ఏపీలో తెలుగుదేశంకే జనం జై.. శ్రీ ఆత్మ సాక్షిసర్వే వెల్లడి

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి   వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేస్తుంటే.. విపక్ష నేత చంద్రబాబునాయుడు ప్రభుత్వ వ్యతిరేక పవనాలలో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమని చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి ఏమిటి.. 175కు 175 స్ధానాలలో విజయం సాధిస్తామన్న వైసీపీ ధీమా, తమ గెలుపు నల్లేరు మీద బండి నడకేనన్న విపక్షం విశ్వాసం. వాస్తవంగా ప్రజలేమనుకుంటున్నారు.  అంటే శ్రీ ఆత్మసాక్షి సర్వే అటు అధికార పార్టీ ధీమా.. ఇటు విపక్షం విశ్వాసం రెండూ కూడా అతిశయోక్తిగానే ఉన్నాయని చెబుతోంది. 175కు 175 సంగతి పక్కన పెట్టి అసలు అధికారంలోకి రావడానికి అవసరమైన స్థానాలలో గెలవడానికే వైసీపీ చెమటోడ్చక తప్పదని చెబుతోంది. అలాగే గత ఎన్నికలతో పోలిస్తే బ్రహ్మాండంగా పుంచుకున్న తెలుగుదేశం కూడా అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే మరింత కసరత్తు చేయక తప్పదని సర్వే పేర్కొంది.

ఏపీలో రాజకీయ వేడి ఎల్ నినో కారణంగా వాతావరణంలో పెరిగిన ఉష్ణోగ్రతలను తలదన్నేలా ఉంది. ఎన్నికలకు ఇంకా ఏడాదిపైనే సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే ఎన్నికల హీట్ దినదిన ప్రవర్ధమానంగా పెరిగిపోతున్నాది. ఈ నేపథ్యంలోనే పార్టీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు పెచ్చరిల్లుతున్నాయి. అయితే రాష్ట్రంలో వాస్తవంగా ఏ పార్టీకి మెరుగైన విజయావకాశాలు ఉన్నాయి. ఏ పార్టీ వెనుకబడి ఉంది.  ఇత్యాది అంశాలన్నిటినీ పరిగణనలోనికి తీసుకుని శ్రీ ఆత్మసాక్షి సర్వే ఫలితాన్ని వెలువరించింది. 

ఎన్నికల ఫలితాలను దాదాపు కచ్చితంగా అంచనా వేసే సర్వే సంస్థలలో శ్రీ ఆత్మసాక్షి ఒకటి. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పూర్తి సాధికారతతో ముందుగానే శ్రీ ఆత్మసాక్షి సర్వే వెల్లడించింది. ఆ సర్వేలో ఆ ఎన్నికలలో వైసీపీ ఘన విజయాన్ని యాక్యురేట్ గా అంచనా వేసింది. సర్వే చెప్పిన విధంగానే ఫలితాలు ఉన్నాయి. అప్పటి ఎన్నికలలో వైసీపీ 139 నుంచి 142 స్థానాలలో విజయం సాధిస్తుందని, అలాగే అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం 22 నుంచి 28 స్థానాలలో విజయం సాధిస్తుందని  ఇక జనసేన 0 నుంచి 2 స్థానాలలో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. వాస్తవ ఫలితాలు కొంచం అటూ ఇటూలో సరిగ్గా అలాగే వచ్చాయి. వైసీపీ 151 స్థానాలలో విజయం సాధించగా, తెలుగుదేశం పార్టీ 23 స్థానాలలో గెలుపొందింది. ఇక పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. అలాగే పాలకొల్లు, ఉండి, హిందుపూర్, ఇచ్చాపురం, అలాగే విశాఖ నగరంలోని నాలుగు అసెంబ్లీ స్థానాలనూ కూడా వైసీపీ కోల్పోతుందని  కచ్చతంగా అంచనా వేసింది శ్రీ ఆత్మసాక్షి సర్వే. ఫలితం కూడా అలాగే వచ్చింది.  అదే విధంగా రాష్ట్రంలోని పాతిక పార్లమెంటు నియోజకవర్గాలలో వైసీపీ 22 స్థానాలలోనూ తెలుగుదేశం 2 స్థానాలలోనూ విజయం సాధిస్తాయన్న శ్రీ ఆత్మసాక్షి సర్వే అంచనా అక్షరాలా నిజమైంది. 
ఇక మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల విషయంలో కూడా శ్రీ ఆత్మసాక్షి సర్వే ఏం చెప్పిందో సరిగ్గా అదే జరిగింది. ఫలితం అలాగే వచ్చింది. 

 దీంతో శ్రీ ఆత్మసాక్షి సర్వేలపై ప్రజలలో విశ్వసనీయత పెరిగింది. అటువంటి సంస్థ తాజాగా మూడ్ ఆఫ్ ఏపీ పేరుతో 2024 అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయి. ఏ పార్టీ ఎన్నెన్ని స్థానాలలో గెలుచుకుంటుంది. ఏ యే స్థానాలలో హోరాహోరీ పోరు ఉంటుంది అన్న అంశాలపై రాష్ట్రంలో దశల వారీగా సమగ్ర సర్వే నిర్వహించింది. ఆ సర్వే ఫలితాలను సమగ్రంగా వెలువరించింది. జిల్లాల వారీగా నియోజకవర్గాలలో పార్టీల విజయావకాశాలు, హోరాహోరీ పోరు ఉండే నియోజకవర్గాలు ఇత్యాది వివరాలతో శ్రీ ఆత్మసాక్షి సర్వే విడుదల చేసింది. 

