యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్‌డే స్పెషల్
posted on May 19, 2013 @ 7:11PM
ఎన్టీఆర్.. తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లింఖించిన పేరు.. ఆ పేరు లేకుండా తెలుగు సినిమా అనే ప్రస్థానం పూర్తి కాదు.. అందుకే ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు.. ఆ పేరు కొందరికి దైవం అయితే కొందరికి మాత్రం అదే పేరు బాధ్యత.. అలాంటి బాధ్యతను అతి చిన్న వయసులో తీసుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్..
ఈ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన కెరీర్‌పై ఓ లుక్..
నందమూరి వారసునిగా తెలుగు తెరకు పరిచయం అయిన ఎన్టీఆర్ తన తొలి సినిమా నుంచి ఆ స్థాయిని కొనసాగించాడు.. బాల నటుడిగా సీనియర్ ఎన్టీఆర్ తెరకెక్కించిన హిందీ సినిమా బ్రహ్మర్షి విశ్వామిత్రలో నటించిన ఎన్టీఆర్ తరువాత బాలరామయణం సినిమాలో శ్రీరామునిగా పూర్తి స్థాయి నటునిగా వెండితెరకు పరిచయం అయ్యాడు.. గుణశేఖర్ దర్శకత్వంలో ఎమ్‌ఎస్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాతో పౌరాణిక పాత్రలో నటించాలంటే నందమూరి వారే చేయాలని నిరూపించాడు..
పూర్తి స్థాయి హీరోగా ఎన్టీఆర్ నటించిన తొలి సినిమా మాత్రం నిన్నుచూడాలని.. తొలి ప్రయత్నంలో నిరాశ పరిచినా రెండో సినిమా స్టూడెంట్ నెంబర్ 1 తో మాత్రం భారీ సక్సెస్ అందుకున్నాడు.. ఈ సినిమాతోనే టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి కూడా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.. ఈ సినిమా వీరిద్దరికి భారీ సక్సెస్‌తో పాటు స్టార్‌డమ్‌ను కూడా సాదించిపెట్టింది.
స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో యూత్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ మాస్ హీరోగా టర్న్ తీసుకున్న సినిమా ఆది.. దిల్ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న వివి వినాయక్ రెండో ప్రయత్నంగా తెరకెక్కిన ఈ సినిమాతో ఎన్టీఆర్ స్టార్ స్టేటస్‌తో పాటు మాస్ ఇమేజ్‌ను కూడా సొంతం చేసుకున్నాడు..
ఎన్టీఆర్ కెరీర్‌లో మరో మైల్ స్టోన్ సింహాద్రి.. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో ఎన్టీఆర్‌కు తొలి సక్సెస్ అందించిన రాజమౌళి.. సింహాద్రి సినిమాతో స్టార్ హీరోల సరసన నిలబెట్టాడు.. అప్పటి వరకు తడబడుతూ నడిచిన ఎన్టీఆర్ కెరీర్ సింహాద్రి సినిమాతో ఒక్కసారిగా పీక్స్‌కు చేరింది..
సింహాద్రి సక్సెస్ ఎన్టీఆర్ కెరీర్‌కు ఎంత ఉపయోగపడిందో అంతే నష్టం కూడా చేసింది.. సింహాద్రి లాంటి భారీ మాస్ యాక్షన్ క్యారెక్టర్ తరువాత మామూలు సినిమాల్లో ఎన్టీఆర్ ను చూడలేకపోయారు అభిమానులు.. దీంతో చాలా కాలం ఎన్టీఆర్ ఫ్లాప్స్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది..
అయితే అశోక్, రాఖీ లాంటి సినిమాలతో మరోసారి ఫామ్‌లోకి వచ్చాడు ఎన్టీఆర్.. ఈ రెండు సినిమాలు ఎన్టీఆర్‌లోని నటున్ని ఆవిష్కిరించినా భారీ కమర్షియల్ సక్సెస్‌ను మాత్రం అందించలేకపోయాయి.. దీంతో మరోసారి ఆ బాధ్యతను తీసుకున్నాడు రాజమౌళి.. యమదొంగ సినిమాతో మరోసారి ఎన్టీఆర్‌కు బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించి హ్యాట్రిక్ సాదించాడు..
ఇక ఎన్టీఆర్ కెరీర్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో సినిమా అదుర్స్ అప్పటి వరకు మాస్ అండ్ యూత్ స్టోరీస్ మాత్రమే చేసిన ఎన్టీఆర్ ఈ సినిమాతో కామెడీని కూడా ట్రై చేశాడు.. ఈ సినిమాలో ఎన్టీఆర్ చేసిన చారి క్యారెక్టర్ ఆయన కెరీర్‌లోనే వన్ ఆఫ్‌ది బెస్ట్ క్యారెక్టర్..
వరుసగా మాస్ సినిమాలు మాత్రమే చేసిన తన మీద ఆ ముద్ర పడకుండా జాగ్రత్త పడ్డాడు ఎన్టీఆర్.. అందుకే కేవలం మాస్ సినిమాలే కాకుండా బృందావనం లాంటి ఫ్యామిలీ స్టోరితో కూడా మెప్పించి తను ఎలాంటి క్యారెక్టర్ అయిన చేయగలనని నిరూపించుకున్నాడు..
ప్రస్థుతం ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ హీరోస్‌లో ఒకరు ఆయనతో సినిమా అంటే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌లు కూడా క్యూలో ఉంటారు.. ఎన్టీఆర్ అన్న పేరుకు ఉన్న విలువను కాపాడుతూనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ మరిన్ని విజయాలతో దూసుకుపోవాలి కోరుకుంటూ మరోసారి ఈ యంగ్ టైగర్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేద్దాం..