Please disqualify our MLA: YSR party

Please disqualify our MLA: YSR party

 

People of Andhra Pradesh may remember YSR Congress party president Jagan Mohan Reddy stating “Kiran Kumar Reddy government was surviving on my mercy. It can be pulled down anytime I want.” However, he couldn’t topple his government even after admitting 13 Congress MLAs into his party. At the same time he also admits many TDP MLAs into his party. He continued this practice till the last day of filing nominations in the general elections. Then he didn’t see anything wrong in his decision. But, he now he find fault with his party MLA from Wyra, Khammam district B.Madanlal for joining TRS party recently.

 

YSR party floor Leader Thati Venkateswarlu, who is also expected to bid good bye to party sooner or later, has submitted a petition to Telangana Assembly Speaker S. Madhusudana Chary seeking disqualification of his party MLA Madhan Lal. He also submitted some newspaper and video clippings showing B Madhan Lal joining TRS party. He argued that Madhan Lal needs to be disqualified under the provisions of Clause 2 (1) (a) of the 10th Schedule of the Constitution. He argued that it is unfair to continue as MLA after joining TRS party because he got it through YSR party.

 

However, it is interesting to know T. Venkateswarulu and P .Venkateshwarlu both YSR Congress legislatures often meeting CM KCR these days. However, they condemn the media reports about their plans to join TRS party. They said they are meeting CM KCR to discuss about various works pending in their constituencies. They said they will not leave YSR Congress party. However if they also have any plans to join TRS, then they themselves have to ask the Speaker to disqualify them for the same reasons as there is no one to approach the Speaker on party behalf.

Teluguone gnews banner

మాగంటి గోపీనాథ్ ఆస్తులపై ఆ ఇద్దరి నేతల కన్ను : బండి సంజయ్

  దివంగత మాగంటి గోపీనాథ్ ఆస్తులపై సీఎం రేవంత్‌రెడ్డి, కేటీఆర్ కన్ను పడిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో భాగంగా శనివారం సాయంత్రం షేక్‌పేట్ శివాజీ విగ్రహం వద్ద బండి సంజయ్ రోడ్ షో నిర్వహించారు. గోపీనాథ్ ఆస్తులను కాజేయాలని కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అందుకే ఫిర్యాదు చేసినా విచారణ చేయకుండా కుట్రలు చేస్తున్నరని తెలిపారు. ఇదిగో కంప్లయింట్ కాపీ... పంపిస్తున్నా ముఖ్యమంత్రి..నీకు రోషముంటే, పౌరుషముంటే, చీము నెత్తురుంటే.. గోపీనాథ్ మరణంపై విచారణ చేయాలి ఘాటు వ్యాఖ్యలు చేశారు.  గోపీనాథ్ ఆస్తుల కోసం దొంగ నాటకాలు ఆడుతున్న మాగంటి సునీతకు టిక్కెట్ ఇచ్చారని బండి సంజయ్ విమర్శించారు. వాస్తవాలు చెబుతుంటే... నన్ను మతతత్వవాది అంటున్నరు.. మతతత్వవాది అని బోర్డు ఇస్తే మెడలో వేసుకుని తిరిగేందుకూ వెనుకాడని కేంద్ర మంత్రి అన్నారు. 80 శాతం మంది హిందువులారా...మీరంతా ఓటు బ్యాంకుగా మారి దమ్ము చూపండి జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో షేక్ పేట ఓటర్లు కమలం పువ్వు గుర్తుపై గుద్ది షేక్ చేయండని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాని పోటీ ఉందని తెలిపారు. హిందువులు వర్సెస్ ముస్లింల మధ్యే ఎన్నికలు జరగబోతున్నాయిని తెలిపారు. తురకోళ్ల రాజ్యం కావాలా? హిందువుల రాజ్యం కావాలా? తేల్చుకోండని ఓటర్లకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఒక్కో ఓటుకు రూ.10 వేలు ఇచ్చేందుకు సిద్ధమైనరని ఆరొపించారు. కాంగ్రెసోళ్లు ముస్లింలకు ప్రత్యేకంగా కుట్టు మిషన్లు, మిక్సర్లు, గ్రైండర్లు ఇస్తున్నరు. కేటీఆర్ నెంబర్ వన్ చోర్ అని ముడుతల చొక్కా, రబ్బర్ చెప్పులేసుకునే తిరిగే కేటీఆర్ కు వేల కోట్లు ఎట్లా వచ్చాయిని బండి సంజయ్ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పాలనలో వేల మంది రైతులు చనిపోయిన సంగతి మర్చిపోదామా? పెద్ద చదువులు చదువుకున్నా ఉద్యోగాలు రాక కూలీ  పని చేసుకున్న విషయం మర్చిపోదామా అని అన్నారు.  బీజేపీ అధికారంలోకి వస్తే ఫాతిమా కాలేజీ భవనాన్ని కూల్చేస్తామని స్ఫష్టం చేశారు. అక్కడ పేదలకు ఇండ్లు కట్టి ఇస్తామన్నారు. మోదీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులిస్తుంటే... కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. మోదీ తెలంగాణకు సాయం చేస్తుంటే.. కనీసం ఫోటో కూడా పెట్టడం లేదని తెలిపారు. గోపీనాథ్ ఆసుపత్రిలో ఉంటే ఆయన తల్లిని కూడా చూడనీయకుండా వేధించారని కేంద్రమంత్రి అన్నారు. గోపీనాథ్ భార్య మాగంటి సునీతకు రెండు ఆధార్ కార్డులున్నాయి. ఇవిగో రెండు ఆధార్ కార్డులు అని వాటిని చూపించారు. గోపీనాథ్ మరణంపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటానని సీఎం చెప్పడం సిగ్గు చేటని విమర్శించారు. నెల రోజుల క్రితమే గోపీనాథ్ కొడుకు తారక్ సైబరాబాద్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడని బండి సంజయ్ తెలిపారు