జిల్లాల వారీగా ఏయే నియోజకవర్గాలలో ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయి. ఏయే నియోజకవర్గాలలో హోరాహోరీ పోరు తప్పదు అన్న అంశాలపై శ్రీ ఆత్మసాక్షి సర్వే శాస్త్రీయంగా నిర్వహించిన సర్వే ఫలితాలు తెలుగుదేశం పార్టీకి ఒకింత మొగ్గు కనిపిస్తున్నా.. గెలుపు అంత సులభసాధ్యం కాదని సర్వే ఫలితం చెబుతోంది. అలాగే మరో సారి అధికారం చేజిక్కించుకుకోవడంపై ధీమా వ్యక్తం చేస్తున్న వైసీపీకి అంత సీన్ లేదనీ సర్వే ఫలితం వెల్లడించింది.  శ్రీ ఆత్మసాక్షి సర్వే శాస్త్రీయంగా, నిష్పాక్షికంగా ఈ సర్వే నిర్వహించింది. ఇద్దరు ఎన్ ఆర్ ఐలు, ముగ్గురు రాజకీయవేత్తల కోరిక మేరకు ఈ సర్వే నిర్వహించింది. 
మొదటి దశ సర్వేను గత ఏడాది సెప్టెంబర్ 3న విడుదల చేసింది. ఆ సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీ 77 స్థానాలలో, వైసీపీ 56, జనసేన 4 స్థానాలలో విజయం సాధిస్తాయి.  ఈ సర్వే విడుదల చేసిన మూడు నెలల తరువాత ఈ సంస్థ మూడు విడతల్లో మరో సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఫలితాలనే ఇప్పుడు విడుదల చేసింది. ఈ సర్వే కోసం నియోజకవర్గానికి సగటున 330 మందితో డైరెక్ట్ గా ఇట్రాక్ట్ అయ్యారు. అంటే రాష్ట్రంలో ఈ సర్వే సంస్థ 60 వేల 200 శాంపిల్స్ నుంచి కలెక్ట్ చేసిన వివరాలను ఇప్పుడు వెలువరించింది.  ఈ సర్వే మూడు విడతల్లో గత ఏడాది నవంబర్ 20 నుంచి ఫిబ్రవరి 17 వరకూ నిర్వహించింది. అదే మొదటి దశ సర్వేలో అయితే శ్రీ ఆత్మసాక్షి సర్వే ప్రతినిథులు రాష్ట్రం మొత్తంలో లక్షా 370 వేల శాంపిల్స్ నుంచి వివరాలు సేకరించారు. ఆ విషయం పక్కన పెడితే తాజా సర్వే ప్రకారం  రాష్ట్రంలో అధికార వైసీపీకి 41.50 శాతం ఓటర్ల మద్దతు ఉండగా తెలుగుదేశం పార్టీకి 42.50 శాతం మంది, జనసేనకు 11 శాతం మంది ఓటర్లు మద్దతు పలికారు. ఇతరులు 2.5శాతం ఉండగా, సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ మరో 2.5శాతంగా ఉంది. మొత్తం మీద 175 నియోజకవర్గాలలో అధికార వైసీపీ 63 స్థానాలలో విజయం సాధించే అవకాశాలు ఉంటే, తెలుగుదేశం పార్టీకి ఆ అవకాశాలు 78 స్థానాలలో ఉన్నాయి. ఇక జనసేన విషయానికి వస్తే ఈ పార్టీ 7 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది. మరో 37 నియోజకవర్గాలలో హోరాహోరీ పోరు సాగనుంది. ఇలా హోరా హోరీ పోరు సాగే నియోజకవర్గాలలో కూడా విపక్ష వైసీపీకి 14 చోట్ల, తెలుగుదేవం పార్టీకి 13 చోట్ల కొద్ది పాటి మొగ్గు కనిపిస్తోంది. 
ఇక జిల్లాల వారీగా పార్టీల విజయావకాశాల విషయానికి వస్తే..

శ్రీకాకుళొం జిల్లాలో మిత్తం 10 స్థానాలు ఉండగా వీటిలో ఇచ్చాపురం, ఎచ్చెర్ల, పాతపట్నం, రాజాం, పలాస, అముదాల వలస స్థానాలలో తెలుగుదేవం, పాలకొంండ, నరసన్నపేటలలో వైసీపీకి విజయావకాశాలు ఉన్నాయి. టెక్కలి, శ్రీకాకుళంలలో హోరా రోహీ పోరు సాగుతుంది. అంటే జిల్లాలోని పది నియోజకవర్గాలలో 6 స్థానాలలో తెలుగుదేశం, 2 స్థానాలలో వైసీపీకి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని సర్వే పేర్కొంది. మిగిలిన రెండు స్థానాలలో అంటే టెక్కటి, శ్రీకాకుళం లలో హోరాహోరీ పోరు సాగుతుంది.

అలాగే  విజయనగరం  జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో నాలుగు నిజోజకవర్గాలలో తెలుగుదేశం, మూడు నియోజకవర్గాలలో వైసీసీకి విజయావకాశాలు ఉన్నాయి. రెండు నియోజకవర్గాలలో హోరాహోరీ పోరు ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి విజయనగరం, బొబ్బొలి, ఎస్. కోట, గజపతినగరంలలో విజయావకాశాలు ఉండగా, వైసీపీకి చీపురుపల్లి, నెల్లిమర్ల, సాలూరులలో గెలుపు అవకాశాలు ఉన్నాయి. పార్వతీపురం, కురుపాంలలో హోరా హోరీ పోరు ఉంటుంది.

 ఇక విశాఖజిల్లా విషయానికి వస్తే ఈ  జిల్లాలో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 15. వీటిలో  ఏడు నియోజకవర్గాలలో తెలుగుదేశం, ఐదు నియోజకవర్గాలలో వైసీపీ విజయం సాధించే అవకాశాలు ఉండగా  మూడు నియోజకవర్గాలలో  హోరాహోరీ పోరు ఉంటుది.  తెలుగుదేశం పార్టి విశాఖపట్నం ఈస్ట్, విశాఖపట్నం వెస్ట్, భీమిలిపట్నం, పెందుర్తి, అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నంలలో ముందంజలో ఉంటే, వైసీపీ విశాఖ సౌత్, విశాఖ నార్త్, యలమంచిలి, అరకు వ్యాలీ, పాడేరులలో వైసీపీ ఆధిక్యత కనపరుస్తోంది. ఇక పాయకరావుపేట, గాజువాక, మాడుగుల నియోజకవర్గాలలో హోరాహోరీ పోరు ఉంటుంది.

అలాగే తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాలు ఉండగా, వాటిలో ఆరు నియోజకవర్గాలలో తెలుగుదేశం, ఆరు నియోజకవర్గాలలో వైసీపీ, నాలుగు నియోజకవర్గాలలో జనసేన పార్టీ విజయం సాధించే అవకాశం ఉందని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. మిగిలిన మూడు నియోజకవర్గాలలోనూ హోరాహోరీ పోరు ఉంటుంది. పెద్దాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, అమలాపురం, ముమ్మిడివరం, రాజమండ్రి అర్బన్ నియోజకవర్గాలలో తెలుగుదేశం, రామచంద్రాపురం, రంపచోడవరం, కాకినాడ అర్బన్, అనపర్తి, తుని, రాజానగరంలలో వైసీపీ, పిఠాపురం, రాజమండ్రిరూరల్, రాజోలు, కొత్త పేటలలో జనసేనకు విజయావకాశాలు ఉన్నాయి. ఇక శ్రీ ఆత్మసాక్షిసర్వే ప్రకారం పి.గన్నవరం, మండపేట, కాకినాడ రూరల్ నియోజకవర్గాలలో హోరాహోరీ పోరు తప్పదు.

