పెదనాన్న వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్య
posted on Oct 3, 2025 @ 6:02PM
ఒకవైపు తండ్రి మరణం....మరోవైపు పెదనాన్న వేధింపులు.... ఇంకోవైపు నానమ్మ తాతయ్య శాపనార్థాలు వీటన్నిటిని భరించలేక ఓ మైనర్ బాలిక బలవన్మరణానికి పాల్పడిన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంపల్లి పోచమ్మ గడ్డలో నివాసం ఉంటున్న అనురాధ అనే మహిళకు అంజలి, పింకీ (17) అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. భర్త చనిపోయాడు. అనురాధ ఓ చిన్న ఉద్యోగం చేస్తూ పిల్లలని చదివిస్తుంది.
అయితే అనురాధ నివాసం ఉంటున్న ఇంటిని ఎలాగైనా సరే సొంతం చేసుకో వాలని బావ శీను అనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అనురాధ మరియు ఆమె ఇద్దరు పిల్లలను బయటకు పంపాలని నిర్ణయించుకున్న బావ శీను ప్రతిరోజూ వారితో గొడవపడి మానసికంగా వేధింపు లకు గురి చేయడం మొదలుపెట్టాడు. నిన్న రెండో తేదీన తల్లి ఇంట్లో లేని సమయంలో పెదనాన్న శీను వచ్చి నానా గొడవ చేసాడు.
తన తండ్రి చనిపోయిన తర్వాత అతనికి రావలసిన డబ్బుల కోసం మరియు ఇంటి కోసం సొంత పెదనాన్న వచ్చి ఇంటి ముందు పెద్ద ఎత్తున గొడవ చేస్తూ అవమానపరిచాడు. దీంతో పింకీ(17) తీవ్ర మనస్థా పానికి గురై సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్ కి చీరతో ఊరేసుకొని ఆత్మ హత్య చేసుకుంది పోలీసులు సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఒకవైపు నాన్న చనిపోవడం తో అమ్మ ఒక్కతే పని చేస్తూ మా ఇద్దరిని చదివి స్తుంది. ఇంట్లో కావలసిన సరుకులు తీసుకురావడమే కాకుండా నా కాలేజ్ ఫీజు కూడా కడు తుంది.
ఒక్కతే ఇవన్నీ పనులు చేస్తుంది...మరో వైపు పెదనాన్న ప్రతిరోజు ఇంటికి వచ్చి గొడవ చేస్తూ ఉండడంతో చుట్టుపక్కల వాళ్ళందరూ వింతగా చేస్తు న్నారని... పెదనాన్న డబ్బుల కోసం... తాము ఉంటున్న ఇంటి కోసం.... ఇలా మమ్మల్ని వేధింపు లకు గురి చేస్తు న్నాడని పెదనాన్న తో పాటు నానమ్మ, తాతయ్య కూడా ప్రతిరోజు మమ్మల్ని తిట్టిపోస్తున్నారని.. ఈ అవమానాన్ని భరించలేకే తాను ఆత్మహత్య చేసు కుంటున్నానని తన చావుకు పెదనాన్నే కారణం అంటూ పింకీ తన సూసైడ్ నోట్ లో పేర్కొంది... తన కూతురు మరణానికి కారణమైన శీలను కఠినంగా శిక్షించాలంటూ తల్లి అనురాధ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతురాలు పింకీ రాసిన సూసైడ్ నోట్ ను ఆధారంగా చేసుకుని పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు...