కోర్ట్ లో లో౦గిపోయిన నిర్మాత బండ్ల గణేష్

 

 

ఎన్టీఆర్ 'బాద్ షా' ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఈరోజు రాజేంద్రనగర్ కోర్టులో లొంగిపోయారు. 'బాద్ షా' ఆడియో ఫంక్షన్ లో తొక్కిసలాట జరిగి అభిమాని మరణించడంతో రాయదుర్గ పోలీసులు గణేష్ పై 304(ఎ) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. సరైన సదుపాయాలు కల్పించడంలో విఫలమైనందున వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో బండ్ల గణేష్తో పాటు బాద్షా ఆడియో ఫంక్షన్ నిర్వాహకుడు కూడా కోర్టులో లొంగిపోయాడు.


తొక్కిసలాటలో మరణించిన అభిమానికి జూనియర్ ఎన్టీఆర్ ఐదు లక్షలు, నిర్మాత బండ్ల గణేష్ ఐదు లక్షలు చొప్పున రాజు తల్లి ఈశ్వరమ్మ కి మొత్తం పది లక్షలు ఆర్ధిక సహాయం చేశారు.

 

Teluguone gnews banner