పెళ్లి అయింది.. ప్రాణం పోయింది..
posted on May 29, 2021 @ 2:52PM
ఈ రోజుల్లో యువతి యువకులకు ప్రాణాలంటే లెక్క లేకుండా పోయింది..తమకు నచ్చిన దానిని పొందకపోతే మొత్తం జీవితమే లేదన్నట్టుగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్నారు..చుట్టు తమ కుటుంబసభ్యులు ఉన్నా ఎవరికి చెప్పుకోలేక క్షణాల్లో ప్రాణాలు తీసుకుంటున్నారు..దీంతో తాము ఏదో, సాధిస్తున్నామనే ఫీలింగ్‌తో మొత్తం కుటుంబాన్ని విషాదంలో పడేస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే తాజాగా పెళ్లై ఇంట్లో సంతోషంగా తిరగాల్సిన నవ వధువు ఒక్కరోజులోనే డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. కుటుంబం మొత్తం పెళ్లి చేసామని సంబురపడే లోపే వారి ఆశలపై నీళ్లు చల్లింది..కూతురుకు పెళ్లి చేస్తే సుఖపడుతుందనుకున్న తల్లిదండ్రుల జీవితాల్లో విషాదం నింపింది..ఇరవై ఒక్క సంవత్సరాలు తమ గుండెలపై పెరిగిన ఆడపిల్ల పెళ్లైన తెల్లారే తమని కాదని తనువు చాలించింది..కారణాలు చెప్పకుండానే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది..
ఓపెన్అ చేస్తే.. అది యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణ పురం. మర్రిబావి తండా. ఈ తండాకు చెందిన అనుషా. ఆ అమ్మాయి వయసు 21 సంవత్సరాలు. ఈ యువతికి మే 26న సమీపంలోని పెద్దపురం తండాకు చెందిన మధు అనే యువకుడితో వివాహం జరిగింది. తల్లిదండ్రులు అంగరంగ వైభవంగా ఆ అమ్మాయి పెళ్లి చేశారు. అనంతరం 27వ తేదిన పెద్దపురంలో పెళ్లి కొడుకు ఇంటి వద్ద రిసెప్షన్ జరిగింది..అదే రోజు రాత్రి భార్యభర్తలు ఇద్దరు కలిసి మర్రిబావి తండాలోని తల్లిగారి ఇంటికి చేరుకున్నారు. అంతా బాగానే ఉందనుకున్న కుటుంబసభ్యులకు ఒక షాకింగ్ న్యూస్ .
కట్ చేస్తే.. అనూష ఈ నెల 28 మధ్యాహ్నం తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది..కొత్త పరిచయాలు, కొత్త ఇల్లు, అందులోను అలసిపోయి ఉంటుంది అందుకే రెస్ట్ తీసుకుంటుందని అంతా భావించారు.. అనూష ఇంట్లోకి వెల్లడి గంటలు గడుస్తున్నాయి. చివరికి సాయంత్రం అయినా బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు తలుపులు తీసి గదిలోకి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది అనుష. దీంతో తల్లిదండ్రులు వెంటనే కిందికి దించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు..శవాన్ని పోస్టు మార్టంకు పంపించారు.. పోలీసులు.అయితే యువతి పెళ్లి మరునాడే ఆత్మహత్యకు పాల్పడిన కారణాలు మాత్రం తెలియరాలేదు.