పవన్ రాకపోవడానికి కారణం అదా..!
posted on Oct 24, 2015 @ 3:58PM
ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి రాకపోవడంపై పలువురు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీ మంత్రులు అయ్యన్న పాత్రుడు, కామినేని శ్రీనివాస్ లు ఇద్దరు స్వయంగా వెళ్లి పవన్ ను ఆహ్వానించగా.. ఆయన అప్పుడే తాను వస్తానో? రానో? అని చెప్పారు. తాను వచ్చేది.. రానిది షూటింగ్ పై ఆధారపడి ఉంటుందని అన్నారు. అయితే ఇప్పుడు నిజంగానే షూటింగ్ బిజీలో ఉండి రాలేదా.. లేకపోతే ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న దానిపై పలువురు పలు రకాలుగా అభిప్రాయపడుతున్నారు.
అసలు కేసీఆర్ ను, రామోజీ రావును చంద్రబాబు స్వయంగా పిలిచారని.. తమ నాయకుడిని స్వయంగా పిలవలేదని అప్పుడే పవన్ అభిమానులు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేసి మరీ రావాలని ఆహ్వానించారు.. ఈ విషయంపై చంద్రబాబు కూడా పవన్ తప్పకుండా వస్తారు.. ఫోన్ చేసి మరీ చెప్పాను.. విబేధాలు ఎన్ని ఉన్నా వాటిని కలిపి చూడకూడదు.. పవన్ వస్తారు అని ఖచ్చితంగా చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ రాలేదు. అయితే పవన్ తాను చెప్పినట్టు నిజంగానే షూటింగ్ లో బిజీగా ఉన్నారా? అంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి ఒక్కరోజు షూటింగ్ ఆపేసి రావడం పెద్ద విషయం కాదు.. ఒక్కరోజు కాదు అంతకన్నా ఎక్కువ రోజులు తీసుకున్నా డైరెక్టర్ ఒక్కమాట కూడా మాట్లాడడు. మరి ఎందుకు రాలేదు?
మరోవైపు పవన్ రాకపోవడానికి మరో కారణం చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. భూసేకరణ వివాదంలో టీడీపీకి పవన్ కు మధ్య బేధాభిప్రాయాలు వచ్చిన సంగతి తెలిసిందే. తానే భూసేకరణకు వ్యతిరేకమని.. రైతుల కోసం పోరాడతానని చెప్పి.. ఇప్పుడు ఆభూముల్లో జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి ఎలా వెళతాను అని ఆలోచించి తాను హాజరుకాలేదని అంటున్నారు. అందుకే ఇవన్నీ ముందే గ్రహించే పవన్ కళ్యాణ్ తాను వస్తానో? రానో? అని చెప్పారని అభిప్రాయపడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదో ఆయనకే తెలియాలి.