Read more!

క్యాన్సర్ మీద యుద్ధ ప్రభంజనం!

నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే  భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 7 వ తేదీన జరుపుకుంటారు.  ఈ కాన్సర్ అవేర్నెస్ డే ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే క్యాన్సర్ యొక్క తీవ్రమైన ప్రమాదం గురించి ప్రజలకు అవగాహన కల్పించే దిశగా ఈ అవేర్నెస్ డే రోజున ఎంతో గొప్ప కృషి జరుగుతుంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రజలలో మరణానికి కారణమయ్యే రెండవ అత్యంత ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్.  క్యాన్సర్‌తో మరణించే వారి పరిస్థితి భారతదేశానికి తీవ్రమైన ప్రమాదంగా ఉంది.  

2020లో భారతదేశంలో 8.5 లక్షల మంది క్యాన్సర్‌తో మరణించారంటే దీని ప్రభావం ప్రజల జీవితాల్లోకి ఎంతగా చొచ్చుకుని పోయిందో అర్థం చేసుకోవచ్చు.  ఈ కారణంగా, ఈ రకమైన క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం నవంబర్ 7న నేషనల్ క్యాన్సర్ అవేర్‌నెస్ డే ని జరుపుకుంటారు. 

దీని చరిత్ర ఏమిటి?

 కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ మొదటిసారిగా 2014 సెప్టెంబరు నెలలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని ప్రకటించారు. క్యాన్సర్ నియంత్రణపై రాష్ట్రస్థాయి ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఇందులో భాగంగా  ఉచిత స్క్రీనింగ్ కోసం మున్సిపల్ క్లినిక్‌లకు సందర్శించమని ప్రజలను ప్రోత్సహించాడు.  క్యాన్సర్  ప్రారంభ సంకేతాలు మరియు దానిని ఎలా నివారించాలి అనే దాని గురించి వివరాలను పొందుపరిచిన బుక్‌లెట్ కూడా అప్పుడు పంపిణీ చేసారు.

 జరిగిన కృషి

 ఈ ప్రాణాంతక వ్యాధికి వ్యతిరేకంగా దేశంలో ఒక ముఖ్యమైన అడుగు 1975లో  పడింది. దేశంలో క్యాన్సర్ చికిత్సను సులభతరం చేయడానికి  నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ప్రోగ్రామ్‌తో ఈ అడుగు ప్రారంభమైంది.  10 సంవత్సరాల తర్వాత, 1984-85లో, ముందస్తుగా క్యాన్సర్‌ని గుర్తించడం, దాని నివారణపై దృష్టి సారించేందుకు ప్రణాళిక  విధానం సవరించబడింది. ఆ తరువాత దీని గురించి కృషి జరిగినా అది ప్రజలలోకి తీవ్రంగా చొచ్చుకుని వెళ్లలేకపోయింది. దానికి తగ్గట్టు అప్పటి దేశ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పరిష్కార మార్గాలు సులభతరం కాలేదు. ఆ తరువాత 2014 నుండి దీని గురించి అవగాహన పెంచడం మొదలుపెట్టారు. 

ఈరోజే ఎందుకు??

భారతదేశంలో జాతీయ క్యాన్సర్ అవేర్నెస్ డే ని నవంబర్ 7 న జరుపుకోవడానికి కారణం.  రేడియోధార్మికశక్తిని కనుగొనడంలో  మేరీ క్యూరి చేసిన కృషి ప్రపంచం మరచిపోలేనిది. ఆమె జన్మదినాన్ని స్మరించుకుంటూ క్యాన్సర్ అవేర్నెస్ డే ని ఆమె పుట్టినరోజు అయిన నవంబర్ 7 న జరుపుకుంటున్నారు.

క్యాన్సర్ గురించి కొన్ని భయానక గణాంకాలు, ఆసక్తికర విషయాలు...

 పొగాకు (ధూమపానం ప్రత్యక్షం అయినా పరోక్షమయినా) వాడకం వల్ల భారతదేశంలో 3,17,928 మంది పురుషులు మరియు మహిళలు మరణిస్తున్నారు, ధూమపానం క్యాన్సర్‌కు దారి తీస్తుంది కాబట్టి దీనిని నివారించాలని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు.

 2014

క్యాన్సర్ అవగాహన యొక్క ప్రాముఖ్యత పెంచడానికి జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని భారత కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తొలిసారిగా ప్రకటించారు

1975

 క్యాన్సర్‌ను గుర్తించే కార్యక్రమాలను ప్రారంభించారు.  భారతదేశంలో క్యాన్సర్ చికిత్స సౌకర్యాలను అందించడానికి జాతీయ క్యాన్సర్ నియంత్రణ కార్యక్రమం ప్రారంభించబడింది

 1911

 నోబెల్ బహుమతి గ్రహీత మేరీ క్యూరీ గురించి అందరికీ తెలిసినదే. రేడియోధార్మికతలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా రసాయన శాస్త్రంలో రెండవ నోబెల్ బహుమతిని అందుకుంది. ఆమె చేసిన ప్రయత్నమే నేడు ఎన్నో రకాల క్యాన్సర్లు కనుగొనడానికి మార్గమవుతోంది. 

 1867

 మేధావి పుట్టుక  మేరీ క్యూరీ, క్యాన్సర్ చికిత్స కోసం న్యూక్లియర్ ఎనర్జీ మరియు రేడియోథెరపీ అభివృద్ధికి దారితీసిన ఆమె కృషికి గుర్తుండిపోయే ప్రముఖ శాస్త్రవేత్త, వార్సా పోలాండ్‌లో జన్మించారు.  ఆమె పుట్టిన తేదీని భారతదేశంలో జాతీయ క్యాన్సర్ అవేర్‌నెస్ డేగా జరుపుకుంటున్నారు.

                                      ◆నిశ్శబ్ద.