ఇక పశ్చిమగోదావరి జిల్లాలోని 15 నియోజకవర్గాలలో తెలుగుదేశం 8 నియోజకవర్గాలలోనూ వైపీపీ రెండు నియోజకవర్గాలలో విజయం సాధిస్తాయి. జనసేన పార్టీకి ఈ జిల్లాలో మూడు నియోజకవర్గాలలో విజయావకాశాలు ఉన్నాయి. పాలకొల్లు, ఆచంట, ఉంగుటూరు, దెందులూరు, తణుకు, కొవ్వూరు, పోలవరం, ఉండి నియోజకవర్గాలు తెలుగుదేశం ఖాతాలోనూ,  ఏలూరు, గోపాలపురం నియోజకవర్గాలు వైసీపీ ఖాతాలోనూ పడతాయి. భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలలో జనసేనకు విజయావకాశాలు ఉన్నాయి. నిడదవోలు, చింతలపూడిలలో హోరాహోరీ పోరు ఉంటుంది.

  అలాగే కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వాటిలో ఎనిమిది నియోజకవర్గాలు తెలుగుదేశం,  ఐదు నియోజకవర్గలు వైసీపీ ఖాతాలో పడతాయని సర్వే పేర్కొంది. రెండు నియోజకవర్గాలలో హోరాహోరీ పోరు ఉంటుంది. తెలుగుదేశం విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్,  జగ్గయ్యపేట, పెనమలూరు, మైలవరం, అవనిగడ్డ, మచిలీపట్నంలలో విజయం సాధిస్తే,  వైసీసీకి గన్నవరం, పామర్రు,  గుడివాడ, తిరువూరు, నూజివీడులలో గెలుపు అవకాశాలు ఉన్నాయి. విజయవాడ వెస్ట్, కైకలూరులలో హోరాహోరీ పోరు ఉంటుంది.

గుంటూరు జిల్లాలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాలలో 8 తెలుగుదేశం ఖాతాలోనూ, 6 వైసీపీ ఖాతాలోనూ పడతాయి. మూడు నియోజకవర్గాలలో హోరాహోరీ పోరు తప్పదు. పొన్నూరు, వేమూరు, తాడికొండ, చిలకలూరి పేట, రేపల్లె, మంగళగిరి, వినుకొండ, బాపట్లలలో తెలుగుదేశం గెలిచే అవకాశాలు అధికంగా ఉంటే,  గుంటూరు ఈస్ట్, మాచర్ల, పత్తిపాడు, పెదకూరపాడు, తెనాలి, నరసరావు పేటలలో వైసీపీకి విజయావకాశలు ఉన్నాయి. ఇక గుంటూరు వెస్ట్, గురజాల, సత్తెనపల్లిలో హోరాహోరీ పోరు ఉంటుంది.

ప్రకాశం జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆరింట తెలుగుదేశం, ఐదు నియోజకవర్గాలలో వైసీపీ, ఒక నియోజకవర్గంలో హోరా హోరీ ఉంటుందని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. ఒంగోలు, కనిగిరి, కొండెపి, పరచూరు, అద్దంకి, సంతనూతలపాడు లలో తెలుగుదేవం, మార్కాపురం, ఎర్రగొండ్లపాలెం, గిద్దలూరు, కందుకూరు, దర్శిలలో  వైసీపీ గెలిచే అవకాశాలు ఉండగా, చీరాలలో హోరాహోరీ పోరు ఉంటుంది.

నెల్లూరు జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఐదింటిని తెలుగుదేశం, రెండు నియోజకవర్గాలలో వైసీపీ గెలిచే అవకాశాలున్నాయి. మూడింటిలో హోరాహోరీ పోరు ఉంటుంది.  నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఉదయగిరి, వెంకటగిరి, కావలిలలో తెలుగుదేశం, ఆత్మకూరు, సర్వేపల్లిలలో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. గూడూరు, సూళ్లూరుపేట, కోవూరులలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉంటుంది.

ఇక చిత్తూరు జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో తెలుగుదేశం నాలుగు, వైసీపీ 8 గెలుచుకునే అవకాశాలున్నాయి. రెండు నియోజకవర్గాలలో పోటీ తీవ్రంగా ఉంటుంది.  మందపల్లి, కుప్పం,  నగరి, పలమనేరులలో తెలుగుదేశం విజయం సాధిస్తే,  తిరుపతి, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, సత్యవేడు, చంద్రగిరి, చిత్తూరు, తంబళ్లపల్లిలలో వైసీపీ విజయం సాధిస్తుంది. ఇక పీలేరు, శ్రీకాళహస్తిలలో పోటీ తీవ్రంగా ఉంటుంది. 

కడప జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లాలో మొత్తం10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో తెలుగుదేశం రెండు స్థానాలలోనూ, వైసీపీ ఆరు స్థానాలలోనూవిజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. రెండు స్థానాలలో పోటీ హోరాహోరీ ఉంటుంది.  మైదుకూరు, ప్రొద్దుటూరులలో తెలుగుదేశం, కడప, పులివెందుల, జమ్మలమడుగు, రాయచోటి, బద్వేల్, కోడూరులలో వైసీపీ గెలుస్తాయి. రాజంపేట, కమలాపురం నియోజకవర్గాలలో పోటీ తీవ్రంగా ఉంటుంది. 

అనంతపురం జల్లాలో14  నియోజకవర్గాలు ఉండగా వీటిలో 7 చోట్ల తెలుగుదేశం, 7 చోట్ల వైసీపీ విజయం సాధిస్తాయి. ఒక నియోజకవర్గంలో హోరాహోరీ పోరు ఉంటుంది. అనంతపురం, కదిరి, హిందూపురం,  తాడిపత్రి,  కళ్యాణదుర్గం, పెనుకొండ,  ఉరవకొండలలో తెలుగుదేశం, రాప్తాడు, గుంతకల్లు, పుట్టపర్తి, ధర్మవరం, రాయదుర్గం, మడకశిరలలో వైసీపీ విజయం సాధిస్తాయి. సింగనమలలో పోటీ నువ్వానేనా అన్నట్లుగా ఉంటుంది. 

