కేసీఆర్‌కి మోడీ ఫోన్: అందరితో భాయీభాయీ!
posted on May 19, 2014 @ 10:36AM
త్వరలో ప్రధానమంత్రి పీఠం మీద కూర్చోబోతున్న నరేంద్రమోడీ ఇతర రాజకీయ నాయకులు అందరితో భాయీ భాయీ.. లేడీస్‌తో అయితే భాయీ.. బెహన్ సంబంధ బాంధవ్యాలను కొనసాగించబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల ముందు తనను దారుణంగా విమర్శించిన వారితో కూడా స్నేహపూరిత సంబంధాలను కొనసాగించాలని నరేంద్రమోడీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. పార్లమెంట్‌లో బీజేపీకి పూర్తి మెజారిటీ వున్నప్పటికీ, ఎన్టీయే కూటమికి బోలెడంత మెజారిటీ వున్నప్పటికీ ఎన్డీయేలో లేని ప్రాంతీయ పార్టీలతో కూడా స్నేహపూర్వకంగా వుండాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మిత్రుడికి శత్రువు మనకి కూడా శత్రువు అనుకుంటాం. కానీ నరేంద్ర మోడీ మాత్రం ఈ సూత్రాన్ని ఫాలో అవుతున్నట్టు కనిపిచండం లేదు. చంద్రబాబు నాయుడికి జగన్, కేసీఆర్ రాజకీయంగా శత్రువులు. వీళ్ళిద్దరూ గడచిన ఎన్నికలలో నరేంద్రమోడీ మీద కూడా మాటల తూటాలు విసిరారు. అయినప్పటికీ మోడీ వీళ్ళిద్దరితో స్నేహపూర్వకంగా వ్యవహరించబోతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో మెజారిటీ సాధించిన కేసీఆర్‌కి నరేంద్రమోడీ ఫోన్ చేశారు. ఎన్నికలలో గెలిచినందుకు అభినందనలు తెలిపారు. త్వరలో తన ప్రమాణ స్వీకారానికి రావలసిందిగా ఆహ్వానించారు. కేసీఆర్ కూడా మురిసిపోయి అలాగేనని చెప్పారు. అదేవిధంగా మరోవైపు జగన్ మోడీని కలవటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. తానొక్కడే కాకుండా తన ఎంపీలందరితో కలసి మోడీనికి కలిసి అభినందనలు చెప్పడానికి అపాయింట్‌మెంట్ కూడా దొరికింది. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మొన్నటి వరకూ మోడీని నానామాటలూ అన్నారు. మోడీ ఆమెతో కూడా స్నేహపూరితంగా వ్యవహరించబోతున్నారు. అలాగే బెంగాలీ దీదీ మమతా బెనర్జీతో కూడా మంచిగా వుండాలని మోడీ తమ్ముడు భావిస్తున్నట్టు తెలుస్తోంది. నాయనా మోడీ.. నువ్వు ఎవరితో అయినా మంచిగా వుండుగానీ, సీమాంధ్రని సర్వనాశనం చేసినవాళ్ళతో మాత్రం కాస్తంత జాగ్రత్తగా వుండు.