ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు

 

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ కేసుకు సంబంధించి బీఆర్‌ఎస్ నేతలపై దృష్టి సారించిన సిట్, కీలక నేతలకు నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టింది. ఇప్పటికే పలువురు నేతలను ప్రశ్నించిన సిట్, తాజాగా బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌ను విచారణ కు పిలిచింది. నోటిసీలకు స్పందించిన జైపాల్ యాదవ్ సిట్ ఎదుట హాజరై వివరాలు వెల్లడించారు.గత ఏడాది నవంబర్ 17న కూడా జైపాల్ యాదవ్ సిట్ విచారణకు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.

 అప్పట్లో ఇచ్చిన వాంగ్మూలంతో పాటు తాజా విచారణలో వెల్లడైన అంశాలను సిట్ సమగ్రంగా పరిశీలిస్తోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అడిషనల్ ఎస్పీ తిరుప తన్నతో జైపాల్ యాదవ్‌కు ఎన్నికల సమయంలో ఫోన్ సంభాషణలు జరిగినట్లు సిట్ గుర్తించినట్లు సమాచారం. ఆ కాల్స్  ఉద్దేశం, పరిస్థితులపై సిట్ లోతుగా విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా ఒక కేసుకు సంబంధించి భార్యాభర్తల మధ్య నెలకొన్న సమస్యపై తిరుపతన్నతో జైపాల్ యాదవ్ మాట్లాడి నట్లు సిట్‌కు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సంభాషణలు వ్యక్తిగత అంశాలకే పరిమితమా? లేక అధికార దుర్వినియోగం జరిగిందా? అనే కోణంలో సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. 

ముఖ్యంగా ఎన్నికల సమయంలో జరిగిన ఫోన్ కాల్స్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించి, కాల్ డేటా రికార్డులు, టైమింగ్, కాల్ వ్యవధి వంటి అంశాలను విశ్లేషిస్తున్నారు. ఎన్నికల సమయంలో అధికార యంత్రాంగం పాత్రపై ఇప్పటికే తీవ్ర చర్చ జరుగు తున్న నేపథ్యంలో, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలో సిట్ అధికా రులు జైపాల్ యాదవ్ నుంచి విస్తృతంగా ప్రశ్నల వర్షం కురిపిస్తూ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. 

కేసుకు సంబంధించిన అన్ని కోణాలను స్పష్టంగా తెలుసుకునే దిశగా విచారణ కొనసాగుతోంది.ఇదే సమయంలో బీఆర్‌ఎస్ మరో మాజీ ఎమ్మెల్యే చిరు మర్తి లింగయ్య కూడా సిట్ విచారణకు హాజరయ్యారు. ఆయన నుంచి కూడా కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇంకా పలువురు నేతలు, అధికారులు విచారణ పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. దర్యాప్తు పూర్తయ్యాక మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలామంది భావిస్తున్నారు.

