తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్!!
posted on Jun 22, 2020 @ 2:22PM
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేసారు. కరోనాను కట్టడి చెయ్యడంలో తెలంగాణ ప్రభుత్వం ఫెయిలైందంటూ బీజేపీ ఆందోళనలకు దిగింది. హైదరాబాద్ కోఠిలోని కరోనా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ముట్టడించేందుకు యత్నించింది. ఈ క్రమంలో బండి సంజయ్‌ని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. అంతేకాదు... ఆయన వెంట వచ్చిన బీజేపీ కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ సంధర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కరోనా కట్టడిలో తెలంగాణ సర్కారు విఫలమైందని ఆరోపించారు. పక్క రాష్ట్రాల్లో ఎన్ని టెస్టులు చేశారు. ఇక్కడ ఎన్ని చేశారో చెప్పాలని ప్రశ్నించారు. డాక్టర్లు వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నా వారికి రాష్ట్ర ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించట్లేదని ఆవేదన వ్యక్తం చేసారు. పీపీఈ కిట్లు, మాస్కులు కూడా లేవని డాక్టర్లు ధర్నాలు చేశారని.. సీఎం, మంత్రులు జోకర్ల లాగా మారారని విమర్శించారు. హెల్త్ బులెటిన్ కూడా ఇష్టం వచ్చినట్లు విడుదల చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా ను ఆరోగ్య శ్రీ కింద చేర్చాలని డిమాండ్ చేసారు. మోడీ సర్కారు రాష్ట్రానికి చేసిన సాయంపై శ్వేత పత్రం విడుదల చేయాలని బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.