పరిటాల వారసుడు ఎక్కడ..?

 

 

పరిటాల శ్రీరామ్ ఇంకా పరారిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పరిటాల శ్రీరామ్ కోసం వెతుకుతున్న పోలీసులు అతని ఆచూకిని ఇప్పటి వరకు కనుక్కోలేకపోయారు. పరిటాల తనయుడు ముందస్తు బెయిల్ పిటిషన్ పై మంగళవారం అనతపురం కోర్ట్ లో వాదనలు ముగిశాయి. తీర్పును బుధవారానికి వాయిదా వేశారు.


కాంగ్రెసు నేత కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి హత్యకు కుట్ర పన్నారన్న కేసులో పరిటాల శ్రీరామ్‌తో పాటు పదిహేను మందిపై ధర్మవరం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయింది. దీనిపై పరిటాల శ్రీరామ్ ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో పరిటాల శ్రీరామ్ అజ్ఞాత ప్రదేశానికి వెళ్లినట్టు చెబుతున్నారు. పరిటాల శ్రీరామ్ అజ్ఞాతవాసం ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు.

Teluguone gnews banner