హైదరాబాద్‌లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు పై నాయక్ రికార్డ్...!
posted on Jan 7, 2013 @ 4:22PM
టాలీవుడ్ లో ఈ సంక్రాంతి కి బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు మెగా సినిమాలు పోటిపడుతున్న సంగతి తెలిసిందే. అవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న "నాయక్", సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న మల్టీస్టారర్ "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు". అయితే రికార్డుల పరంగా ఏ సినిమా పై చేయి సాధిస్తుందనేది అభిమానుల్లో చర్చనీయాంశం గా మారింది.
తెలుగు సినిమా కలెక్షన్ లకు హార్ట్ గా భావించేది నైజాం ఏరియా, అందులో ఎక్కువగా వసూళ్ళు హైదరాబాద్ నుంచె వస్తుంది. కనుక హైదరాబాద్ లో ఎక్కువ ధియేటర్లను దక్కించుకొనేందుకు ఈ రెండు సినిమాలు పోటిపడుతున్నాయి. అయితే ఈ పోటిలో రామ్ చరణ్ నాయక్ ఎక్కువ ధియేటర్లు దక్కించుకున్నట్లు సమాచారం.
హైదరాబాద్ వ్యాప్తంగా నాయక్ చిత్రానికి తొలి రోజు 110 స్క్రీన్లు దక్కినట్లు తెలుస్తోంది. మహేష్, వెంకటేష్ నటిస్తున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రానికి 80 నుంచి 90 మధ్య థియేటర్లు దక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ రెండు చిత్రాలను నైజా౦ ఏరియాలో దిల్ రాజు పంపిణీ చేస్తున్నారు. "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" కి దిల్ రాజు నిర్మాత కూడా.
ఈ నేపథ్యంలో దిల్ రాజు నాయక్ కంటే తన సొంత సినిమాను ఎక్కువ థియేటర్లు కేటాయిస్తారనే ప్రచారం జరిగింది. కానీ చిరంజీవి ప్రభావమో లేక అల్లు అరవింద్ మహిమో తెలియదు కానీ, మొత్తానికి ‘నాయక్' చిత్రం హైదరాబాద్ ఏరియాలో అత్యధిక థియేటర్లు దక్కించుకుంది.