అమెరికాలో తెలుగువిద్యార్థుల్ని ఆదుకుంటున్నాం!
posted on May 3, 2020 @ 5:26PM
ప్రపంచంలోని తెలుగువాళ్లు కరోనా కారణంగా ఎటువంటి ఇబ్బందులకు లోనుకాకూడదు అని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారు ఇచ్చిన ఆదేశాలతో నార్త్ అమెరికా ఏపి ప్రత్యేక ప్రతినిధిగా పలు చర్యలు చేపట్టాం. కెనడాలో రెండుసిటీలు, అమెరికాలో దాదాపు 25 స్టేట్స్ లో 45 సిటీలలోని తెలుగువిద్యార్ధులు లాక్ డౌన్ కారణంగా అనేక ఇబ్బందులకు లోనవుతున్నారు.
లాక్ డౌన్ లో ఇబ్బందుల్లోఉన్నవారిని ఇక్కడి వాలంటీర్ వ్యవస్ధ స్పూర్తితో అమెరికాలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు, మధ్దతుదారులను కలుపుకుని ఈ 45 సిటీలలో చదువుతున్న తెలుగు విధ్యార్దులకు నిత్యావసరాలు ఇవ్వడం జరిగిందని నార్త్ అమెరికా ఏపి ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ తెలిపారు.
ఆ విధ్యార్దులకు పర్సనల్ గా ఫోన్ చేయడం వారికి కావాల్సినవి లిస్ట్ అవుట్ చేసి డోర్ డెలివరీ చేయడం జరిగింది.మరి కొందరికి 100 డాలర్ల చొప్పున వారి బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేశాం.
సహాయం అందుకున్న తెలుగువిద్యార్ధులు ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిని అభినందించారు.
అమెరికాలో సహాయం అందించే మరింతమందిని కలుపుకుని విద్యార్ధులకు కావాల్సిన గ్రాసరీస్ పంపిణి కొనసాగుతుంది. మా కమిటీలో కొందరు ఫార్మర్స్ ఛాలెంజ్ అనే కాన్సెప్ట్ తీసుకుని సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. పొట్టకూటికోసం కువైట్ వెళ్లి వీసాలు, రిజిస్ర్టేషన్ లకోసం ఇబ్బంది పడుతున్న తెలుగువాళ్లను తక్షణం ఏపికి చేర్చేవిధంగా అటు కువైట్ ప్రభుత్వానికి,కేంద్రప్రభుత్వానికి జగన్ గారు లేఖ రాయడం జరిగింది.
రవాణా బ్యాన్ కారణంగా అమెరికాలో ఇరుక్కుపోయిన తెలుగువాళ్ళను ఇండియాకు తీసుకువచ్చేవిధంగా చేయాలని ఏపి ఎన్ ఆర్ టి తరపున ముఖ్యమంత్రిగారికి లెటర్ ఇచ్చాం.దానికి సిఎంగారు వెంటనే స్పందించి విదేశీవ్యవహారాలశాఖకు లెటర్ రాశారు. అమెరికాలో రవాణా బ్యాన్ కారణంగా ఉండిపోయిన తెలుగువాళ్లను ఇండియాకు చేర్పించే ప్రయత్నం చేయాలని కోరారు. ముఖ్యంగా వృధ్దులకు ప్రయారిటీ ఇవ్వాలని సూచించారు.
తెలుగుదేశం పార్టీనేతలు కరోనా నేపధ్యంలో కష్టాలు పడుతున్న ఇక్కడ ప్రజలకు గాని, అమెరికాలోని తెలుగుప్రజలకు ఏలాంటి సహాయకార్యక్రమాలు చేయలేదని ఆయన ఆరోపించారు.
చంద్రబాబు ఎంతసేపటికీ వీడియో మీటింగ్ లు పెట్టుకుని పబ్లిసిటీకి వాడుకోవడం,కరోనాను నియంత్రించేందుకు చిత్తశుద్దితో పనిచేస్తున్న ప్రభుత్వంపై బురదచల్లడం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.