పవన్ కళ్యాణ్ నిర్మాత.. రామ్‌చరణ్ హీరో...

 

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కి సినిమా నిర్మాణం మీద మొదటి నుంచీ ఆసక్తి వున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన మరోసారి నిర్మాతగా రంగప్రవేశం చేయబోతున్నారు. ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ పతాకం మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓ సినిమాని నిర్మించబోతున్నారు. ఆ సినిమాలో నటించే హీరో పవన్ కళ్యాణ్ కాదు.. మరెవరనుకుంటున్నారు.. రామ్ చరణ్. ఎస్... అబ్బాయ్ హీరోగా బాబాయ్ నిర్మాణంలో ఒక సినిమా రూపొందబోతోంది. కేవలం రామ్ చరణ్‌తో మాత్రమే కాకుండా ఇతర యువ హీరోలతో కూడా సినిమాలు నిర్మించే ఆలోచన పవన్ కళ్యాణ్‌కి ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ప్రతిభావంతులైన నూతన దర్శకులను కూడా పరిచయం చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ ‘హైదరాబాద్ నవాబ్స్’ సినిమా తరహాలో వుండే హైదరాబాదీ సినిమాలను కూడా నిర్మించనున్నారట. పవన్ కళ్యాణ్ నిర్మించే సినిమాలకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.

Teluguone gnews banner