నిమ్మగడ్డ నిజంగా హోమ్ శాఖకు లెటర్ రాయలేదా?
posted on Apr 25, 2020 @ 7:44PM
నిమ్మగడ్డ రమేష్ కుమార్ మార్చ్ 18 వ తేదీన సెంట్రల్ హోం డిపార్ట్ మెంట్ కు నిజంగా ఉత్తరం రాయలేదా? ఇది ఎవరో రాస్తే ఆయన సంతకం పెట్టి పంపించారనే భావన సర్వత్రా వ్యాపించింది. ఉత్తరం చదివిన ప్రతివారికి ఆ భావన కలుగుతోంది.దానిపై విచారణ చేయాల్సిందిగా కోరడం,విచారణ ప్రారంభం కావడం కూడా మనం చూశాం.విచారణలో వెలుగులోకి వస్తున్న అంశాలు చూస్తే కొంత ఆశ్చర్యం కలుగుతోంది.ఆయన, పర్సనల్ సెక్రటరిగా ఉన్న సాంబమూర్తిగారిని సిఐడివారు విచారణ చేస్తే అది డెస్క్ టాప్ ముందు తయారుచేయడం,తర్వాత లాప్ టాప్ కు పంపడం,తర్వాత పెన్ డ్రైవ్ ద్వారా రమేష్ కుమార్ కు పంపిితే ఆయన హోంశాఖకు పంపించినట్లుగా చెపుతున్నారు.
ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి చూస్తే డెస్క్ టాప్,లాప్ టాప్ లలో ఫార్మాట్ చేశారు.పెన్ డ్రైవ్ లో అయినా ఉందా అంటే దానిని ధ్వంసం చేశారు.ఏంటిది....ఇది దేనికి సంకేతం.ఇంతకుముందు వ్యక్తమైన అనుమానాలను బలపరుస్తున్నాయా ....లేదా....ఎస్....నిజంగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నప్పుడు అధికారికంగా లెటర్ రాస్తే దాని ఆధారాలను లేకుండా చేయాల్సిన పరిస్ధితి ఎందుకు వచ్చింది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న." అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు స్వతంత్రంగా వ్యవహరించలేదు...ఆయన ఒకరి చేతిలో కీలుబొమ్మలాగా వ్యవహరించారు.చంద్రబాబుగారు ఏమీ చెబితే అది చేశారు.ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టారు..టిడిపి కార్యాలయంలో తయారుచేసిన ఉత్తరం మీద మాత్రమే రమేష్ కుమార్ గారు సంతకం పెట్టారు తప్ప ఆయన ప్రిపేర్ చేసిన లెటర్ కాదు అనేటువంటి అనుమానాలు బలపడుతున్న సందర్భం," అంటూ వై ఎస్ ఆర్ సి పీ ఎం ఎల్ ఏ అంబటి రాంబాబు లేవనెత్తిన ప్రశ్న, కొత్త సందేహాలకు తావిస్తోంది. 221 దీనికి రిఫరెన్స్ నెంబర్ ఇస్తే, ఆ నెంబర్ ఏమిటని అడిగితే టిడిపి ఎంఎల్సి అశోక్ బాబు రాసిన లెటర్ కిచ్చిన నెంబర్ ను దీనికి ఇచ్చారు. అంటే తప్పుచేసేటప్పుడు కచ్చితంగా ఆధారాలు వదిలిపెట్టి వెళ్తారనేది ఇక్కడ నిజమయిందన్న మాట అంటూ కూడా రాంబాబు విశ్లేషించారు.