Read more!

టీవీ చూస్తే చచ్చిపోతారా?


గంటసేపు టీవీ చూస్తే మీ ఆయుర్దాయంలో 22 నిమిషాలు తగ్గిపోతాయట. అదే పనిగా టీవీముందే రోజులతరబడి కూర్చునేవాళ్లకు రిస్క్ మరీ ఎక్కువట. ఓ వ్యక్తి టీవీ చూడ్డంవల్ల తన జీవితకాలంలో 4 నుంచి 8 సంవత్సరాలు కోల్పోతాడని లేటెస్ట్ రీసెర్చ్ సర్వేలు చెబుతున్నాయ్. రోజూ కనీసం ఆరు గంటలపాటు టీవీ చూసేవాళ్లని ఎన్నుకుని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు జరిపిన పరీక్షల్లో విస్మయం కలిగించే ఈ విషయాలు వెల్లడయ్యాయ్.

 

స్తబ్దుగా ఉండడం, ఒకేచోట ఎక్కువసేపు కూర్కుని ఉండడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని పరీక్షల ఫలితాల్లో తేలింది. పొగతాగేవాళ్లకి, ఊబకాయం ఉన్న వాళ్లకి ఉన్న రిస్క్ తో పోలిస్తే జీవితకాలం తగ్గిపోయే విషయంలో టీవీ చూసేవాళ్లకే రిస్క్ చాలా ఎక్కువగా ఉందని తాజా పరిశోధనలు చెబుతున్నాయ్.