నో డౌట్.. తెలంగాణలో కింగ్ మేకర్ టీడీపీయే!

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప  ఎన్నిక రాజకీయాలు తెలుగుదేశం పార్టీ చుట్టూ తిరుగుతున్నాయి. ఇదేంటి.. జూబ్లీ బైపోల్ లో తెలుగుదేశం పార్టీ పోటీలో లేదుగా అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. తెలంగాణలో ఎక్కడ ఎప్పుడు ఎన్నిక జరిగినా రాష్ట్రంలో తెలుగుదేశం ఎంత ప్రబలంగా ప్రభావం చూపుతుందన్న విషయం తేటతెల్లమౌతూ వస్తోంది. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కూడా తెలుగుదేశం జెండా పట్టని పార్టీ లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే  ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు చావోరేవోగా మారిన జూబ్లీ ఉప ఎన్నికలో రెండు పార్టీలూ కూడా ఎన్టీఆర్ నామస్మరణ చేస్తున్నాయి. కేటీఆర్ అయితే ఏకంగా తనకు తన తండ్రి కేసీఆర్ ఎన్టీరామారావు పేరే పెట్టారంటూ సెంటిమెంట్ ప్లే చేశారు. అంతే కాకుండా బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో జరిగిన అభివృద్ధిని, రాష్ట్ర పురోభివృద్ధిని చూసిన జూబ్లీహిల్స్ ఓటర్లు బీఆర్ఎస్ కే ఓటేస్తారన్న ధీమాను కూడా కేటీఆర్ వ్యక్తం చేశారు.  అయితే దీనిపై రేవంత్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. తెలుగుదేశం అధినేతను జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో హైదరాబాద్ లో నిరసన ప్రదర్శనలను అడ్డుకున్నందుకు తెలుగుదేశం మద్దతు దారులు బీఆర్ఎస్ కు ఓటేస్తారా? లేక బీఆర్ఎస్ హయాంలో ఎన్టీఆర్ ఘాట్ ను తొలగించడానికి ప్రయత్నించినందుకు ఓటేస్తారా? అంటూ నిలదీశారు. మొత్తం మీద కాంగ్రెస్, బీఆర్ఎస్ లు రెండూ తెలుగుదేశం జపంతో జూబ్లీ ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ పరిస్థితి ఈ రోజుకూ తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్ నగరంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న పట్టు, ప్రాబల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ఎమికబుల్ గాజూబ్లీ ఉప ఎన్నికలో పార్టీని పోటీకి దూరంగా ఉంచి ఉండొచ్చు కానీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇద్దరూ కూడా పోటాపోటీగా తెలుగుదేశం మద్దతుదారుల సపోర్ట్ కోసం పోటీపడుతున్న తీరు గమనించిన ఎవరికైనా తెలంగాణలో తెలుగుదేశం ప్రభావం, పట్టు ఎంత బలంగా ఉన్నాయో అవగతమౌతుంది.  

బీహార్ లో లోకేష్ ఎన్నికల ప్రచారం

బిహార్  అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే తొలి విడత పోలింగ్ పూర్తయ్యింది. ఈ నెల 11 రెండవ చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల తరఫున తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ప్రచారం చేయనున్నారు. ఇందు కోసం ఆయన శనివారం (నవంబర్ 8) పట్నాకు వెళ్లారు. ఆయన బీహార్ లో రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.  ఎన్డీఏకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన  బీహార్ ఎన్నికల్లో మిత్ర పక్షాల నేతలు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి,  మంత్రి లోకేష్ బీహార్ లో ప్రచారం చేయనున్నారు. ఎన్డీయేలో నిర్ణాయక శక్తిగా ఉన్న తెలుగుదేశం  ఎన్డీఏ విజయం కోసం సహకారం అందిస్తున్న సంగతి తెలిసిందే.  గతంలో మహారాష్ట్ర, హర్యానా లాంటి రాష్ట్రాల్లో కూడా ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు ప్రచారం చేసిన సంగతి విదితమే.   ఇప్పుడు బీహార్ లో  ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు కాకుండా లోకేష్ వెడుతున్నారు.  కాగా బీహార్ ఎన్నికల ప్రచారం కోసం రెండు రోజుల పాటు ఆ రాష్ట్రనంలో పర్యటించనున్న లోకేష్ పనిలో పనిగా పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు. అలాగే పట్నాలో చాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో కూడా పాల్గొంటారు. శనివారం సాయంత్రం ఈ భేటీలు జరగనున్నాయి. ఆ తరువాత ఆదివారం  (నవంబర్ 9)  పాట్నా లో ఎన్డీఏ కు మద్దతు గా మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశంలో మాట్లాడతారు. అదే రోజు మధ్యాహ్నం  పాట్నా నుండి బయలుదేరి విజయవాడ చేరుకుంటారు.    

