పవన్ కళ్యాణ్ అందుకే మౌనంగా ఉన్నారా..!
posted on Aug 11, 2015 @ 10:16AM
ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని మునికోటి ఆత్మహత్య చేసుకోవడం అందరిని కలిచివేసింది. అసలు కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం కుదరని చెప్పిన దగ్గరనుండే ఆంధ్రాలో ఆందోళనలు మొదలయ్యాయి. అయితే మునికోటి చేసిన ప్రాణత్యాగానికి ఒక్కసారిగా అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మునికోటి మృతిపట్ట సానుభూతి తెలిపారు. మునికోటి మరణం చాలా బాధను కలిగించింది అని, అతని కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి అని ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. ఈ సమయంలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా ఉండటానికి చాలా ప్రయత్నిస్తున్నానని.. ఎంతో నిగ్రహించుకుంటున్నాను అని అన్నారు.
ఒక రకంగా పవన్ కళ్యాణ్ ఏపీ ప్రత్యేక హోదా గురించి ఎంపీలు ఏం చేస్తున్నారని గట్టిగా విమర్శించిన తరువాతే మన ఎపీ ఎంపీలు కూడా పార్లమెంట్ లో ఏపీ ప్రత్యేక హోదా గురించి అడిగడినట్టు తెలుస్తోంది. అయినా ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పుడు ఏం మాట్లాడలేదు. చాలా మంది నేతలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలి అంటూ ఎంత కోరినా పవన్ కళ్యాణ్ మాత్రం మౌనంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే అభిమానులు, ప్రజలు రెచ్చిపోయే ప్రమాదం ఉందని అందుకే పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నారని భావిస్తున్నారు.