అద్వానీ, దిలీప్ కుమార్, అమితాబ్‌లకు పద్మవిభూషణ్

 

కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుడు ఎల్.కె.అద్వానీ, బాలీవుడ్ నటులు దిలీప్ కుమార్, అమితాబ్ బచ్చన్‌లకు పద్మవిభూషణ్ అవార్డులు ప్రకటించారు. అలాగే ప్రకాష్ సింగ్ బాదల్, కొట్టాయం కె.వేణుగోపాల్, కరీం హుస్సేనీ ఆగాఖాన్‌లకు పద్మభూషణ్ అవార్డులు ప్రకటించారు. ఇక పద్మశ్రీ అవార్డుల విషయానికి వస్తే, ప్రముఖ వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, డాక్టర్ రఘురాం, క్రీడాకారిణి పి.వి.సింధు, నటుడు కోట శ్రీనివాసరావు, క్రీడాకారిణి మిథాలి రాజ్, డాక్టర్ మంజుల అనగానిలకు పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు.

Teluguone gnews banner