ముసలోడి లై*గిక వేధింపులు.. కుర్చీలో కట్టేసి.. సీసీటీవీ ఫుటేజ్..
posted on Mar 13, 2021 @ 4:06PM
ఆ భార్యభర్తలు విడిపోయారు. విడాకులూ తీసుకున్నారు. ఆమె రెండో పెళ్లి చేసుకుంది. అతను సింగిల్. అయితేనేం, మాజీ భార్యపై మోజు పోలేదు. లై*గిక వేధింపులు ఆపలేదు. తనకు అది కావాలంటూ తరుచూ టార్చర్ చేసేవాడు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. ఆ మాజీ మొగుడి వయసు 65ఏళ్లు.
మొదటి భర్త నుంచి లై*గిక వేధింపులు పెరగడంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. అతడిని కుర్చీలో కట్టేసి గొంతు కోసి చంపేసింది. తనను లై*గికంగా వేధించినందుకు ప్రతీకారంగా ఆ హత్య చేసినట్లు పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే నిజమేనని తేలింది. నిందితురాలిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నాగ్‌పూర్‌లో జరిగింది.