హైద‌రా.. బ్యాడ్ బ్ర‌ద‌ర్స్ ఎవ‌రంటే?!

కేటీఆర్, కిష‌న్ రెడ్డిలను హైద‌రాబాద్ బ్యాడ్ బ్ర‌ద‌ర్స్ గా అభివ‌ర్ణించారు తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి. వీరు హైద‌రాబాద్ కి రావ‌ల్సిన  ప్ర‌తి దానినీ ఆపేస్తున్నార‌ని విమర్శించారు.  గుజ‌రాత్, ఢిల్లీ, యూపీల్లో స‌బ‌ర్మ‌తి, య‌మున‌, గంగా న‌దుల ప్ర‌క్షాళ‌న  చేయొచ్చు.. ఇక్క‌డి మూసీనీ చేయొద్దా అని అడుగుతూ మూసీతో పాటు మెట్రో విస్త‌ర‌ణ‌కు సైతం కి కిష‌న్ రెడ్డి అడ్డు త‌గులున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్  ని అరెస్టు చేయ‌డ‌డానికి గ‌వ‌ర్న‌ర్ ని అడిగితే అనుమతి  ఇవ్వ‌డం లేద‌ని.. కాళేశ్వ‌రం కేసులో కేసీఆర్, హ‌రీష్ ల‌ను అరెస్టు చేయ‌మ‌ని ఈ కేసుపై సీబీఐ ఎంక్వ‌యిరీ వేయ‌మ‌ని కోరితే.. ఢిల్లీ పెద్ద‌ల్లో క‌ద‌లిక లేదని.. దీన్నిబ‌ట్టీ వీరి మ‌ధ్య చీక‌టి ఒప్పందం ఎలాంటిదో ఒక‌సారి  చూసుకోవ‌చ్చనీ అన్నారు రేవంత్. ఇక హైడ్రా, ఈగ‌ల్ మీద కూడా ప‌డి ఏడుస్తున్నార‌నీ.. హైడ్రా కార‌ణంగా క‌బ్జాల‌కు గురైన వేల కోట్ల రూపాయ‌ల చెరువులు, కుంట‌లు, నాలాలు ఇప్పుడిప్పుడే వెలికి వ‌స్తున్నాయ‌ని.. అదే వారి కాలంలో చివ‌రికి బ‌తుక‌మ్మ కుంట కూడా క‌బ్జా పెట్టార‌ని.. త‌మ హ‌యాంలో ఇవ‌న్నీ  వెలుగులోకి వ‌స్తున్నాయ‌ని అన్నారు సీఎం రేవంత్. వారి జ‌మానాలో ఇవన్నీ క‌బ్జాల‌కు గురై చిన్న చినుకు ప‌డితే హైద‌రాబాద్ చెరువు అయిపోయేద‌ని.. అన్నారు రేవంత్. కేటీఆర్ హ‌యాంలో స్కూలు ఎదుట కూడా గంజాయ్, డ్ర‌గ్స్ దొరికేలాంటి క‌ల్చ‌ల్ ఏర్ప‌డింద‌ని.. ఆయ‌న హ‌యాంలో ప‌బ్ క‌ల్చ‌ర్ పెరిగినంత మ‌రెక్క‌డా పెర‌గ‌లేద‌నీ.. సొంత బావమరిది ఫామ్ హౌస్ లో జ‌రిగిన డ్ర‌గ్స్ పార్టీయే ఇందుకు ప్ర‌త్య‌క్ష  సాక్ష్య‌మ‌న్నారు రేవంత్. దీంతో ఈగ‌ల్ ప‌నితీరుపై కూడా కేటీఆర్ గగ్గోలు పెడుతున్నారనీ విమర్శలు గుప్పించారు.  గోవాలో లింకులు కూడా త‌మ ఈగ‌ల్ తీగ‌లాగి మొత్తం డ్ర‌గ్స్ నెట్ వ‌ర్క్ ని వెలికి తీస్తుంటే కేటీఆర్ తిక‌మ‌క అయిపోతున్న‌ారని విమర్శించారు. ఇక ఇంజినీరింగ్ కాలేజీల వ్య‌వ‌హారం చూస్తే వీరు వ్యాపారం చేస్తూ, ప్ర‌జాసేవ  చేస్తున్న వారికి మ‌ల్లే పోజులు కొడుతున్నార‌ని, వారు అడిగిన అడ్డ‌గోలు అనుమ‌తులు తాము నిరాక‌రించ‌డం వ‌ల్లే ఈ యాగీ చేస్తున్నార‌నీ,  ఫీజు రీఎంబ‌ర్స్ మెంట్ ఇచ్చేదే నాణ్య‌మైన విద్య అందివ్వ‌డానికి అలా జ‌రుగుతుందా లేదా చూడ్డం కూడా త‌ప్పేనా? ఇదే అద‌నుగా భావించి పిల్ల‌ల చ‌దువుగానీ మ‌ధ్య‌లో ఆగితే అంతే తేలిగ్గా వ‌ద‌ల‌మ‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. విడ‌త‌ల వారీగా వారికి నిధులు మంజూరు చేస్తామ‌ని అన్నారు. వీరి ఆగ‌డాల‌కు మంద‌కృష్ణ‌, ఆర్ కృష్ణ‌య్య తోడ‌వుతున్నార‌నీ, ఇక్క‌డ నెల‌కు రాష్ట్రానికి వ‌చ్చే ఆదాయ‌ం రూ.18,500 కోట్లు మాత్ర‌మే. 6 వేల కోట్ల‌కు పైగా.. కేసీఆర్  చేసిన అప్పుల‌కు ఆర్బీఐ చెప్పా పెట్ట‌కుండానే లాగేసు కుంటోంది. ఇక ఆరు వేల కోట్ల రూపాయ‌లు ఉద్యోగుల జీత, భ‌త్యాలు. మిగిలిన ఖ‌ర్చుల‌తో సంక్షేమ ప‌థ‌కాలు ఇచ్చే దారి క‌నిపించ‌క‌, కొత్త అప్పులు పుట్ట‌క నానా అవ‌స్థలు ప‌డాల్సి వ‌స్తోంది. ఎవ‌రైనా ఇంత‌క‌న్నా మించిన పాల‌న చేస్తామ‌ని ముందుకొస్తే వారికే ఈ మొత్తం పాల‌న అప్ప‌గించేస్తాం ముందుకు రావ‌చ్చ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు రేవంత్.గోపీనాథ్ కుటుంబ వ్య‌వ‌హారం తాను కూడా మీడియాలో చూశాన‌నీ.. ఒక వేళ అందులో ఏదైనా లోటు పాట్లు ఉంటే బండి సంజ‌య్ ఫిర్యాదు చేస్తే విచార‌ణ చేయిస్తామ‌న్నారు.  

తెలంగాణ సీఎం రేవంత్ కు మోడీ, చంద్రబాబు బర్త్ డే విషెస్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా పలు పార్టీల అధినేతలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తదితరులు రేవంత్ కు బర్త్ డే విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రధాని నరేంద్రమోడీ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రేవంత్ కు మాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. అదే విధంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సహా పలువురు రాజకీయ ప్రముఖులు తెలంగాణ సీఎంకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలిపారు. 

క్రెడిట్ చోరీ కోసమేగా వైసీపీ ఏడుపంతా?

ఇటీవల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిడిట్ చోరీ అంటూ చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. అయితే అసలు క్రెడిట్ చోరీ కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ నవ్వుల పాలౌతున్నది ఆయననేనని తాజాగా మరోసారి రుజువైపోయింది.  ఇంతకీ విషయమేంటంటే.. ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్.. సంక్షేమం, అభివృద్ధి, విపత్తు సమయాలలో ప్రజలను ఆదుకోవడం.. ఇలా అన్ని విషయాలలోనూ ప్రజల మెప్పు పొందుతోంది. అదే సమయంలో జగన్ హయాంలో ఏం జరిగింది, ఆ ప్రభుత్వం ఎంత నిష్పూచీగా వ్యవహరించింది అన్న చర్చ కూడా జనంలో జోరుగా సాగుతోంది. దీంతో దిక్కు తోచని స్థితిలో వైసీపీ నాయకులు అయినదానికీ కాని దానికీ కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ప్రజలలో మరింత చులకన అవుతున్నారు. తాజాగా మహిళల వన్డే ప్రపంచ కప్ ను గెలుచుకున్న టీమ్ ఇండియా జట్టు సభ్యురాలు శ్రీచరణి ప్రభుత్వం పట్టించుకోలేదంటూ వైసీపీ విమర్శల రాగం మొదలు పెట్టింది. శ్రీచరణిని ఏపీ సర్కార్ పట్టించుకోలేదంటూ గగ్గోలు పెట్టేసింది. శ్రీకాంత్ రెడ్డి అయితే ఏకంగా మీడియా సమావేశం పెట్టి మరీ ప్రభుత్వాన్ని విమర్శించేశారు.  ఇంతకీ శ్రీచరణి వరల్డ్ కప్ విజయం తరువాత శుక్రవారం (నవంబర్ 7) రాష్ట్రానికి తిరిగి వచ్చారు. గురువారం  (నవంబర్ 6) ఆమె హస్తినలో ప్రధాని మోడీ నివాసంలో జట్టు సభ్యులతో పాటు ఉన్నారు. అంటే శ్రీచరణి  రాకముందే ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ వైసీపీ గగ్గోలు పెట్టేయడం మొదలు పెట్టేసింది. సొంత మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేసేసింది. ఇక్కడ వైసీపీ దుగ్ధ అంతా ఎలాగూ ప్రభుత్వం శ్రీచరణికి భారీగా నజరానాలు ప్రకటిస్తుంది. అయితే ప్రభుత్వం అలా ప్రకటించడానికి తామే కారణమన్న క్రెడిట్ కొట్టేయడానికే వైసీపీ ఇలా వ్యవహరించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    సరే జరిగిందేమిటంటే.. శ్రీ చరణి శుక్రవారం (నవంబర్ 7) రాష్ట్రానికి వచ్చారు. ఆమెకు గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. అక్కడ నుంచి నేరుగా ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ సందర్భంగా చంద్రబాబు ఆమెను అభినందించారు.  