ఔట్ సోర్సింగ్ రిక్రూట్ మెంట్ పై మాట మార్చిన సర్కార్.. అప్పుడలా ఇప్పుడిలా
posted on Sep 4, 2020 @ 11:53AM
తెలంగాణ ప్రభుత్వం పోలీసు బెటాలియన్లలో రెగ్యులర్ పోస్టుల్లో కొన్నింటిని రద్దు చేస్తూ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. బార్బర్, కుక్, ధోబీ, నర్సింగ్, మిడ్‌వైఫ్, ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్, ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియో థెరపిస్ట్, స్కావెంజర్, స్వీపర్ వంటి విభాగాల్లోని మొత్తం 272 పోస్టులను ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది. ఇప్పటి నుండి ఈ పోస్టులకు ఔట్ షోర్సింగ్, కాంట్రాక్ట్ పద్దతి పైన ఆ ఖాళీలను భర్తీ చేసుకోవాలని తాజాగా ఇచ్చిన ఆదేశాల్లో సూచించింది.
అయితే తెలంగాణ ప్రభుత్వం తాజా నిర్ణయం పై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అసెంబ్లీ సాక్షిగా 2017 లో సీఎం కేసీఆర్ ఒక ప్రకటన చేస్తూ పర్మనెంట్ గా చేయవలసిన ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయడం కరెక్ట్ కాదని... డిపార్ట్ మెంట్ కు సర్వీస్ అవసరముంటే పర్మనెంట్ పద్దతిలో రిక్రూట్ చేసుకోండని అంతేకాని ఔట్ సోర్సింగ్ కు పోవద్దని చెప్పిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.