శరవేగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు
posted on Jul 8, 2024 @ 10:37AM
తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాగానే పోలవరం పనులు పరుగులు పెడుతున్నాయి. గత ఐదేళ్లుగా జగన్ పాలనలో నత్తతో కూడా పోటీ పడని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఇప్పుడు శరవేగంతో జరుగుతున్నాయి. ఐదేళ్ల జగన్ నిర్వాకం వలన కాఫర్ డ్యామ్ డ్యామేజీ అయిన సంగతి తెలిసిందే. ఇక కాఫర్ డ్యామ్ మరమ్మతులకు అవకాశం లేదనీ, కొత్తగా నిర్మించాల్సిందేనని తేలిపోయింది. దానికి ఎక్కడ నిర్మించాలి అన్న విషయం నిపుణులు తేల్చాల్సి ఉంది.
అయితే అది వినా మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని తెలుగుదేశం కూటమి సర్కార్ నిర్ణయించింది. దీంతో పనులు జోరందుకున్నాయి. పోలవరం ప్రాజెక్టు దిగువ కాఫర్ డ్యాం, స్లూయిజ్ పనులు ఇప్పుడు శరవేగంతో జరుగుతున్నాయి.
ఎన్నికలలో విజయం సాధించిన తరువాత తెలుగుదేశం కూటమి తన ప్రాధాన్యతలేమిటన్నది స్పష్టమయ్యే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తొలి పర్యటన పోలవరం, మలి పర్యటన అమరావతిలో చేసిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ఇప్పుడు పోలవరం, అమరావతిలో నిర్మాణ పనులు జోరందుకున్నాయి.
ఇటీవల రాష్ట్ జలవనరుల మంత్రి నిమ్మల రామారాయులు పోలవరం ప్రాజెక్టును పరిశీలించి దిగువ కాఫర్ డ్యాం ద్వారా సీపేజీ జలాలు బయటకు పంపేందుకు నిర్మిస్తున్న స్లూయిజ్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. వరద ఉధృతి పెరగడానికి ముందే ఈ పనులను పూర్తి చేయాలని విస్ఫష్ట ఆదేశాలు జారీ చేశారు. స్లూయిజ్ పనులు వరద ఉధృతి పెరగడానికి ముందుగానే పూర్తి చేయడం ద్వారా జలాలు కాఫర్ డ్యాంల మధ్య నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని నిమ్మల రామానాయుడు ఆదేశించారు.
ఈ నేపథ్యంలోనే స్లూయిజ్ నిర్మాణం పనులను వేగవంతం చేశారు. కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అనుమతుల మేరకే పనులు ప్రారంభమయ్యాయని అధికారులు చెప్పారు. రెండు రోజుల్లో స్లూయిజ్ గేట్ల అమరికి పూర్తవుతుందని చెబుతున్నారు. అదే జరిగితే గోదావరి జలాలు కాఫర్ డ్యాంల మధ్యకు వచ్చే అవకాశాలు ఉండవు.
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబునాయుడి ప్రభుత్వం కొలువుదీరగానే పోలవరం పనులు జోరందుకున్నాయి. స్లూయిజ్ పనులు పూర్తి అవుతే.. స్పిల్‌వే బ్యాక్ వాటర్.. కాఫర్ డ్యాంలోకి రాకుండా నివారించవచ్చు, డీవాటరింగ్ ద్వారా కాఫర్ డ్యాం నడుమ సీపేజీ జలాలను తొలగించవచ్చని.. తద్వారా ఎర్త్‌కం రాక్‌ఫిల్ డ్యాం, డయాఫ్రం వాల్ పనులకు ఎలాంటి ఆటకం ఉండదని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు.