టీడీపీ మీద పగబట్టిన పవన్ కళ్యాణ్?
posted on Apr 15, 2014 @ 6:00PM
విజయవాడ ఎంపీ టిక్కెట్‌ని తన స్నేహితుడు పొట్లూరి ప్రసాద్‌కి ఇస్తానని చెప్పి, చివరికి హేండ్ ఇచ్చిన టీడీపీ మీద, ఆ పార్టీ అధినేత చంద్రబాబు మీద పవన్ కళ్యాణ్ పగబట్టినట్టున్నాడు. అందుకే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రంగంలో వున్న మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయబోతున్నాడు.
ఈ నియోజకవర్గం నుంచి పోటీలో వున్న లోక్‌సత్తా అభ్యర్థి జయప్రకాష్ నారాయణకి అనుకూలంగా తాను ప్రచారం చేయబోతున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించడం పవన్ మనసులో వున్న ‘పగ’కి అద్దం పడుతోంది. మల్కాజ్‌గిరి నుంచి తొలుత తాను పోటీ చేయాలని పవన్ భావించాడట. అయితే జయప్రకాష్ నారాయణ అక్కడి నుంచి పోటీ చేస్తున్నట్టు తెలియడంతో పవన్ కళ్యాణ్ తన పోటీ ఆలోచనని మానుకున్నాడట.
ఇప్పుడు జేపీ గెలుపు కోసం ప్రచారం కూడా చేయబోతున్నాడట. మల్కాజ్‌గిరిలో జేపీకి ప్రచారం చేస్తే అది ఎన్డీయేకి, బీజేపీకి, తెలుగుదేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేసినట్టే అవుతుంది. రాష్ట్రంలో ఒకవైపు బీజేపీ – టీడీపీ కూటమిని గెలిపించాలని ప్రచారం చేస్తూనే, మరోవైపు మల్కాజ్‌గిరిలో టీడీపీ అభ్యర్థిని ఓడించాలంటూ ప్రచారం చేస్తానని పవన్ ప్రకటించడం ఏంటో అర్థంకాక బీజేపీ, టీడీపీ వర్గాలు జుట్టు పీక్కుంటున్నాయి. ‘గబ్బర్ సింగ్’ సినిమాలో చెప్పినట్టు పవన్ కళ్యాణ్‌కి కొంచెం కాదు.. చాలా తిక్కుందని.. దానికి అసలు లెక్కేలేదని అనుకుంటున్నారు.