ఇక కర్నూలు జిల్లా విషయానికి వస్తే.. ఈ జిల్లాలోని 14 నియోజకవర్గాలలో ఏడింటిలో కర్నూలు, ఏడింటిలో వైసీపీ విజయం సాధించే అవకాశలు ఉన్నాయని శ్రీఆత్మసాక్షి సర్వేపేర్కొంది.  శ్రీశైలం, కొడుమూరు, మంత్రాలయం, బనగానపల్లి, ఆలూరు, ఆదోని, పత్తికొండలలో తెలుగుదేవం, నందికొట్కూరు, పాణ్యం,  ఎమ్మిగనూరు, డోన్, ఆళ్లగడ్డ, కర్నూలు, నంద్యాలలో వైసీపీకివిజయావకాశాలు ఉన్నాయని సర్వే పేర్కొంది. 

మొత్తానికి శ్రీ ఆత్మసాక్షి సర్వే ప్రకారం 2024 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో తెలుగుదేశం, వైసీపీల మధ్య తేడా స్వల్పమేనని కూడా సర్వే వెల్లడిస్తోంది.  

ఏపీ మద్యం స్కాం.. విజయసాయికి ఈడీ నోటీసులు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది.  2019 నుంచి ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ లో జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. జగన్ హయాంలో అనుసరించిన మద్యం విధానంలో అవకతవకలు, అక్రమాలు, మనీలాండరింగ్ చట్ట ఉల్లంఘనలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.  గత ప్రభుత్వ హయాంలో మద్యం వ్యాపారానికి సంబంధించిన పెద్ద ఎత్తున మనీలాండరింగ్, హవాలా లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలపై ఈ దర్యాప్తు సాగుతోంది.   మద్యం సేకరణ వ్యవస్థను ఆటోమేటెడ్ ప్రక్రియ నుండి మాన్యువల్ ఆమోదాలకు మార్చడం, తద్వారా కొన్ని సంస్థలకు ప్రయోజనం చేకూరేలా ఒప్పందాల మార్పిడికి దోహదపడిందని ఈడీ తన దర్యాప్తులో ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది.   కాగా ఈ కేసును ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. సిట్ ఇప్పటికే ఈ కేసులో చాలా మందిని అరెస్టు చేసింది వారిలో కొందరు బెయిలుపై విడుదల కాగా, ఇంకా కొందరు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ కేసులో విజయసాయి కూడా ఇప్పటికే సిట్, ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఇప్పుడు తాజాగా ఈ నెల 22 విచారణకు రావాల్సిందిగా విజయసాయికి ఈడీ నోటీసులు పంపడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికీ, వైసీపీకీ రాజీనామే చేసి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశాననీ, వ్యవసాయమే తన వ్యాపకమని చెప్పుకుంటున్న విజయసాయి ఈడీ విచారణలో ఏం చెబుతారన్న ఆసక్తి, ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. ఇప్పటికే పలు సందర్భాలలో వైసీపీ నేతలపై విమర్శలు చేసిన విజయసాయి ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం విషయంలో ఈడీ విచారణలో  వెల్లడించే విషయాలు కీలకం కానున్నాయంటున్నారు.  

పాపం దానం.. కింకర్తవ్యం

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారం క్లైమాక్స్ కు చేరుకుంది.  మొత్తం పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఫిరాయింపు ఆరోపణలు ఉండగా, వారిపై అనర్హత వేటు విషయంలో అసెంబ్లీ స్పీకర్  గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలపై తన నిర్ణయాన్ని వెలువరించారు. ఆ ఏడుగురూ పార్టీ ఫిరాయించారనడానికి ఎటువంటి ఆధారాలూ లేవనీ, వారు బీఆర్ఎస్ లోనే ఉన్నారనీ స్పష్టమైనే తీర్పు ఇచ్చారు.   ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అలాగే  ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే మాకనూరు సంజయ్ లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఈ ముగ్గురిలో కూడా దానం నాగేందర్ పరిస్థితి ఒకింత భిన్నంగా ఉంది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన తరువాత కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే కాకుండా, ఆ పార్టీ తరపఫున లోక్ సభ ఎన్నికలలో పోటీకి కూడా దిగారు. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నారని స్పీకర్ చెప్పడానికి ఇసుమంతైనా అవకాశం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ముందున్న మార్గమేంటని పరిశీలిస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అనర్హత వేటు నుంచి తప్పించుకోవడమే కాకుండా, తన రాజీనామా ద్వారా వచ్చే ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగడం. ఇది ఒక్కటే దానం నాగేందర్ ను అనర్హత వేటు నుంచి బయటపడేయగదని పరిశీలకులు అంటున్నారు. అలా కాకుండా ఎమ్మెల్యేగా కొనసాగి అనర్హత వేటుకు గురైతే తదుపరి ఎన్నికలలో పోటీకి కూడా ఆయన అనర్హుడయ్యే అవకాశం ఉందంటున్నారు.   బహిరంగంగా వేరే పార్టీ గుర్తుపై పోటీ చేసిన వ్యక్తి పార్టీ మారలేదు అని స్పీకర్ తీర్పు ఇచ్చే అవకాశాలు ఇసుమంతైనా లేవని అంటున్నారు.   

రాహుల్ నోట మళ్లీ ఓటు చోరీ మాట!

కాంగ్రెస్ అగ్రనాయకుడు, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ నోట మళ్లీ ఓటు చోరీ మాట వచ్చింది. మహా మునిసిపల్ ఎన్నికలలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించిన రాహుల్ గాంధీ, ఎన్నికలలో ఓటు వేసే సమయంలో ఓటర్ల వేలికి వేసే సిరాకు బదులు మార్కర్ పెన్నులు ఉపయోగించడం ద్వారా పెద్ద ఎత్తున ఓటు చోరీకి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. ఎన్నికల నిర్వహణలో  ఎన్నికల సంఘం అనుసరిస్తున్న తీరు వల్ల ప్రజలలో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం సడలిపోతోందని రాహుల్ పేర్కొన్నారు. కాగా ఓటర్ల వేలికి సిరాకు బదులు మార్కర్ పెన్ను ఉపయోగించడంపై కాంగ్రెస్ మాత్రమే కాకుండా ఎన్డీయే కూటమి యేతర పార్టీలన్నీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మహా మునిసిపోల్స్ లో మరీ ముఖ్యంగా బృహాన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికలలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని వారు ఆరోపిస్తున్నారు. 

బీహార్ లో కాంగ్రెస్ జీరో కానుందా?