మహిళ ఐఏఎస్‌లపై అసత్య కథనాలు...పలువురిపై కేసు నమోదు

  ఒక మహిళ ఐఏఎస్ అధికారిని కించపరిచేలా వార్తలు, కథనాలు ప్రసారం చేసిన ఘటనలో సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్  పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేసిన సిసిఎస్ పోలీసులు ఇప్పటికే కీలక అరెస్టులు చేశారు. ఓ న్యూస్ ఛానల్‌కు చెందిన ఇన్‌పుట్ ఎడిటర్‌తో పాటు ఇద్దరు రిపోర్టర్లను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. మహిళ ఐఏఎస్ అధికారిని వ్యక్తిగ తంగా కించపరిచే విధంగా, ఆమె ప్రతిష్టకు భంగం కలిగిం చేలా అసత్యాలు, అవమా నకర వ్యాఖ్యలతో కూడిన కథనాలను ఉద్దేశపూర్వ కంగా ప్రసారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇది కేవలం మీడియా నైతికత ఉల్లంఘన మాత్రమే కాకుండా, చట్టపరమైన నేరంగా కూడా పరిగణిం చబడుతుందని సిసిఎస్ అధికారులు స్పష్టం చేశారు. 44 యూట్యూబ్ చానల్స్‌పై కేసులు ఈ వ్యవహారంలో టెలివిజన్ ఛానల్స్‌తో పాటు 44 యూట్యూబ్ చానల్స్ కూడా మహిళ ఐఏఎస్ అధికారిని కించపరిచే విధంగా వీడి యోలు, చర్చలు, అభ్యంత రకర కంటెంట్ ప్రసారం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే ఆయా యూట్యూబ్ చానల్స్‌ పై చట్టపరమైన చర్యలకు సిసిఎస్ పోలీసులు రంగం సిద్ధం చేశారు.సోషల్ మీడియా వేదిక ద్వారా తప్పుడు ప్రచారం, దుష్ప్ర చారం చేయడం ద్వారా పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ... అధికారిని అవమా నించే ప్రయత్నం చేసిన వారి ని గుర్తించే పనిలో  నిమగ్న మయ్యారు. ఇప్పటికే పలు వురు యూట్యూబ్ చానల్స్ నిర్వాహకులను గుర్తించి నట్లు అధికారులు వెల్లడించారు.  సాంకేతిక ఆధారాలు, డిజిటల్ ఫుట్‌ప్రింట్స్ ఆధారంగా యూట్యూబ్ చానల్స్ నిర్వాహకుల వివరాలను సేకరించే పనిలో పడ్డ సిసిఎస్ పోలీసులు, వారిని త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశముందని స్పష్టం వ్యక్తం చేశారు. కేసుకు సంబంధించిన ఆధారాలు పటిష్టంగా ఉన్నాయని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు హెచ్చ రించారు. ఈ ఘటనపై సిసిఎస్ పోలీసుల దూకు డుతో పలువురు యూట్యూబ్ చానల్స్ నిర్వాహకులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. కొందరు వీడియోలను తొలగించగా, మరికొందరు తమ చానల్స్‌ను తాత్కా లికంగా మూసివేసినట్లు తెలుస్తోంది. అయితే డిలీట్ చేసిన కంటెంట్ కూడా డిజిటల్ ఆధారాల రూపంలో తమ వద్ద ఉందని పోలీ సులు చెబుతున్నారు. మీడియాకు సిసిఎస్ హెచ్చరిక ఈ సందర్భంగా సిసిఎస్ పోలీసులు మీడియా సంస్థ లకు కీలక హెచ్చరికలు చేశారు. వ్యక్తుల గౌరవం, ముఖ్యంగా మహిళా అధి కారుల ప్రతిష్టను దెబ్బ తీసేలా అసత్య కథనాలు ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మీడియా స్వేచ్ఛ పేరుతో చట్టాలను ఉల్లంఘిస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు.ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. జర్నలిస్టుల అక్రమ అరెస్టును టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఖండించారు.జర్నలిస్టులను అర్ధరాత్రి అక్రమ అరెస్ట్ చేయడం కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మంచిది కాదని ఆయన సుచించారు.జర్నలిస్టుల అరెస్ట్‌ను వెంటనే ఆపాలంటూ సీపీ సజ్జనార్, డీజీపీ శివధర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.మహిళా ఐఏఎస్ అధికారిపై అసభ్యకర కథనాలు ప్రసారం చేసిన కేసులో ఓ వార్తా సంస్థ ఇన్ పుట్ ఎడిటర్, ఇద్దరు జర్నలిస్టులను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.  మరోవైపు ప్రముఖ న్యూస్ ఛానల్‌పై  సిట్ అధికారులు తనిఖీలు నిర్వహించి ఆఫీసులో సర్వర్లు లాగేసి, కంప్యూటర్లు సీజ్ చేశారు.

డబ్ల్యూపీఎల్‌‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సరికొత్త రికార్డు