ఆ వెంటనే రెండున్న కోట్ల నగదు బహుమతి, గ్రూప్1 స్థాయి ప్రభుత్వోద్యోగం, ఆమె స్వస్థలం కడపలో వెయ్యి గజాల నివాసస్థలం ఇస్తున్నట్లు ప్రకటన వెలువడింది. కడపలో ఆమెను ఘనంగా సత్కరించడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవన్నీ సహజంగా జరిగేవే. క్రీడల పట్ల, క్రీడాకారులను ప్రోత్సహించడం పట్ల చంద్రబాబు ఎంత ప్రోయాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు ప్రభుత్వం శ్రీచరణికి నజరానాలు ప్రకటిస్తుందన్న విషయం తెలిసిన వైసీపీ ముందుగానే ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ విమర్శలు గుప్పించేసి.. ఇప్పుడు తాము గట్టిగా మాట్లాడడం వల్లనే చంద్రబాబు సర్కార్ శ్రీచరణికి నజరానాలు ఇచ్చిందని చెప్పుకుని క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేసిందని అంటున్నారు. అయితే క్రెడిట్ చోరీకి వైసీపీ చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందంటున్నారు. ఎందుకంటే.. వైసీపీ హయాంలో  రాష్ట్రంలో  క్రీడలను ఇసుమంతైనా ప్రోత్సహించలేదు. క్రీడాకారులకు ఎటువంటి సౌకర్యా లూ కల్పించలేదు సరికదా.. ఆడుదాం ఆంధ్రా పేరుతో కోట్ల రూపాయలను వైసీపీ నేతలు దండుకున్నారు.  అంతే కాదు చంద్రబాబు చేపట్టిన గాండీవం ప్రాజెక్టులో భాగంగా ఏపీ ప్లేయర్లకు ట్రైనింగ్ ఇచ్చిన కంపెనీకి బిల్లులు ఎగ్గొట్టడమే కాకుండా, శిక్షణను సైతం వైసీపీ సర్కార్ నిలిపివేసింది.  ఇప్పుడు శ్రీచరణి విషయంలో వైసీపీ చంద్రబాబు సర్కార్ పై చేస్తున్న విమర్శల నేపథ్యంలో జనం నాడు జగన్ ప్రభుత్వ నిర్వాకాన్ని ప్రస్తావిస్తూ నవ్వుకుంటున్నారు.  

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ.. ఇంతకీ అందులో ఏముందంటే?

మాగంటి కుటుంబ కలహం ఇప్పుడు అంటే జూబ్లీ ఉప ఎన్నిక ముంగిట బీఆర్ఎస్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అసలు ఇంత వరకూ అంటే జూబ్లీ  ఉప ఎన్నికలో మాగంటి సునీతను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించే వరకూ.. అసలంతదాకా ఎందుకు మాగంటి గోపీనాథ్ బతికి ఉన్న కాలంలో ఎన్నడూ మాగంటి మొదటి భార్య అన్న ప్రస్తావనే రాలేదు. అసలు మాగంటి సునీత ఆయనకు రెండో భార్య అన్న విషయమే దాదాపుగా ఎవరికీ తెలియదు. కానీ మాగంటి మరణం తరువాత.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జూబ్లీ ఉప ఎణ్నిక ముంగిట మాగంటి కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. మాగంటి గోపానాథ్ సిసలైన వారసుడిని తానేనంటూ ప్రద్యుమ్నతారక్ మీడియా ముందుకు వచ్చారు. అంతే కాదు.. ఎన్నికల సంఘానికీ ఫిర్యాదు చేశారు.  మాగంటి గోపానాథ్ భార్యను అంటూ సునీత అఫిడవిట్ లో తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించారనీ, ఆమె నామినేషన్ రద్దు చేయాలనీ కోరారు. సరే ఎన్నికల సంఘం మాగంటి సునీత నానినేషన్ సరిగానే ఉందని పేర్కొంది. ఇప్పుడు తాజాగా మాగంటి తల్లి కూడా మీడియా ముందుకు వచ్చి మాగంటి సునీతపై విమర్శలు గుప్పించారు. తన కుమారుడు ఆస్పత్రిలో వెంటిలేటర్ పై ఉన్న సమయంలో కూడా తనను దూరం పెట్టారనీ, కన్నకొడుకుని కడసారి చూసుకునే భాగ్యం కూడా దక్కకుండా చేశారని ఆరోపించారు. అంతే కాదు.. తన కుమారుడి మరణమే ఓ మిస్టరీ అంటూ కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు.  దీంతో బీఆర్ఎస్ ఒకింత ఇబ్బందుల్లో పడింది.  ఆ తరువాత మాగంటి సునీత రాసినట్లుగా చెబుతున్న ఓ లేఖ మరింత సంచలనం సృష్టిస్తోంది. మాగంటి ఆస్పత్రిలో ఉన్న సమయంలో సునీత ఆస్పత్రి సెక్యూరిటీకి రాసినట్లుగా ఉన్న ఓ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ లేఖలో మాగంటి తల్లి, సోదరుడు సహా కుటుంబ సభ్యులెవరినీ మాగంటి గోపీనాథ్ ను చూసేందుకు ఆస్పత్రిలోకి అనుమతించవద్దంటూ మాగంటి సునీత  రాసినట్టుగా ఉన్న లేఖ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.   దీంతో బీఆర్ఎస్ లో ఆందోళన వ్యక్తమౌతోందని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద మాగంటి కుటుంబ వివాదం ప్రభావం జూబ్లీ బైపోల్ పై ఏ మేరకు పడుతుందన్నది వేచి చూడాల్సిందే. 

