జైట్లీ బడ్జెట్ అకౌంట్స్.. ప్రధానాంశాలు ఇవే.
posted on Feb 29, 2016 @ 10:59AM
కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ కేంద్ర బడ్జెట్ గురించి ప్రసంగం కొనసాగుతోంది. ఈయన ప్రసంగంలో అంశాలు..
* ఈ ఏడాది ప్రణాళిక వ్యయాన్ని పెంచుట.
* రైతుల కోసం బీమా పథకం
* పంటల బీమాకు 5500 కోట్లు
* మూడేళ్లలో 5 లక్షల ఎకరాల్లో ఆర్గానిక్ వ్యవసాయం
* రైతుల కోసం ఏప్రిల్ 14 నుండీ ఈ మార్కెటింగ్ సదుపాయం
* 2022 కల్లా వ్యవసాయాధారిత ఆదాయం రెట్టింపు
* స్వల్ప ప్రీమియం ఎక్కువ పరిహారంతో పంటలకు పీఎం ఫసల్ బీమా యోజన
* వ్యవసాయం రైతు సంక్షేమానికి 35964 కోట్లు
* రైతుల కోసం బీమా పథకం
* వ్యవసాయం రైతు సంక్షేమానికి 35964 కోట్లు
* బీపీఎల్ కుటుంబాలకు వంట గ్యాస్ కొత్త పాలసీ
* ప్రతి కుటుంబానికి లక్ష బీమా కల్పించేలా కొత్త ఆరోగ్య పథకం
* ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజకను 19 వేల కోట్లు
* నా బార్డ్ కింద నీటి పారుదల కోసం 20 వేల కోట్లు
* వ్యవసాయం ఉపాధి హామి పథకాల అనుసంధానం
* మార్చ్ 31 నాటికి 23 ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న లక్ష్యం
* నిరు పేదలకు వంట గ్యాస్ కోసం 2వేల కోట్లు
* దేశ వ్యాప్తంగా కొత్తగా 62 నవోదయ విద్యాలయాలు
* గ్రామాల్లో డిజిటల్ అక్షరాస్యత పెంపు
* గ్రామీణ ప్రాంతాలకు అదనపు వనరుల కల్పన
* భూగర్భ జలాల పెంపునకు 60 వేల కోట్లు
* ఆథార్ కార్డు కింద అందరికీ పథకాలు
* వయో వృద్ధులకు రూ.30వేలు అదనంగా ఆరోగ్య బీమా
* అంబేద్కర్ 125వ జయంతికి నివాళిగా ఎస్సీ, ఎస్టీల ఆర్థిక స్థితిగతుల పెంపు
* ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా యువత నైపుణ్యాభివృద్ధికి రూ.1700 కోట్లు
* రాబోయే మూడేళ్లలో కోటి మంది యువతకు నైపుణ్యాల పెంపు
* బహుముఖ నైపుణ్యాల శిక్షణకు దేశవ్యాప్తంగా 5700 పాఠశాలల ఏర్పాటు
* కొత్త ఉద్యోగులకు మొదటి మూడేళ్లు 8.33 శాతం ఈపీఎఫ్ ప్రభుత్వమే చెల్లిస్తుంది.
* పంచాయతీలు, పురపాలక సంఘాల ఆర్థిక సాయం కోసం రూ.2.87లక్షల కోట్ల గ్రాంటు
* స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా కోసం రూ.500 కోట్లు