పవన్ కళ్యాణ్‌కి సూపర్ రెస్పాన్స్
posted on Jun 8, 2014 @ 7:28PM
ఏ నిమిషంలో అయితే పవన్ కళ్యాన్ తెలుగుదేశం, బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుని ప్రచారం చేశారో ఆ నిమిషం నుంచి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్‌కి వున్న గౌరవం బాగా పెరిగిపోయింది. తెలుగుదేశం, బీజేపీ కూటమి ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత ఆ గౌరవం మరింత పెరిగింది. ఎన్నికలలో గెలిచిన తర్వాత ప్రధాని నరేంద్రమోడీ కూడా పవన్ కళ్యాణ్‌ని గుర్తు చేసుకున్నారంటే ఆ గౌరవం ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వచ్చిన బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ కూడా పవన్ కళ్యాణ్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా వుంటే చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఆయనకు చంద్రబాబు సాదర స్వాగతం పలికారు. అలాగే పవన్ కళ్యాణ్ సభాస్థలి దగ్గరకి వచ్చినప్పుడు తెలుగుదేశ పార్టీ కార్యకర్తలు ఆనందోత్సాహాలతో హర్షధ్వానాలు చేశారు. పవన్ కళ్యాణ్‌కి సూపర్‌గా తమ రెస్పాన్స్ తెలిపారు.