మిల్లెట్స్ కు వ్యవస్థీకృత ప్రచారం.. యోగా అంతటి ప్రాచుర్యం
posted on Dec 20, 2022 @ 1:09PM
ప్రపంచానికి భారత్ ఇచ్చిన అపురూప కానుక యోగా.. ప్రతి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా డే నిర్వహించుకుంటున్నాం. ఆరోగ్య రక్షణకు యోగా ఎంతగానో దోహదపడుతుంది. యోగాకు ఎంతటి ప్రాచుర్యం లభించిందో మన సిరిధాన్యాలు (మిల్లెట్స్) కు కూడా అంతటి ప్రాచుర్యం తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
అత్యధిక పోషక విలువలు ఉన్న సిరిధాన్యాల వినియోగం మానవ ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని చెప్పిన మోడీ వీటికి వ్యవస్థీకృత ప్రచారాన్ని కల్పించాలని అన్నారు.
2023 అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం సందర్భంగా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఎంపీలందరికీ మంగళవారం (డిసెంబర్ 20) మిల్లెట్ లంచ్ ఏర్పాటు చేశారు. ఈ విందుకు ప్రధాని హాజరయ్యారు. ఎంపీలకు మిల్లెట్స్ లంచ్ లో రాగి, జొన్న, బజ్రా తదితర మిల్లెట్స్ పదార్థాలను వడ్డించారు.