పోలవరం ఎమ్మెల్యేపై చంద్రబాబు ఫైర్.. చోద్యం చూస్తున్నారా..?
posted on Dec 12, 2015 9:25AM
ఏపీ సీఎం చంద్రబాబు పనిలో నిర్లక్ష్యం చూపిస్తే అస్సలు సహించరు.. వారిపై సీరియస్ గా క్లాస్ తీసుకుంటారని ఇప్పటికే చాలాసార్లు చూశాం. ఇప్పుడు తాజాగా పోలవరం ఎమ్మెల్యే కూడా చంద్రబాబుతో క్లాస్ పీకించుకున్నారు. చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నపోలవరం ప్రాజెక్టు పురోగతి పనుల్లో ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు సరిగా ఆసక్తి చూపించడం లేదని.. ముంపు ప్రాంతాల గ్రామాలను ప్రజలను ఒప్పించడంలో ఎలాంటి చొరవ చూపించడంలేదని పార్టీ నేతలే చంద్రబాబుకు ఫిర్యాదు చేశారంట. మరోవైపు వైసీపీ నేతలు ముంపు ప్రాంతాల ప్రజలను రెచ్చగొడుతుంటే.. శ్రీనివాసరావు మాత్రం ఏం పట్టనట్టు చోద్యం చూస్తున్నారని చంద్రబాబుకు చెప్పారంట. దీంతో చంద్రబాబు శ్రీనివాసరావును దీంతో… మనం ప్రభుత్వం ప్రతిప్టాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టు పురోగతిలో నీ పాత్ర ఎందుకు ఉండటం లేదని టీడీపీ అధినేత పోలవరం ఎమ్మెల్యేకు ఫుల్లుగా క్లాస్ తీసుకున్నారట. ఇప్పటికీ నాలుగు గ్రామాల ప్రజలు ఖాళీ చేశారు.. ఇంకా మూడు గ్రామాల ప్రజలు ఖాళీ చేయాలి.. వాళ్లకు నచ్చజెప్పి వేరే ఊళ్లకు పంపే బాధ్యత నీదే అని ఆదేశించారంట. అలా చేయకపోతే రాజకీయ భవిష్యత్ కు ఇబ్బందులుంటాయని హెచ్చరించారట. మరి ఇప్పటికైనా ఎమ్మెల్యే సీరియస్ గా పని చేస్తారో లేదో చూడాలి.