హైదరాబాద్‌లో ఆపరేషన్ అభ్యాస్ మాక్ డ్రిల్.. నాలుగు ప్రదేశాలలో నిర్వహణ
posted on May 7, 2025 @ 4:49PM
దేశంలో నెలకొన్న భద్రత పరిస్థితుల దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మాక్ డ్రిల్ సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్ బాగ్ డీఆర్‌డీఓ మౌలాలిలోని NFC లో సైరన్లు మ్రోగాయి. రెండు నిమిషాల పాటు సైరన్లు మోగిన తరువాత మాక్ డ్రిల్ లో అవగాహన కల్పించారు. 15 నిమిషాల పాటు మాక్ డ్రిల్ కొనసాగుతుందని తెలిపారు. NCC, NSS క్యాడెట్స్, NDRF, SDRF రెస్క్యూ రిహార్సల్ చేపట్టబోతున్నట్టు సీవీ ఆనంద్ తెలిపారు.
సైరన్ మోగిన తరువాత ప్రజలు స్పందించాల్సిన తీరుపై అవగాహన కల్పించారు. సైరన్ మోగిన తరువాత ప్రజలు ఇళ్లలోనే ఉండాలని.. బయటికి రావద్దని సూచించారు. ఒకవేళ బయట ఉన్నవాళ్లు సురక్షిత నిర్మాణాల్లోకి వెళ్లాలని కోరారు. ప్రమాదాలు జరిగితే ఎలా అరికట్టాలని.. అక్కడ వైద్య సిబ్బందిని అంబులెన్స్ లను ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. ప్రమాద ఎమర్జెన్సీ సమయంలో ఏ విధంగా వ్యవహరించాలని సూచించారు మాక్ డ్రిల్ లోభవనాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా వ్యవహరించాలని అవగాహన కల్పించారు.