  డబ్ల్యూపీఎల్‌ 2026లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మంగళవారం గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయంగా 71 పరుగులు చేసి జట్టును ఏడు వికెట్ల తేడాతో విజయతీరాలకు చేర్చింది. ఈ ఇన్నింగ్స్‌తో డబ్ల్యూపీఎల్ చరిత్రలో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్‌గా హర్మన్‌ప్రీత్ రికార్డులకెక్కింది.  మొత్తంగా ఈ ఘనత సాధించిన ప్లేయర్లలో హర్మన్(1016 పరుగులు) రెండో స్థానంలో ఉంది. అగ్రస్థానంలో ముంబై ఇండియన్స్‌కే చెందిన నాట్ సీవర్ బ్రంట్(1101పరుగులు) కొనసాగుతోంది. గుజరాత్‌తో మ్యాచులో 193 పరుగుల లక్ష్యంతో ఛేదనకి దిగిన ముంబైకి ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలినా, హర్మన్‌ప్రీత్ క్రీజులోకి వచ్చాక మ్యాచ్ దిశ పూర్తిగా మారిపోయింది. హర్మన్ విధ్వంసానికి గుజరాత్ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. హర్మన్‌కు నికోల్ కేరీ (23 బంతుల్లో 38*) చక్కటి సహకారం అందించింది.  

అమలాపురంలో వెయ్యి అడుగులు భారీ పిడకల దండ

  తెలుగువారు మూడు రోజుల పాటు జరుపుకునే సంక్రాంతి ఉత్సవాల్లో  మొదటి రోజు నిర్వహించే భోగి ప్రత్యేకమనే చెప్పుకోవాలి. తెల్లవారుజామునే అభ్యంగ స్నానమాచరించి.. ఆవు పేడతో చేసే పిడకలను భోగి మంటల్లో వేస్తారు. ఇంట్లోని పాత, ఉపయోగంలో లేని వస్తువులను భోగి మంటల్లో వేస్తే శుభం కలుగుతుందని ప్రజలు విశ్వసిస్తారు. ఇదిలా ఉండగా.. భోగి పండుగను పురస్కరించుకుని అంబేడ్కర్ కోనసీమలో రూపొందించిన భారీ భోగి దండ అందరినీ ఆకట్టుకుంటోంది.  అమలాపురంలోని రంగాపురం గ్రామస్థులు ఈ భోగి మాలతో సంక్రాంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. దాదాపు 20 వేల పిడకలతో 1000 అడుగుల భారీ భోగి దండను తయారు చేశారు గ్రామస్థులు. ఆ ఊళ్లోని విశ్వనాథ రాజు కుటుంబం.. స్థానికులతో కలిసి ఆవు పేడతో 20 రోజుల పాటు శ్రమించి ఈ హారాన్ని తయారు చేసింది. తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసేందుకు గత ఆరేళ్లుగా భారీ భోగి దండలను గ్రామస్థులు తయారు చేస్తున్నారు. ఆరేళ్ల క్రితం 400 అడుగులతో మొదలైన భోగి దండ తయారీ నేడు 1000 అడుగులకు చేరిందని ఆ ఊరి ప్రజలు వివరించారు.  సుమారు అర కిలోమీటర్ మేర ఉన్న ఈ భారీ భోగి మాలను గ్రామస్థులతో కలిసి విశ్వనాథరాజు కుటుంబ సభ్యులు భోగి మంటలో వేశారు.  ప్రస్తుతం ఈ భారీ భోగి దండ జిలాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. కాకినాడ జిల్లా పిఠాపురం జై గణేశ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో 14 వేల ఆవు పిడకలతో భోగిమంట వేశారు. ఆలయం నుంచి మేళ తాళాలు, తప్పెడు గూళ్లు, గంగిరెద్దులు, హరిదాసుల సంకీర్తనలతో కోటగుమ్మం సెంటర్ వద్ద భోగి మంట వేశారు. ఆలయ అర్చకులు మైలవరపు రామకృష్ణ భోగి మంట వద్ద ప్రత్యేక పూజలు చేశారు.

