పవన్ కళ్యాణ్‌ని బెదిరిస్తున్నదెవరు?
posted on May 3, 2014 @ 3:20PM
బీజేపీ, టీడీపీ కూటమికి ప్రచారం చేస్తున్న పవన్ కళ్యాణ్ గత రెండు రోజుల నుంచి తనకు వస్తున్న బెదిరింపుల గురించి పదేపదే ప్రస్తావిస్తు్న్నారు. నిన్నగాక మొన్న ఏమన్నారంటే, తనమీద తన ప్రత్యర్థులు దాడి చేయాలంటే వాళ్ళకి ఆయుధాలు కావాలి.. కానీ తాను తన అభిమానులతో కలసి నడిస్తే చాలని చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ తనకు బెదిరింపులు వస్తున్నాయని, రాజకీయాల్లోకి రావడం వల్ల తనకు పైసా కూడా ఆదాయం లేకపోయినా 40 మంది శత్రువులని సంపాదించుకున్నానని చెప్పుకొస్తు్న్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్‌ని బెదిరిస్తున్నదెవరు? అసలు ఆ అవసరం ఎవరెవరికి వుండొచ్చు? జగన్‌ని, కేసీఆర్ని, కాంగ్రెస్ వాళ్ళని పవన్ ఘాటుగా విమర్శిస్తున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్‌ని ఎవరైనా బెదిరిస్తూ వుంటే ఆ వివరాలు పవన్ కళ్యాణ్ పూర్తిగా వెల్లడిస్తే బాగుంటుంది. ఎవరు బెదిరిస్తున్నారు.. ఎలా బెదిరిస్తున్నారు. ఫోన్‌లోనా, వ్యక్తిగతంగా కలిసి బెదిరిస్తున్నారా? ఎప్పుడు బెదిరించారు.. ఇలాంటి వివరాలన్నీ క్లియర్‌గా చెబితే బాగుంటుంది. లేకపోతే ఏదో పబ్లిసిటీ కోసమే చెబుతున్నట్టు జనం అనుమానించే ప్రమాదం వుంది.