన సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు మాలలే నరసాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. ఆయనకు చెక్ పెట్టేందుకు సినీ ఇండస్ట్రీ లో కొందరు, మరి కొంతమంది రాజకీయ నేతలు పధకం ప్రకారం యంగ్ రెబెల్ స్టార్ ను కేంద్రంగా చేసుకుని రూమర్లు ప్రచారం చేయిస్తున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి.