ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్.. అదంతే!
posted on Sep 3, 2022 @ 2:57PM
ఎన్టీఓడు అని తెలుగువాళ్లు ప్రేమగా పిలుచుకునే వెండితెర వేలుపు దర్శనీయుడు. ఆయన్ను చూడాల ని ఎక్కడెక్కడినుంచో మద్రాసు వెళుతూండేవారు. అప్పట్లో తెలుగు నేల నుంచి మద్రాసు రైలెక్కెళు తోంటే ఎన్టీఆర్‌ని సూడ్డానికా? అని అడిగేవారట. ఇందులో అతిశయోక్తి లేదు. నిజ్జంగానే అలా వీరాభిమా నులు వెళుతూండేవారు. తెరమీద హీరోగా, వీరాధివీరుడుగా, రాముడు, కృష్ణుడిగానూ ప్రజల మనసులో సుస్థిరస్థానం సంపాదించుకున్న మహా నటుడు ఎన్.టి.రామారావు. ఏ పాత్రలోనైనా లీనమై పాత్రను పం డించడంలో ఆయనకు ఆయనే సాటి. ఎంతో దీక్షతో నటించడం అంటే ఆయన్ను గురించే ప్రస్తావి స్తారు ఇప్పటికీ. చూసి నవారు, ఆయనతో మాట్లాడినవారు, ఫోటోలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకున్న వారు లక్షల్లో ఉంటారేమో! తెరమీద సమ్మోహ నాస్త్రం!
క్రికెట్ లోకంలో అరవీరభయంకరులు వెస్టిండీస్. 1960ల్లో వారిని ఢీకొనడానికి ఇంగ్లండ్ ప్లేయర్ల సైతం ధడిసేవారు. సోబర్స్ వంటి దిగ్గజాలు ఉండేవారు. ఆయన గొప్ప ప్లేయర్‌గా లోకమంతా ప్రసిద్ధి. ఆయన ఆటను చూడ్డానికి వెస్టిండీస్ పర్యటించే ప్రాంతాలకు వెళ్లే జనాలు ఉండేవారు పూర్వం. అంతెందుకు 1967లో భారత్‌కి వెస్టిండీస్ వచ్చినపుడు సోబర్స్‌ను చూడ్డానికి పనిగట్టుకుని ఆంధ్రప్రదేశ్ మారుమూల ప్రాంతం నుంచి కూడా మద్రాస్ వెళ్లారు. ఆ టెస్ట్‌లో ఆయన బ్యాటింగ్ విరుపులు చూసి ఆశ్చర్య పోయారు. చాలా సింపుల్‌గా కనిపించే ఈయనే బ్యాట్‌పట్టగానే బౌలర్లకు ముచ్చమటలు పట్టించే పరుగుల వరదనే సృష్టించేవాడు. ముఖ్యంగా కవర్‌డ్రైవ్, మిడ్‌వికెట్ లోకి ఫోర్లు కొట్టడం బహు ముచ్చ టగా ఉంటాయని ఇప్పటికీ చెబుతూంటారు, ఆనాటి వారు. రేడియోలో కామెంట్రీ వినడం అనేది ఆయన ఆటతీరును వినడానికే చెవికి రింగులా ట్రాన్సిస్టర్స్ పెట్టుకు తిరిగేవారు. అంతటి వీరాభిమానులు ఉండేవారాయనకు.
అదుగో అంతటి సోబర్స్ మన ఎన్టీఆర్‌ను చూడాలని తాపత్రయపడ్డాడు. అది 1967. భారత్ వెస్టిండీస్ ల మధ్య మద్రాసులో టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఆట చూడ్డానికి చాలామంది వెళ్లారు. చూసి తరించారు. అంద రూ సోబర్స్‌ని పొగడ్తలతో ముంచెత్తారు. కానీ ఆయన మనసులో కోరిక బయటికి చెప్పే సరికి చుట్టూ ఉన్న వారు ఆశ్చర్యపోయారు. అదేమంటే.. ఐ వాంట్ టు సీ మిస్టర్ ఎన్.టి. రామారావు, యువర్ సినీ యాక్టర్!.. అని అడిగాడు ఆ క్రికెట్ లెజండ్ . ఈడేందీ వెట్టిండీసోడు.. మన ఎన్టీఓర్ని సూత్తానం టాడేంది మావా!.. అనుకున్నారు తెలుగు వారంతా. ఎన్టీఆర్‌ను ఎలాగయినా చూడాలని, కలవాలని సోబర్స్ కలవరించాడు. చాలామందిని ఎన్టీఆర్‌ని కలిసే మార్గం అడిగాడట. అయితే అప్పట్టో ఆయన్ను కలవడం కడుదుర్లభం. సినిమా షూటింగ్‌లు మద్రాసులో జరుగుతున్నప్పటికీ అమాంతం వెళ్లి చూడ్డా నికి అస్సలు వీలుండేది కాదు.. అది సోబర్స్ అయినా సాంబయ్య అయినా. అంతే. ఎన్టీఆర్‌ను కలవ డానికి ప్రయత్నించి విఫలమయినవారు అనేకానేకం. సోబర్స్ వచ్చాడని ఎన్టీఆర్ కలవడానికేమీ సిద్ధం గా ఉండ లేదు. అవతలా యన గొప్ప క్రికెటర్ కావచ్చు, కానీ ఇవతల ఉన్నది ఎన్టీఆర్. అంత సులువుగా దర్శనం దొరకదు.
అప్పట్లో మద్రాసులో కంచుకోట సినిమా షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ చాలా బిజీ, అంతకంటే సీరియస్. సరదా మాటలకు, సరదాలకు అస్సలు ఛాన్స్ లేదు. కానీ ఆయన్ను కలవాలనుకున్నాడు సోబర్స్. అంచేత షూటింగ్ విరామం సమయంలో కలిసేందుకు ప్రయత్నిం చాడు. అసలు ఎన్టీఆర్ గురించి సోబర్స్‌కి ఏం తెలుసు? పోనీ ఎవరు చెప్పారన్న సంగతి అలా ఉంచితే, వాళ్లిద్దరినీ చూడ్డానికి అక్కడి సినీజనానికి, బయటివారికీ వెయ్యి కళ్లు సరిపోలేదేమో! సరే మాటలెం దుకు మీరూ ఆ అద్భుత వ్యక్తుల కలియిక నాటి ఫోటో చూడండి. ఫోటోలో.. సోబర్స్, ఎన్టీఆర్, ఎంజీఆర్, సావిత్రి, జెమినీ గణేషన్, ధూళిపాళ,జగ్గారావు తదితరులు ఉన్నారు.