కొస‌రాజు వ‌ర్సెస్ మాగంటి.. ఓ కుటుంబ రాజ‌కీయ కథాచిత్రం!

మాగంటి గోపీనాథ్ కుటుంబ క‌థా చిత్రంలో రోజుకో కొత్త వాద‌న‌.. రోజుకో కొత్త ట్విస్ట్ బయటకు వస్తున్నాయి.  సునీత గోపీనాథ్ కి భార్యే కాదంటూ ఇటు గోపీనాథ్ త‌ల్లి, అటు మొద‌టి భార్యా మాలినీ దేవి, ఆమె కొడుకు తార‌క్ తీవ్ర  స్థాయిలో ఆరోప‌ణ‌లు గుప్పిస్తుంటే..   బీఆర్ఎస్ లీడ‌ర్లు మ‌ర‌లాంట‌పుడు ఈ ఇద్దరు భార్య‌ల పిల్ల‌ల్లో ఎవ‌రి ఇంటి  పేరు ఏంటో చూడాలంటూ లాజిక్ మాట్లాడుతున్నారు.   మాగంటి గోపీనాథ్ తొలిభార్య మాలినీ దేవికి పుట్టిన  తార‌క్ ప్ర‌ద్యుమ్న ఇంటి పేరు కొస‌రాజుగా ఉంది. అదే  సునీత‌కు పుట్టిన  పిల్లల‌ ఇంటి పేరు మాగంటిగా  ఉంది. ఇందుకు త‌గిన సాక్ష్యాధారాలు సైతం వారి ద‌గ‌గ‌ర ప‌దిలంగా ఉన్నాయంటారు మాగంటి సునీత‌కు చెందిన  న్యాయ‌వాదులు. ఇదిలా ఉంటే ఇన్నాళ్ల పాటు తార‌క్ ను మాలినీ దేవి సొంతంగా పెంచుకున్నార‌నీ.. ఆమెకు కూడా గోపీ ఆస్తిలో కొంత వాటా ఇవ్వాలిగా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు గోపి త‌ల్లి మ‌హానంద‌కుమారి. దీంతో ఈ ఫ్యామిలీ డ్రామాలో ఎవ‌రూ ఎక్క‌డా త‌గ్గ‌ట్లా.  అయితే ఈ వివాదం బీఆర్ఎస్ గెలుపు ఆశ‌ల‌పై    నీళ్లు కుమ్మ‌రిస్తుందా అన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో, శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది.  ఇదంతా వాటాల‌కు సంబంధించిన వ్య‌వ‌హార‌మైతే ఈ స‌రికే కేటీఆర్ ఇరు ప‌క్షాల వారిని పిలిపించి పంచాయితీ చేస్తే స‌రిపోతుంది. ఆయ‌న ఈ విష‌యంలో పెద్ద‌గా క‌ల‌గ చేసుకోవడం లేదు.  ఇందుకు కార‌ణ‌మేంటో చూస్తే.. ఒక వేళ ఈ ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోతే.. ఇదంతా కుటుంబ క‌ల‌హంగా చెప్పుకోవ‌చ్చు. గోపీనాథ్ అస‌లైన భార్య‌గా జ‌నం సునీత‌ను గుర్తించ‌లేదు కాబ‌ట్టే తాము ఓడిపోయామ‌ని చెప్పుకునే అవకాశం ఉంటుందన్న భావనే అంటున్నారు పరిశీలకులు. అందుకే ఈ కుటుంబ కుంప‌టి ని  చ‌ల్లార్చేందుకు కేటీఆర్ పూనుకోవడం లేదంటున్నారు. 

