ఎంపీ లగడపాటి రాజగోపాల్ హౌస్ అరెస్ట్
posted on Jan 21, 2013 @ 10:20AM
టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్రను ఎంపీ లగడపాటి రాజగోపాల్ అడ్డుకుంటానని చేసిన వ్యాఖ్యల కారణంగా హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఉన్న ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. పాదయాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వ్యూహాలు పన్నుతున్న నేపథ్యంలో వారికి ధీటుగా టీడీపీ నేతలు కార్యచరణ చేస్తున్నారు.
చంద్రబాబు యాత్రను అడ్డుకుంటామని చెప్పిన లగడపాటి అనుచరులలో చాల మందిని పోలీసులు నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. లగడపాటి ఇంటి చుట్టూ పోలీసులు మోహరించడంతో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. మరో వైపు ఇబ్రహీంపట్నం లో ఎమ్మెల్యే జోగిరమేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.