బీహార్ లో కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి జేడీయూ గూటికి చేరడానికి రెడీ అయిపోయారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వ విధానాలకు ఆకర్షితులై వారీ పార్టీ మారబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలను కాంగ్రెస్  ఖండించింది. కాంగ్రెస్ ఇటీవల ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలూ డుమ్మా కొట్టడమే ఈ ప్రచారానికి కారణం.  ఈ నెల 13న పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన 'దహీ-చూరా' విందుకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలూ గైర్హాజరయ్యారు. దీనికి తోడు సంక్రాంతి తరువాత కాంగ్రెస్ లో పెద్ద కుదుపు ఉంటుందంటూ ఎన్డీయే నేతల ప్రచారం కూడా కాంగ్రెస్ కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు జనతాదళ్ గూటికి చేరనున్నారన్న ప్రచారానికి ఊతం ఇచ్చింది.   ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరు స్థానాలలో  మాత్రమే విజయం సాధించింది. ఇప్పుడు ఆ ఆరుగురూ కూడా కాంగ్రెస్ ను వీడనున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటంతో  రాష్ట్రంలో కాంగ్రెస్ బలం శూన్యం  అవుతుందన్న చర్చ మొదలైంది. అంతే కాకుండా కాంగ్రెస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు జనతాదళ్ యూ గూటికి చేరితే ఆ పార్టీ బలం బీజేపీని మించుతుంది.    243 స్థానాలున్న అసెంబ్లీలో ఎన్డీయేకు 202 మంది సభ్యుల బలం ఉంది. ఇందులో బీజేపీకి 89, జేడీయూకు 85 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇలా ఉండగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గంపగుత్తగా జనతాదళ్ యూ గూటికి చేరనున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు షకీల్ అహ్మద్ ఖాన్ తోసిపుచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ పార్టీతోనే ఉన్నారన్న ఆయన పార్టీ కార్యకర్తల మనో స్థైర్యాన్ని దెబ్బతీయడానికే ప్రత్యర్థులు ఇటువంటి ప్రచారానికి తెరతీశారని విమర్శించారు.  

పొత్తులకు మాయావతి గుడ్ బై.. యూపీలో అధికారం కోసం ఒంటరి పోరు

బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి, ఎన్నికల పొత్తులకు గుడ్ బై చెప్పేశారు. యూపీలో బీఎస్పీకి పునర్వైభవం, పునరాధికారమే లక్ష్యంగా వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలలో ఒంటరి పోరుకే సై అనేశారు. ఈ మేరకు గురువారం (జనవరి 14) తన పుట్టిన రోజు సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ,  2027లో జరిగే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని మాయావతి చెప్పారు. అంతే కాదు..  ఆ ఎన్నికలలో విజయం సాధించి అధికార పగ్గాలు అందుకుంటానన్న ధీమా వ్యక్తం చేశారు.  వచ్చే ఎన్నికలలో ఏ కూటమితోనూ, ఏ పార్టీతోనూ  జతకట్టకుండా  ఒంటరిగా పోటీలోకి దిగడానికే తమ పార్టీ మొగ్గు చూపుతోందన్నారు.  బీఎస్పీ గతంలో నాలుగుసార్లు అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ ..2027 ఎన్నికలలో ప్రజలు మరోసారి బీఎస్పీని అధికారంలోకి తీసుకురావాలని ఆశపడుతున్నారన్నారు. యూపీలో బీఎస్పీ ఐదో సారి అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమాను మాయావతి వ్యక్తం చేశారు.  గత ప్రభుత్వాలు బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్‌ను నిర్లక్ష్యం చేశాయని, కనీసం ఆయన మరణించిన రోజును సంతాపం దినంగా ప్రకటించలేదనీ మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలకులు ముస్లింలు, ఇతర వర్గాలను చిన్నచూపు చూశారని, అదే బీఎస్పీ పాలనలో  సమానత్వం వెల్లివిరిసిందనీ, రాష్ట్రంలో మతపరమైన కలహాలు జ రగలేదనీ గుర్తు చేశారు.  ఇక ఆమె ఈవీఎంలపై ఆందోళన వ్యక్తం చేశారు. వాటి విశ్వసనీయత ప్రశ్నార్థకమన్న మాయావతి.. ఈవీఎంలపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమౌతోందని చెప్పారు.  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాయావతికి జన్మదిన శుభాకంక్షలు తెలిపారు.  మాయావతి ఒంటరి పోరు ప్రకటనతో యూపీలో రాజకీయాలు రసకందాయంలో పడినట్లేనని పరిశీలకులు అంటున్నారు.  

వేమిరెడ్డికి....కేంద్ర బెర్త్ క‌న్ఫర్మ్ అయిన‌ట్టేనా!?

  కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో టీడీపీకి ఒక బెర్త్ క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్టు క‌నిపిస్తోంది. ఏపీలో 16 ఎంపీలు టీడీపీకి ఉండ‌గా, ఇద్ద‌రు జ‌న‌సేన‌, ముగ్గురు బీజేపీ, న‌లుగురు వైసీపీకి ఉన్నారు. ఇప్ప‌టికే టీడీపీ నుంచి పెమ్మ‌సాని, రామ్మోహ‌న్ రూపంలో  కేంద్రంలో మంత్రి ప‌ద‌వులుండ‌గా.. బీజేపీ నుంచి శ్రీనివాస‌వ‌ర్మ కూడా  కేబినేట్ లో స‌హాయ హోదాలో ఉన్నారు. అంటే ఏపీకి ముగ్గురికి  అవ‌కాశం ల‌భించింది తొలి  మంత్రి వ‌ర్గంలోనే వీరు స్థానం సంపాదించారు. అయితే  కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ తిరిగి ఏపీకి,, మ‌రీ ముఖ్యంగా టీడీపీకి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఛాన్స్ ల‌భించేలా తెలుస్తోంది. మొన్న ఢిల్లీకి  వెళ్లిన  చంద్ర‌బాబు అమిత్ షాతో భేటీలో ఈ విష‌యం  ఆయ‌న చెవిలో వేసి  వ‌చ్చారు. దీంతో ప్ర‌తిపాద‌న‌లు పంప‌మ‌ని  కేంద్రం నుంచి స‌మాచారం వ‌చ్చింది. దీంతో చంద్ర‌బాబు టీడీపీ నుంచి నెల్లూరు ఎంపీ  వేమిరెడ్డి  ప్ర‌భాక‌ర్ రెడ్డి  పేరు ప్ర‌తిపాదించిన‌ట్టు తెలుస్తోంది. కుల స‌మీక‌ర‌ణ‌ల్లో భాగంగా  ఈ సారికి ఒక రెడ్డి సామాజిక‌వ‌ర్గం పేరు ప్రతిపాదించిన‌ట్టు క‌నిపిస్తోంది. గ‌తంలో వైసీపీ రాజ్య‌స‌భ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి టీడీపీలోకి రాగానే  నెల్లూరు జిల్లా  రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు ఒక్క‌సారిగా  మారిపోయాయి. అంతే కాకుండా  ప్ర‌కాశం జిల్లాలోని  కొన్ని సెగ్మెంట్ల‌లోనూ వేమిరెడ్డి  ప్ర‌భావం ఉన్న‌ట్టు గుర్తించారు. దీంతో వేమిరెడ్డికి కేంద్ర మంత్రిత్వం క‌ట్ట‌బెడితే  ఆయ‌న ద్వారా రెండు జిల్లాల‌ను క‌వ‌ర్ చేసిన‌ట్టుగా  ఉంటుంద‌ని భావించిన టీడీపీ అధిష్టానం ఆయ‌న పేరు కేంద్ర మంత్రిగా  సిఫార్సు చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇక జ‌న‌సేన‌కుగానీ ఒక మంత్రి ప‌ద‌వే ఇస్తే.. బాల‌శౌరి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. దీంతో ఏపీకి రెండు కేంద్ర ప‌ద‌వులు ఇస్తార‌న్న మాట కూడా జోరుగాన‌నే ప్ర‌చారం  సాగుతోంది. ఒక ద‌శ‌లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా వేమిరెడ్డితో పాటు  వినిపించిన‌ప్ప‌టికీ.. వేమిరెడ్డికే ఎక్కువ ప్ర‌యారిటీ ఇచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. కార‌ణం వేమిరెడ్డి  స‌తీమ‌ణి ప్ర‌శాంతిరెడ్డి  కూడా  జిల్లాలో ప్ర‌భావ‌వంత‌మైన నాయ‌క‌త్వం వ‌హించ‌డం.. వంటి అంశాల‌ను  ప‌రిగ‌ణ‌లోకి తీస్కున్న అధిష్టానం వేమిరెడ్డికే ప్రాధాన్య‌త‌ ఇచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది.

