ఉగ్రదాడి బాధిత కుటుంబానికి జనసేన పార్టీ భారీ విరాళం

 

జమ్ముకాశ్మీర్  పహల్గామ్ ఉగ్రదాడిలో నెల్లూరు జిల్లా కావలికి చెందిన  మధుసూదన్ కుటుంబానికి జనసేన పార్టీ భారీ విరాళం విరాళం ప్రకటించింది. పార్టీ తరపున ₹50 లక్షల ఆర్ధిక సహాయం, అలాగే జనసేన పార్టీ ప్రమాద బీమా నుండి ₹5 లక్షల ఇన్సూరెన్స్ తో కలిపి మొత్తంగా ₹55 లక్షలు అందించనున్నామని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  కీలక ప్రకటన చేశారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో జనసేన పార్టీ తరుపున ఉగ్ర మృతులకు నివాళులు  అర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి హాజరై ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు. 

క్రియాశీలక జనసైనికుడు మధుసూదన రావు కుటుంబానికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఉగ్రదాడిపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేమని, కుటుంబపెద్ద అయిన మధుసూదన్ చనిపోవడం బాధకరమని అన్నారు.  డబ్బుతో ప్రాణాలకు విలువ కట్టలేమని, కానీ ఈ సాహయం కుటుంబపెద్దను కోల్పోయిన ఆ కుటుంబానికి ఆర్థికంగా తోడ్పాటును అందిస్తుందని తెలిపారు. అంతేగాక ఈ రోజు ఆర్థిక సహాయం చేసి వదిలేయడం కాకుండా మధుసూదన్ కుటుంబానికి ఏ కష్టం వచ్చిన ఎల్లవేళలా అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. 

Teluguone gnews banner