పొంగల్ వండిన ప్రధాని మోదీ

  ఢిల్లీలోని కేంద్రమంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పొంగల్‌ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.  తొలుత ప్రత్యేక పూజా కార్యక్రమాలను ప్రధాని నిర్వహించారు. అనంతరం ఆయనే స్వయంగా పొంగల్‌ వండారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ గోవులకు పూజ చేశారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతు  వెయ్యి సంవత్సరాల పురాతనమైన గంగైకొండ చోళపురం ఆలయ సందర్శన, పంబన్ వంతెన ప్రారంభోత్సవ సమయాల్లో తమిళుల చరిత్ర గొప్పతనాన్ని తెలుసుకున్నట్లు పేర్కొన్నారు.  కొన్ని నెలల క్రితం సహజ వ్యవసాయంపై తమిళనాడులో జరిగిన ఓ సమావేశానికి తాను హాజరైనట్లు ప్రధాని తెలిపారు. అక్కడ లాభదాయకమైన వృత్తులను వదిలి వ్యవసాయం వైపు మళ్లిన యువతను కలిశానని,   వ్యవసాయ రంగంలో విప్లవాన్ని తీసుకురావడానికి వారు చేస్తున్న కృషిని మరింత విస్తరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పొంగల్ వేడుకల్లో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, రామ్మోహన్‌నాయుడు, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. మరోవైపు ఈ పొంగల్ వేడుకను పలువురు ప్రముఖులు ఘనంగా జరుపుకుంటున్నారు. అలానే దేశ వ్యాప్తంగా ప్రజలు వివిధ రకాల వంటకాలు చేసుకుని, ఇళ్లను అలకరించుకుని పండగను ఘనంగా జరుపుకుంటున్నారు.

రైలుపై జారిపడిన క్రేన్.. 22 మంది మృతి

  థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బ్యాంకాక్‌కు 230 కి.మీ దూరంలో ఉన్న సిఖియో జిల్లాలో కదలుతున్న రైలు మీద క్రేన్ పడింది. దీంతో రైలు పట్టాలు తప్పి బోగీల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందగా 79 మందికి పైగా గాయపడ్డారు. ఘటన జరిగిన సమయంలో రైలులో 195 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ కోసం నిర్మాణ పనులు జరుగుతుండగా ప్రమాదం జరిగినట్లు స్ధానిక అధికారులు తెలిపారు.  ప్రమాదం జరిగిన వెంటనే రైలులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను వెలికితీసేందుకు స్థానిక పోలీసులు, రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మృతుల సంఖ్యను నఖోన్ రాట్చసిమా పోలీస్ చీఫ్ ధృవీకరించారు. ఈ ఘోర ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని థాయ్‌లాండ్ రవాణా మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

దేశ ప్రజలకు ప్రధాని మోదీ సంక్రాంతి శుభాకాంక్షలు

  సంక్రాంతి పర్వదిన సందర్బంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మకర సంక్రాంతి మీ జీవితాల్లో సరికొత్త ఆశయాలు, ఉన్నత లక్ష్యాలను నింపాలని కోరుకుంటున్నాని ఎక్స్ వేదికగా ప్రధాని తెలిపారు.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైన నువ్వులు-బెల్లం తీపిదనంతో నిండిన ఈ దివ్యమైన పండుగ, ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శ్రేయస్సు, విజయాన్ని తీసుకురావాలి. సూర్య భగవానుడు మనందరినీ ఆశీర్వదించాలి" అని పేర్కొన్నారు.  ముఖ్యంగా ఈ పండుగ మన అన్నదాతలది. నిరంతరం శ్రమిస్తూ దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు కృతజ్ఞతలు తెలిపే పవిత్ర సమయం. ఈ సందర్బంగా సమాజంలో శాంతి, సామరాస్యాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నా అని ట్వీట్టర్ వేదికగా తెలిపారు. మకర సంక్రాంతి, మాఘ్ బిహు, పొంగల్ వంటి పండుగలు భారతదేశపు పంట కోతల పండుగలని, ఇవి మన దేశ సంప్రదాయాల గొప్పతనాన్ని చాటి చెబుతాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు. వ్యవసాయ సంస్కృతితో ముడిపడి ఉన్న ఈ పండుగలు రుతువుల మార్పుకు సూచికగా నిలుస్తాయని, ప్రకృతి, సాంస్కృతిక వైవిధ్యం, సామాజిక సామరస్యాన్ని ప్రతిబింబిస్తాయని తెలిపారు.

