బాబూ మోహన్‌కు నో టిక్కెట్.. కొండా సురేఖకు డౌట్.!!
posted on Sep 6, 2018 @ 4:55PM
కేసీఆర్ వచ్చే ఎన్నికలకు తెరాస తరుపున బరిలోకి దిగే 105 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే ఇద్దరు ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తప్పించి ఇంచు మించు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ కేసీఆర్ అవకాశం కల్పించారు.. టిక్కెట్ కోల్పోయిన వారిలో ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే బాబూ మోహన్ కూడా ఉన్నారు.. అయితే ఆయన దురుసు తనం కారణంగానే ఆయన టిక్కెట్ కోల్పోయారనే అభిప్రాయాలూ వ్యక్తమవుతోన్నాయి.. బాబూ మోహన్ అధికారులతో దురుసుగా మాట్లాడుతున్న వీడియో, కార్యకర్తలను తన్నటానికి కాలెత్తిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. ఆయన ప్రవర్తన మూలంగా అక్కడ నియోజకవర్గ ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.. దాని మూలంగానే కేసీఆర్ బాబూ మోహన్ కి టిక్కెట్ నిరాకరించినట్టు సమాచారం.
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ పేరు కూడా జాబితాలో లేదు.. ప్రస్తుతం ఆ సీట్ ని పెండింగ్ లో ఉంచారు.. అయితే కొండా సురేఖ టిక్కెట్ కూడా డౌట్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.. కొండా సురేఖకు సొంత పార్టీ నేతలతో విభేదాలు తలెత్తుతున్నాయి.. దీంతో కేసీఆర్ ఆమె తీరుపై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.. ప్రస్తుతానికైతే కొండా సురేఖకు టిక్కెట్ డౌట్ అనే మాట వినిపిస్తోంది.. చూద్దాం మరి ఏం జరుగుతుందో.