అద్దంకిలో వైసీపీ మరో ప్రయోగం.. ఇన్చార్జ్‌గా పల్నాడు డాక్టర్ అశోక్

అద్దంకి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది.  మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు అక్కడ తిరుగులేని పట్టుంది. అద్దంకి ఆయన సొంత నియోజకవర్గం కాకపోయినా, తనకు స్థానికంగా ఉన్న పరిచయాలతో, ఆయన 2009లో సొంత నియోజకవర్గమైన మార్టూరు నియోజకవర్గం రద్దు కావటంతో అద్దంకి వచ్చి    గట్టి పాగానే వేశారు. ప్రజలతో మమేకమై ప్రజాభిమానాన్ని పొంది ఓటమెరుగని నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2004 నుండి 2024 వరకు ఓటమన్నదే ఎరగకుండా.. పార్టీతో సంబంధం లేకుండా ఐదు సార్లు విజయం సాధించిన అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్.  2004వ సంవత్సరంలో రాజకీయాల్లోకి వచ్చిన రవికుమార్  మార్టూరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సోదరుడు గొట్టిపాటి నరసయ్యపై విజయం సాధించారు. 2009 ఎన్నికలలో మార్టూరు నియోజకవర్గం రద్దు కావడంతో అద్దంకి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి కరణం బలరాంపై విజయ ఢంకా మోగించారు. 2014 ఎన్నికల్లో వైసీపీలో చేరిన రవికుమార్ బలరాం కుమారుడు కరణం వెంకటేష్ పై పోటీ చేసి విజయం సాధించారు. అనంతర పరిణామాలలో గొట్టిపాటి ఫ్యాను పార్టీని వీడి సైకిల్ ఎక్కారు.  2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి వైసిపి అభ్యర్థి గరటయ్యపై మరో గెలుపు సొంతం చేసుకున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి పాణెం హనిమిరెడ్డిపై భారీ విజయం సాధించి ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు పొందటమే కాకుండా విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 పార్టీ ఆవిర్భావంలో గొట్టిపాటి రవి చలవతో అద్దంకి నుంచి విజయం సాధించిన వైసీపీ తిరిగి అక్కడ పాగా వేసేందుకు ప్రయత్నాలు అయితే చేస్తోంది గాని ఫలితం లేకుండా పోతుంది. ప్రతి ఎన్నికలకు అభ్యర్థిని మారుస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఫలితాలతో నిరాశ చెందుతోంది.  2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన పాణెం హనిమిరెడ్డి ఎన్నికల అనంతరం పెట్టా బేడా సర్దేశారు. దీంతో రాబోయే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసి విజయం సాధించాలని పట్టుదలతో ఉన్న వైసీపీ అధ్యక్షుడు జగన్  సత్తా ఉన్న నేత కావాలి అంటూ పలు ప్రయత్నాలు చేసారు. ఆ క్రమంలో పక్కనున్న పల్నాడు జిల్లాకు చెందిన డాక్టర్  అశోక్‌ను అద్దంకి వైసీపీ ఇన్చార్జ్‌గా నియమించారు. వైసిపి వైద్య విభాగపు నేతగా జగన్ దగ్గర గుర్తింపు తెచ్చుకున్న అశోక్ అద్దంకిలో తన సత్తా చూపిస్తానంటూ అధినేతకు మాటిచ్చి వచ్చారంట. ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గంలో యాక్టివ్ గా తిరుగుతూ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నాలనైతే ముమ్మరం చేశారు. అద్దంకిలోని నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న అశోక్ ప్రతి విషయంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే కొంతమంది టిడిపి నేతలను కూడా తన వైపునకు తిప్పుకునేందుకు పలు ప్రయత్నాలు మొదలుపెట్టారంట.అద్దంకి పట్టణానికి చెందిన 50 కుటుంబాలను పార్టీలోకి చేర్చుకొని అధినేత దగ్గర మంచి మార్కులే వేయించుకున్నారంటున్నారు. స్థానిక నేతలకు అందుబాటులో ఉంటూ అద్దంకిలో అశోక్ తన ప్రాబల్యాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తుఫాను సమయంలో అధికారులు గుండ్లకమ్మలో చిక్కుకుపోతే వారిని కాపాడటానికి రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొని తాను ప్రజలకు దగ్గరగా ఉన్నానని సంకేతాలను పంపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటమి ఎరగని నేతగా తనదైన రాజకీయ చాతుర్యంతో దూసుకుపోతున్న గొట్టిపాటి రవి కుమార్ ముందు అశోక్ ఎంతవరకు సక్సెస్ అవుతారు అనే అనుమానాలనైతే అద్దంకి ప్రజలు వ్యక్తపరుస్తున్నారట.  రాజకీయ ఉద్దండుడు ప్రజా నేతగా గుర్తింపు ఉన్న గొట్టిపాటి రవికుమార్‌ను అశోక్ ఎంతవరకు ఎదుర్కోగలరు అనే అనుమానాలను  సొంత పార్టీ నేతలే వ్యక్తపరుస్తున్నారంట. ఎన్నికలకు చాలా సమయం ఉందని అప్పటి వరకు నిలకడగా పనిచేసి, ప్రజలతో మమేకమై భరోసా కల్పిస్తే అద్దంకిలో సక్సెస్ కావడం పెద్ద కష్టం కాదని కొందరు వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.   ఆరంభ శూరత్వమో ... చివరి వరకు పోరాడే తత్వమో తెలియదు కానీ తాను ప్రజలకు అందుబాటులో ఉంటూ ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నానని సంకేతాలను అయితే అటు అధిష్టానంతో పాటు ఇటు అద్దంకి ప్రజానీకానికి కూడా అశోక్ పంపే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు సొంత పార్టీ నేతలు సరైన నాయకుడు వచ్చాడు అంటూ చెప్పుకుంటుండగా,  మరికొందరు మాత్రం ఐరావతం ముందు ఎలుక పిల్ల ఎంతవరకు పోటీ ఇవ్వగలుగుతుందనే విమర్శలు కూడా చేస్తున్నారట. అయితే రాజకీయాలలో ఎవరూ శాశ్వతం కాదని  ... ట్రెండ్... ప్రజానాడి ఎవరు పట్టగలిగితే వారే సక్సెస్‌ఫుల్ నేతలని ఎన్నో సందర్భాలలో రుజువైందని ... తాను కూడా అదే విధంగా విజయం సాధిస్తానంటూ అశోక్ సొంత పార్టీ నేతలకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్న చందంగా సొంత పార్టీ నేతలకు నమ్మకం భరోసా కల్పించి తరువాత తన సత్తా ఏంటో అద్దంకి నియోజకవర్గానికి చూపాలనే భావనలో అశోక్ ఉన్నారట.  మరి ఎంతవరకు ఈ డాక్టర్ అద్దంకి ప్రజల నాడిని పట్టగలుగుతారో చూడాలి .