వాస్తవ వేదిక.. వారికే కాంట్రాక్టులు.. అడ్డగోలు దోపిడీకి తలుపులు బార్లా

ఆంధ్రప్రదేశ్ లో అపారమైన ఖనిజ సంపద ఉంది. ముఖ్యంగా కడప జిల్లాలోని మంగంపేట బారైటీస్ ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యత కలిగినవి. అయితే, ఈ సంపద రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడాల్సింది పోయి, రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్ల పరమవుతోందని 'జమీన్ రైతు' ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ ఆరోపించారు. తెలుగువన్ ఎండి కె. రవిశంకర్ తో  కలిసి  పంచుకున్న వాస్తవ వేదికలో ఆయన బైరైటీస్ దోపిడీపై పలు సంచలన విషయాలు వెల్లడించారు.  రాయలసీమ ఆర్థిక వ్యవస్థలో మంగంపేట బారైటీస్ కీలక పాత్ర పోషిస్తాయి. అందులో సందేహం లేదు. గతంలో ఇక్కడ జరిగిన విపరీతమైన అవినీతిని అరికట్టడానికి అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఈ మైనింగ్‌ను  ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి అప్పగించారు.  కానీ.. ప్రస్తుతం పరిస్థితులు మళ్ళీ మొదటికి వచ్చాయన్నారు డోలేంద్ర ప్రసాద్.   మంగంపేట బారైటీస్ విషయంలో గత జగన్ సర్కార్ చేసిన తప్పులనే ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్నదని విమర్శించారు.   అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక టన్ను బారైటీస్ ధర సుమారు 140 డాలర్లు అంటే బారత కరెన్సీలో   12,704.79 రూపాయలు ఉంటే, ఇక్కడి కాంట్రాక్టర్లకు కేవలం  12.78 డాలర్లు అంటే 1,160 రూపాయలకే కట్టబెడుతున్నారని డోలేంద్ర ప్రసాద్  వివరించారు.  ఎంపరాడా  వంటి సంస్థలకు మాత్రమే టెండర్లు దక్కేలా నిబంధనలను రూపొందించడమన్నది పక్కగా కుమ్మక్కై చేస్తున్న పనిగా ఆయన అభివర్ణించారు.   ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. తెలుగు రాష్ట్రాల్లో టెండరింగ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందనీ,  కేవలం మైనింగ్ మాత్రమే కాకుండా, విద్యుత్, ఇరిగేషన్, రోడ్లు ఇలా ప్రతి రంగంలోనూ నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెడుతూ అడ్డగోలు దోపిడీకి తలుపులు బార్లా తెరిచారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.  ఈ దోపిడీలో అధికార, విపక్ష పార్టీలు, బ్యూరోక్రసీ, కొన్ని మీడియా సంస్థలు కూడా భాగస్వాములుగా ఉన్నాయన్నారు.  ఒక చిన్న స్థాయి గుమాస్తా దగ్గరే కోట్లాది రూపాయల ఆస్తులు దొరుకుతున్నాయంటే, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల ఆస్తులు ఏ స్థాయిలో ఉండి ఉంటాయో అర్ధం చేసుకోవచ్చని డోలేంద్ర ప్రసాద్ అన్నారు. విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు.  బారైటీస్ మాత్రమే కాకుండా, ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతంలోని బీచ్ శాండ్ అలాగే అత్యంత విలువైన రేర్ ఎర్త్ ఖనిజాలు కూడా లూటీ అవుతున్నాయన్నారు.    చైనా నేడు ఈ రేర్ ఎర్త్ ఖనిజాలతోనే అమెరికా వంటి దేశాలను గడగడలాడిస్తోందనీ, అయితే మన దగ్గర ఉన్న  ఈ అద్భుతమైన సంపదను పది రూపాయల కోసం రాజకీయ నాయకులు విదేశాలకు తరలిస్తున్నారని  విమర్శించారు.  థోరియం వంటి దేశ రక్షణకు సంబంధించిన ఖనిజాలు కూడా అక్రమంగా తరలిపోతున్నాయన్నారు.ఈ దోపిడీని అరికట్టాలంటే ప్రజలలో చైతన్యం రావాలని డోలేంద్రప్రసాద్ వాస్తవ వేదిక ద్వారా పిలుపునిచ్చారు.  మంగంపేట బారైటీస్ వంటి ఖనిజాలకు లోకల్ టెండర్లు కాకుండా గ్లోబల్ టెండర్లు పిలిస్తే రాష్ట్రానికి వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు.  రాష్ట్ర ఖనిజ సంపద ఆంధ్ర హక్కు అంటూ ప్రజాసంఘాలు నినదించాలనీ,  బాధ్యత గల ప్రతి పౌరుడూ ఈ దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమంచాలని పిలుపునిచ్చారు.  ప్రస్తుతం ఉన్న నిబంధనల వల్ల సుమారు 140 పల్వరైజింగ్ మిల్లులు మూతపడే పరిస్థితిలో ఉన్నాయని, దీనివల్ల 30 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్న డోలేంద్ర ప్రసాద్  "ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది కూటమి ప్రభుత్వమా కుమ్మక్కు ప్రభుత్వమా అని సందేహం వ్యక్తం చేశారు.   ఖనిజ దోపిడీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం  తెలుగు వన్ న్యూస్ లో వాస్తవ వేదిక ఎనిమిదో ఎడిషన్ వీక్షించండి.  

ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడానికి జగన్ పాలనా వైఫల్యాలే కారణం.. కుండ బద్దలుకొట్టిన పేర్ని

గత ఎన్నికలలో ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడానికి జగన్ పాలనా వైఫల్యాలే కారణమని మాజీ మంత్రి వైసీపీ అధినేత పేర్ని నాని కుండబద్దలు కొట్టేశారు. ఒక యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ విషయం చెప్పారు. ఇక 2029 ఎన్నికలలో విజయం కోసం జగన్ పాదయాత్రకు సిద్ధమౌతున్నారని చెప్పారు. ఔను మాజీ సీఎం  వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు. 2029 ఎన్నికలలో విజయమే లక్ష్యంగా ఆయన పాదయాత్ర @ 2.0 కు రెడీ అవుతున్నారంటూ అందుకు ముహూర్తం కూడా దాదాపుగా ఖరారైందన్నారు పేర్ని నాని.  వచ్చే ఏడాది అంటే 2027లో పార్టీ ప్లీనరీ తరువాత జగన్ తన పాదయాత్ర ప్రారంభిస్తారని   చెప్పారు. అయితే జగన్ పాలనా వైఫల్యాలు అంటూ   వైసీపీయులు కలలో కూడా అంగీకరించడానికి సాహసించని మాటలను పేర్ని నాని నోటి వెంట రావడం రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది.  జగన్ పాలనా వైఫల్యం కారణంగానే   2019 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని  ఘోరపరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని పేర్ని నాని యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంగీకరించేశారు. గతంలో తమ పార్టీ అధికారంలో ఉండగా పాలనలో వైఫల్యం చెందిందన్న పేర్ని నాని, వాటి నుంచి ఏం నేర్చుకున్నాం, మరో సారి అధికారంలోకి వస్తే ఆ పాలనా వైఫల్యాలను అధిగమించి జనరంజకమైన పాలనను ఎలా అందిస్తామన్న విషయాలను మాత్రం చెప్పలేదు. అయితే వైసీపీ అధినేత  జగన్ ఇప్పటికీ తాము అద్భుత పాలన అందించామనీ, అయితే ఈవీఎంల టాంపరింగ్, చంద్రబాబు అసత్య ప్రచారాలే తమ ఓటమికి కారణమని చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఇప్పుడు పేర్ని నాని పాలనా వైఫల్యం అనడంపై ఆయన ఏ విధంగా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది.  అది పక్కన పెడితే.. వైసీపీ గత అసెంబ్లీ ఎన్నికలలో ఘోరంగా పరాజయం పాలై, తెలుగుదేశం కూటమి ఘన విజయంతో అధికారపగ్గాలు చేపట్టి ఏడాదిన్నర కావస్తున్నది. ఈ ఏడాదిన్నర కాలంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పూర్తి స్థాయిలో ప్రజలలోకి వచ్చింది లేదు. అసలాయన ఆంధ్రప్రదేశ్ కు రావడమే ఏదో చుట్టపు చూపుగా వచ్చినట్లు వస్తున్నారు. వారంలో ఒక రోజు రాష్ట్రంలో ఇలా పర్యటించి అలా బెంగళూరు ప్యాలెస్ కు చెక్కేస్తున్నారు. అలా వచ్చినప్పుడు కూడా ప్రజలలోకి రావడం అత్యంత అరుదు. ఏదో అందుబాటులో ఉన్న, లేదా ఆయన ఎంపిక చేసుకున్న నేతలతో  ఇన్ హౌస్ మీటింగ్ లకు పరిమితమౌతున్నారు.   ఈ ఏదాడిన్నర కాలంలో జగన్ చేపట్టిన కార్యక్రమాలంటూ ఏవీ లేవనే చెప్పాలి. తన ప్రభుత్వ హయాంలో  అవినీతి అక్రమాలు, దౌర్జన్యాలు, కబ్జాలు, దోపిడీ ఆరోపణలతో అరెస్టైన వైసీపీ నేతలు, కార్యకర్తల అరెస్టులకు అడపాదడపా ఖండనలు, లేదా జైలు పరామర్శలకే జగన్ పరిమితమయ్యారు.  అటువంటి జగన్ ఇప్పుడు పాదయాత్ర అంటూ జనంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అన్న దానిపై పరిశీలకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.  జగన్ ఏడాది కిందటే.. అంటే 2025 జనవరిలోనే జిల్లా పర్యటనలు సహా  కార్యక్రమాలను ప్రకటించారు. తాను స్వయంగా వాటికి నేతృత్వం వహిస్తానని ప్రకటించారు. అయితే ఆయనా ప్రకటన చేసి ఏడాది గడిచిపోయినా ఆయన అడుగు బయటపెట్టింది లేదు. బెంగళూరు ప్యాలెస్ టు తాడేపల్లి ప్యాలెస్ వైస్ వెర్సా అన్నట్లుగానే ఆయన పర్యటనలు సాగాయి. దీంతో జగన్ జనంలోకి అన్న మాటను పార్టీ నేతలూ, శ్రేణులే నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు మాజీ మంత్రి పేర్ని నాని జగన్ పాదయాత్ర అంటూ చేసిన ప్రకటనను ఎవరు విశ్వసిస్తారన్న చర్చ జరుగుతోంది. ప్రకటనలే తప్ప ఆచరణ ఉండే అవకాశాలు మృగ్యమన్న వాదన వైసీపీ వర్గాల నుంచే వస్తున్నది. మరి చూడాలి జగన్ పాదయాత్రపై పేర్ని నాని ప్రకటిన ఏ మేరకు వాస్తవ రూపం దాలుస్తుందో? 

