ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు కోతల్లేవ్!
posted on Jul 30, 2014 @ 4:41PM
నవ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రజలు రంజాన్ రోజున ఒక శుభవార్త విన్నారు. ఆ శుభవార్త మంగళవారం నుంచి అమలులోకి రావడంతో ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు. రెండు సంవత్సరాల నుంచి తమను వేధించిన ఆ సమస్య మంగళవారంతో సమసిపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో సంతోషంగా వున్నారు. ఆ సమస్య పేరు కరెంట్ కోత. మంగళవారం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు కోతలు నిలిచిపోయాయి. మంగళవారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పల్లెటూళ్ళతో సహా అన్ని ప్రాంతాలోనూ నిరంతరాయంగా 24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా కాలంతో సంబంధం లేకుండా నిరంతరం విద్యుత్ కోతలను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ పరిణామం సంతోషాన్ని కలిగిస్తోంది. ఎండలు తగ్గిపోవడంతో విద్యుత్ వినియోగం తగ్గిపోయింది. దానితోపాటు విద్యుత్ ఉత్పత్తి కూడా పెరగడంతో కరెంటు కోతలను ఎత్తివేశారు. త్వరలో పరిశ్రమలకు కూడా ఎలాంటి కోత లేకుండా విద్యుత్ ఇచ్చే అవకాశం వుందని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఇరుగు పొరుగు రాష్ట్రాలకు భారీ స్థాయిలో విద్యుత్ అమ్మే స్థాయికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.