ధర్మవరం జంక్షన్‌లో పరిటాల శ్రీరామ్
posted on Feb 6, 2024 @ 10:02AM
అనంతపుర్ పాలిటిక్స్ ఎప్పుడూ హాట్‌హాట్‌గా ఉంటాయి.
అయితే జిల్లాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా వున్న ధర్మవరం....
ఫ్యాక్షన్ రాజకీయాలకు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్.
ధర్మవరం నియోజకవర్గంలో పట్టు నిలుపుకోవడానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి,
టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఇద్దరూ ఎక్కడా తగ్గడం లేదు. అయితే టీడీపీ అధిష్టానం పరిటాల శ్రీరామ్ విషయంలో నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తోంది. ధర్మవరం టికెట్ ను తాను వదులుకునేది లేదని తెగేసి చెబుతున్నా, శ్రీరామ్ ఆశలపై టీడీపీ నీళ్లు చల్లుతున్నట్టు కనిపిస్తోంది. శ్రీరామ్ కు ఆ టికెట్ లేనట్టేనా..!
టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించుకుని తీరాలనే కసితో ముందుకు సాగు తున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ ప్రస్తుతం అందివచ్చిన ఛాన్స్‌ను మిస్ చేసుకోకుండా ముందుకు సాగాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అవసరమైతే.. రెండు మెట్లు దిగి ముందుకు సాగాలని చూస్తున్నారు. ఇది రాజకీయంగా బాగానే ఉన్నప్పటికీ..
స్థానికంగా నాయకులు పెట్టుకున్న ఆశలపై మాత్రం నీళ్లు చల్లుతున్నట్టు కనిపిస్తోంది.
ఎందుకు చెబుతున్నానంటే....
ధర్మవరం నియోజకవర్గంపై పరిటాల కుటుంబం చాలానే ఆశలు పెట్టుకుంది.
గతంలో పరిటాల రవి ధర్మవరం నుంచి పోటీ చేశారు.
గత ఎన్నికల్లోనూ.. ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి పోటీ చేయాలని భావిస్తోంది.
కానీ, గత ఎన్నికల్లోనూ ఇప్పుడు కూడా.. ఒకే ఒక్క టికెట్‌ను ఈ కుటుంబానికి కేటాయిస్తున్నారు.
మరోవైపు ఇతర కుటుంబాలకు .. ఇదే జిల్లాలో రెండేసి టికెట్‌లు ఇస్తున్నారు.
ఇదే పరిటాల ఫ్యామిలీకి మింగుడు పడటం లేదట.
గత ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే కమ్ మంత్రిగా ఉన్న పరిటాల సునీత.. తన కుమారుడు.. శ్రీరాంను తెరమీదికి తెచ్చారు.
రాప్తాడు, ధర్మవరం రెండు నియోజకవర్గాలు కావాలని కోరారు.
కానీ, అప్పట్లోనూ రాప్తాడు ఒక్కటే ఇచ్చారు.
ఎవరైనా ఒక్కరే అంటూ.. ఒక నియోజకవర్గం ఇవ్వడంతో శ్రీరాం పోటీ చేశారు.
గెలుపుపై భారీగానే అంచనాలు వచ్చినా.. వైసీపీ హవాలో ఆయన ఓడిపోయారు.
ఇక,
ధర్మవరం టికెట్ నుంచి పోటీచేసిన వరదాపురం సూరి ఓడిపోయిన తర్వాత..
బీజేపీతీర్థం పుచ్చుకున్నారు.
దీంతో ధర్మవరంలోనే పాగా వేసిన శ్రీరాం..
గత రెండేళ్ల నుంచి ఇక్కడ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
రెండు నెలలపాటు పాదయాత్ర కూడా చేశారు.
అయితే.. ఇప్పుడు కూడా ఈ నియోజకవర్గం ఇచ్చే అంశంపై పార్టీలో చర్చ సాగుతోంది.
ప్రస్తుతం రాప్తాడు నియోజకవర్గాన్ని మాత్రమే పరిటాల కుటుంబానికి కన్ఫర్మ్ చేశారు.