భోగి సంబరాల్లో మంత్రుల కోలహలం

  ఏపీలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. అనకాపల్లి జిల్లా నర్నీపట్నంలో జరిగిన కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. తెలుగు భాషా సంస్కృతులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. నక్కలపల్లిలో   హోంమంత్రి అనిత డప్పు వాయించి సందడి చేయగా చేశారు. కుటుంబసభ్యులతో కలిసి ఆమె భోగి మంటలు వేసి సందడి చేశారు. అనంతరం గో పూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వేడుకల్లో ఏర్పాటు చేసిన కేరళ డప్పులను  హోంమంత్రి కొద్దిసేపు వాయించి అందరిలో ఉత్సాహం నింపారు.  పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం పెదఅమిరంలో ఉప సభాపతి రఘురామకృష్ణరాజు నివాసం వద్ద భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాజకీయ ప్రముఖులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, అధికారులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారునెల్లూరు జిల్లాలో పెద్దఎత్తున భోగి సంబరాలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో నిర్వహించిన భోగి సంబరాల్లో మంత్రి నారాయణ, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో భోగి వేడుకలు నిర్వహించారు. ఎంపీ శాస్త్రోక్తంగా పూజలు చేసి భోగి మంటలు వెలిగించారు. ఈ వేడుకల్లో టీడీపీ నేతలు గద్దె అనురాధ, బొప్పన భవకుమార్ తదితరులు పాల్గొన్నారు  

తిరుమలలో ఘనంగా భోగి వేడుకలు.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు

తిరుమలలో   భోగి పండుగ సందర్భంగా బుధవారం ( జనవరి 14)   వేకువజామునే ఆలయం ముందు అర్చకులు, సిబ్బంది భోగి మంటలు వేసి సంబరాలు జరుపుకున్నారు.   ఉత్తరాయణంలో మొదటిగా వచ్చే పండుగ భోగి.  ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ధనుర్మాస కైంకర్యాలు నిర్వహించారు. ప్రతి ఏడాది ఆలయం ముందు భోగి మంటలు వేసి  భోగి వేడుకల్లో భక్తులను   భాగస్వాములు చేయడం ఆనవాయితీ. అందులో భాగంగానే బుధవారం (జనవరి 14) భోగి సందర్భం  మహా ద్వారానికి ముందు భోగి మంటలు వేసి వేడుక నిర్వహించారు. అలాగే  టీటీడీ చైర్మన్  బి.ఆర్. నాయుడు  తిరుమలలో భోగి పండుగ జరుపుకున్నారు.  తిరుమలలోని తన  క్యాంపు కార్యాలయంలో సిబ్బందితో కలిసి చైర్మన్ భోగి పండుగను జరుపుకున్నారు. భోగి వేడుకలు నిర్వహించారు. ీ సందర్భంగా ఆయన భోగి పండుగ అందరికీ  భోగ భాగ్యాలు అందించాలని  ఆకాంక్షించారు. 

ఉత్తరాంధ్ర కాదు ఉత్తమాంధ్ర.. కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వేసిన కేంద్ర మంత్రి

కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాశుళంలోని తన స్వగృహంలో కుటుంబ సభ్యులతో కలిసి భోగి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మన తరువాతి తరాలకు ఆచార సాంప్రదాయాలను చేరవేసే భాద్యతను ప్రతీ ఒక్కరు తీసుకోవాలని పిలుపునిస్తూ ప్రజలకు   భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.   కూటమి సర్కారు ప్రజారంజక పాలనలో ప్రతీ పల్లెలో సంక్రాంతి శోభ మెండుగా కనిపిస్తోందని, ప్రతీ ఇంట సిరుల సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయన్న ఆయన  పుట్టిన ఊరికి పంచే మమకారమే నిజమైన సంక్రాంతి అన్నారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ఇబ్బందులు లేని వ్యవసాయాన్ని అన్నదాతలు చేస్తున్నారని, ధాన్యం కొనుగోళ్ళ విషయంలో ఎలాంటి జాప్యం, ఇతరుల ప్రమేయం లేకుండా సక్రమంగా చెల్లింపులు సత్వరం జరుగుతున్నాయనీ, ప్రధాని మోదీ తోడ్పాటుతో ఉత్తరాంధ్రను ఉత్తమాంధ్రగా మార్చే కీలక ప్రాజెక్టులు మరికొద్ది రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు.   భోగాపురం విమానాశ్రయాన్ని జూన్ కన్నా ముందే ప్రారంభిస్తామని స్పష్టం చేసిన రామ్మోహన్ నాయుడు.. దానికి అనుసంధానంగా శ్రీకాకుళం జిల్లాలో విస్తృతంగా పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని అన్నారు. వచ్చే సంక్రాంతి నాటికి సరికొత్త ఉత్తరాంధ్ర సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.