అవినీతికి పాల్పడితే తన, పర భేదం లేదు.. లోకేష్ వినూత్న విధానం

అక్రమాలు, అవకతవకలకు పాల్పడితే తన, పర తేడా లేదంటున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్. ఎమ్మెల్యేలు, అధికారులపై ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకోవడానికి వెనుకాడేది లేదని హెచ్చరిస్తున్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా అయిన నారా లోకేష్.. అవినీతి, అక్రమాలకు పాల్పడితే తెలుగుదేశం వారైనా, ప్రత్యర్థి పార్టీ వారైనా చర్యలు ఒకేలా ఉంటాయని విస్పష్టంగా చెబుతున్నారు. పొలిటిలక్ గా ఆయన దూకుడు ముఖ్యమంత్రి చంద్రబాబును మించి ఉందని పరిశీలకులు అంటున్నారు.  రాజకీయాల్లో నాయకులపై విమర్శలు, ఆరోపణలు సహజం.  వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం అన్నది సాధారణంగా అధకారంలో ఉన్న వారిపై కంటే అధికారంలో లేని వారిపైనే ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే ఈ పద్ధతిని బ్రేక్ చేసి.. ఇది ప్రజాస్వామ్యం,  తన, పర తేడా లేకుండా ఎవరిపై ఆరోపణలు  వచ్చినా విచారణ జరుపుతామని,తప్పు చేశారని నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ చెబుతున్నారు. ఇందు కోసం ఆయన ఒక కొత్త విధానాన్ని తీసుకురావడానికి రెడీ అయిపోయారు. త్వరలోనే ఆ విధానాన్ని ప్రకటించే అవకాశం ఉంది.   ముఖ్యంగా ఇక అధికారంలో ఉన్న ఎమ్మెల్యేల మీద ఫిర్యాదులు వస్తే.. వాటిని నాలుగు గోడలమధ్యా చర్చించి, హెచ్చరించో, బుజ్జగించో వదిలేయడమన్నది ఒక ఆనవాయితీగా వస్తోంది. ఆ ఆనవాయితీని బ్రేక్ చేస్తామంటున్నారు లోకేష్.    ప్రజల నుంచి ఎమ్మెల్యేలపై, వారు అధికార పార్టీ వారైనా, ప్రత్యర్థి పార్టీవారైనా సరే ఆరోపణలు వస్తే వాటిని స్వీకరించాలని లోకేష్ నిర్ణయించారు. అవినీతికి ఎవరు పాల్పడినా అది తప్పే అని కుండబద్దలు కొడుతున్నారు.  ఇక అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు నేరుగా పార్టీకే ఫిర్యాదు చేసేలా ఒక విధానాన్ని తీసుకురానున్నట్లు ఆయన చెబుతున్నారు. తమ నియోజకవర్గం ఎమ్మెల్యే ఏ విధంగా వ్యవహరిస్తున్నారు? ఆయన పనితీరు ఎలా ఉంది?  ఆయన గానీ అనుచరులు కానీ ఏమైనా తప్పులు పొరపాట్లు చేస్తున్నారా? వంటి విషయాలను జనం నేరుగా పార్టీకే ఫిర్యాదు చేయడానికి వీలుగా తెలుగుదేశం  పార్టీ   పరంగా ప్రత్యేకమైన ఫోన్ నంబర్ ని ఏర్పాటుచేయనున్నారు.  ఆ నంబర్ కి ఫిర్యాదుదారుడు ఎవరైనా ఫోన్ చేయవచ్చు.  అలా ఫిర్యాదు చేసిన వారి ఫోన్ నంబర్లను వారి పేర్లను   గోప్యంగా ఉంచుతారు.  అంతే కాకుండా ఆ ఫిర్యాదులపై విచారణ జరిపి చర్యలు కూడా తీసుకుంటారు.  ఎమ్మెల్యేలే కాదు,   అధికారుల అవినీతి మీద పనితీరు మీద కూడా ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.  ఈ విధంగా వచ్చే ఫిర్యాదులను సమగ్రంగా విచారించి, నిజానిజాల నిగ్గు తేల్చి అవసరమైతే చర్యలు తీసుకుంటారు.  ఇది దేశంలో ఎక్కడా లేని  నూతన విధానమనీ, దీనిని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారనీ తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.  దీని వల్ల అధికారులు,  ఎమ్మెల్యేలలో తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి ఉంటుందనీ, ప్రజలు  ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉండేందుకు దోహదం చేస్తుందని భావించి లోకేష్ ఈ విధానాన్ని తీసుకురావడానికి సమాయత్తమౌతున్నారని చెబుతున్నారు.  

థాక్రే బ్రదర్స్ కలయిక ప్రభావం ఎంత?.. బీఎంసీ ఫలితాలకు ముందు సర్వత్రా ఉత్కంఠ!

బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఫలితాల వేళ సర్వత్రా ఉత్కంఠ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల ఫలితాలు నేడు  శుక్రవారం (జనవరి 16) వెలువడనున్నాయి. గురువారం (జనవరి 16) బీఎసంసీకి జరిగిన ఎన్నికలలో 50 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.  బీఎంసీ ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై స్పష్టమైన ప్రభావం చూపుతాయన్న అంచనాల నేపథ్యంలో ఈ ఫలిలాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  అన్నిటికీ మించి దాదాపు రెండు దశాబ్దాల తరువాత తొలి సారిగా ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రేలు ఈ ఎన్నికల కోసం చేతులు కలపడంతో బీఎంసీ ఫలితాలపై ఉత్కంఠ మరింత పెరిగింది.  ముంబైపై పట్టు సాధించడమే లక్ష్యంగా థాక్రే బదర్స్ కలవడం ప్రాథాన్యత సంతరించుకుంది. ' ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ-షిండే కూటమి విజయం సాధించే అవకాశం ఉందని తెలినప్పటికీ, థాక్రేల కలయిక నేపథ్యంలో  ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ ముంబై వాసులలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది.   బీఎంసీతో పాటుగా గురువారం (జనవరి 15) మహారాష్ట్రలో 29 కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు కూడా శుక్రవారమే (జనవరి 16) విడుదల కానున్నాయి. కాగా..  పుణె, పింప్రి-చించ్వాడ్ ప్రాంతాల్లో  మునిసిపల్ ఎన్నికలలో శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలు కలిసి పోటీ చేశాయి.  జాతీయ స్థాయిలో విభేదాలు ఉన్నప్పటికీ, స్థానిక సంస్థల్లో పట్టు నిలుపుకునేందుకు 'పవార్ ఫ్యామిలీ' ఒక్కటవ్వడం కూడా రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  అన్నిటికీ మించి ఈ మునిసిపోల్స్ ను పరిశీలకులు అసెంబ్లీ ఎన్నికలకు లిట్మస్ టెస్ట్ గా అభివర్ణిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 29 కార్పొరేషన్లలోని 2,801 సీట్లకు గురువారం (జనవరి 15) పోలింగ్ జరిగింది పోలింగ్ జరిగింది.  ఒక్క బీఎంసీలోనే 227 వార్డులు ఉండగా, అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 114.