అది కూడా సునీతకు మాత్రమే కేటాయించాలని తేల్చి చెప్పారు.
గతంలో టీడీపీ హయాంలో ఎప్పుడూ గన్మెన్లు మందీమార్బలంతో కనిపించిన వరదాపురం సూరి ఉరఫ్ సూర్యనారాయణ.. గత ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత.. అనూహ్యంగా అన్నీ సర్దుకుని బీజేపీలోకి వలసపోయారు. తీవ్రమైన భూ ఆక్రమణల ఆరోపణలున్న నేపథ్యంలో ఆయా కేసుల నుంచి తప్పించుకునేందుకే ఆయన బీజేపీలోకి జంప్ చేశారనే వాదన ఉంది.
పోనీ.. బీజేపీలో చేరిన తర్వాతైనా ఆ పార్టీ నాయకులకు అందుబాటులో ఉంటున్నారంటే అదీ లేదట. తన మానాన తాను ఉంటున్నారు. గత నాలుగేళ్లుగా ఆయన అసలు అందుబాటులో లేరట.
మొత్తానికి ఆయన తెరచాటున చక్రం తిప్పుతున్నారా? అనే సందేహాలు లేకపోలేదు.
2024 ఎన్నికల్లో తిరిగి టీడీపీ తరఫున పోటీ చేయాలని చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది.. ఆయన తర్వలోనే వస్తారని.. ఆయనకు టికెట్ ఇస్తున్నారని అంటున్నారు.
దీంతో టీడీపీ యువ నాయకుడు పరిటాల శ్రీరాం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఈ విషయమే ఇప్పుడు పరిటాల కుటుంబంలోఆవేదనను మిగుల్చుతోంది.
ఎందుకు చంద్రబాబు శ్రీరామ్ విషయంలో నిర్ణయం తీసుకోవడం లేదు....
ధర్మవరం టౌన్లో టీడీపీ క్యాడర్ కు ఉత్సాహం వస్తుందేమో కానీ, స్థానిక వ్యాపారులు ఎలా ఆలోచిస్తారనేది కీలకమైన అంశం.
ఎలాంటి ఫ్యాక్షన్ తగాదాలు, బెదిరింపులు, కిడ్నాపుల లేకుండా ధర్మవరం టౌన్ దాదాపు 15 యేళ్ల నుంచి ప్రశాంతంగా ఉంది. వరదాపురం సూరి, కేతిరెడ్డిల మధ్యన 15 యేళ్లుగా పోటీ సాగుతూ ఉంది. పోటీ రాజకీయం వరకే! ఇలాంటి నేపథ్యంలో పరిటాల అంటే స్థానికుల్లో కూడా ఒక కలకలం!
శ్రీరామ్ పోటీ చేస్తే గ్రామాలు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలం అవుతాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో శ్రీరామ్ కు బహుశా ధర్మవరం టికెట్ దక్కకపోవచ్చని, పరిటాల ఫ్యామిలీ కేవలం రాప్తాడుకే పరిమితం కావాల్సి రావొచ్చనేది నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న ప్రచారం.
అంతే కాదు
పరిటాల శ్రీరామ్ అయితే స్థానికేతరుడిని జనం ఆమోదించే అవకాశం లేదు,
సూరి అయితే పార్టీ క్యాడరే సహకరించదు.. ఇలాంటి నేపథ్యంలో వీరిద్దరూ కాకుండా పార్టీ కొత్త వారికి అవకాశం ఇస్తారా? అసలు చంద్రబాబు మనస్సులో ఏముంది?
వరదాపురం సూరికే అవకాశాలున్నాయని, ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిన వెంటనే అభ్యర్థిత్వం ఖరారు కావొచ్చనే ప్రచారమే ఉంది.
ధర్మవరం టికెట్ తనకు కాదని మరొకరికి ఇస్తే టీడీపీకి గుడ్ బై చెప్పి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా శ్రీరామ్ గతంలో ప్రకటించారు. ధర్మవరం టికెట్ ను తాను వదులుకునేది లేదని స్పష్టం చేశారు.
ఆ నేపథ్యంలో చంద్రబాబు నిర్ణయం ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠగా మారింది.