ఉల్లి ధర తగ్గబోతోంది... ఎందుకంటే...!
posted on Aug 7, 2024 @ 6:31PM
సాధారణంగా ఉల్లిపాయలు కోస్తే కన్నీళ్ళు వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉల్లిపాయల రేటు వింటేనే కన్నీరు వస్తోంది కదూ.. ఇక అతి త్వరలో ఆ కన్నీళ్ళు ఆనందబాష్పాలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు నమ్మబుద్ధి కాదుగానీ, ఇది నిజం అయ్యే అవకాశాలు వున్నాయి.. త్వరలో ఉల్లిపాయల రేట్లు తగ్గబోతున్నాయి. ఎందుకంటే, ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో సంక్షోభం నడుస్తోంది కదా. అక్కడ పరిస్థితి అంతా ఉద్రిక్తంగా వుంది. దాంతో ఇండియా నుంచి బంగ్లాదేశ్‌కి వెళ్ళాల్సిన ఉల్లిపాయల ట్రక్కులన్నీ బంగ్లాదేశ్ సరిహద్దుల్లోనే నిలిచిపోయాయి. ఈ ట్రక్కులు ఇప్పుడప్పుడే బంగ్లాదేశ్‌లోకి వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు. అప్పటి వరకూ లారీల్లో వున్న ఉల్లిపాయలు ఊరుకోవు కదా.. కుళ్ళిపోతాయి కదా.. అందుకని, ఆ ఉల్లిపాయలన్నీ మన దేశ మార్కెట్లోకి రిటర్న్ అయ్యే అవకాశం వుంది. సప్లయ్ పెరిగితే డిమాండ్ తగ్గుతుందన్న ఎకనామిక్స్ సూత్రాన్ని అనుసరించి త్వరలో దేశంలో ఉల్లిపాయల ధరలు తగ్గే అవకాశం వుంది. అదన్నమాట!