బీహార్ తొలి విడతలో ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా గురువారం (నవంబర్ 6) తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు ఉత్సాహంగా ముందుకు వచ్చి మరీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అన్నిటికీ మించి తొలి విడతలో గతంలో ఎన్నడూ లేని విధంగా 64.66 శాతం పోలింగ్ నమోదైంది. బీహార్ ఎన్నికల చరిత్రలో ఇది రికార్డు స్థాయి అని చెప్పవచ్చు.   రాష్ట్రంలో ఈ స్థాయిలో పోలింగ్ జరగడం ఇదే తొలిసారి.  రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా తొలి విడతలో  121 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇక రెండో విడత పోలింగ్  నవంబర్ 11న జరగనుంది. ఆ విడతలో  మిగిలిప 122 స్థానాలకూ పోలింగ్ జరుగుతుంది.  సరే ఇక తొలి విడతలో పోలింగ్ విషయానికి వస్తే.. మహిళలు అత్యధికంగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఓటింగ్ శాతం పెరగడం అధికార కూటమికా, లేక ఇండియా కూటమిగా ఎవరికి ప్లస్ కానుందన్న చర్చ అప్పుడే మొదలైంది. అలాగే.. జనసురాజ్ పార్టీ ప్రభావం ఏమేరకు ఉంటుందన్న అంచనాలు కూడా మొదలయ్యాయి.  బీహార్ అసెంబ్లీకి 1951-52లో జరిగిన మొదటి  ఎన్నికల్లో  అత్యల్పంగా 42.6 శాతం పోలింగ్ నమోదైంది. ఇక 2000 సంవత్సరంలో 62.57 శాతం పోలింగ్ నమోదు కాగా.. 2020లో 57.29 శాతం నమోదైంది. అయితా  తాజాగా   తొలి విడతలోనే 64.66 శాతం పోలింగ్ నమోదైంది. ఇదే రాజకీయ పరిశీలకుల విశ్లేషణలకు పదును పెట్టింది. పోలింగ్ శాతం భారీగా ఉండటంపై పలు రకాల విశ్లేషణలు వస్తున్నాయి. ముఖ్యంగా మహిళల ఓటింగ్ శాతం భారీగా పెరగడం జనం రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారనడానికి సంకేతమని అంటున్నారు. అయితే భారీగా పోలింగ్ నమోదు కావడంపై రాజకీయ విశ్లేషకులు రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మార్పు కోసమే మహిళలు తరలివచ్చారని చెబుతున్నారు. కాదు కాదు.. అధికార కూటమి పనితీరుకు ప్రజలు పాజిటివ్ గా స్పందించడమే ఓటింగ్ శాతం పెరగడానికి కారణమని కొందరు విశ్లేషిస్తున్నారు.  అయితే పెరిగిన ఓటింగ్ శాతం ఏ కూటమికి కలిసి వచ్చిందన్నది తేలాలంటే ఫలితాలు వెలువడే నవంబర్ 14 వరకూ ఎదురు చూడాల్సిందే.