శభాష్ లోకేశ్.. పప్పు కాదు నిప్పు.. తండ్రికి తగ్గ తనయుడు..
posted on Jun 25, 2021 @ 12:46PM
మేనమామ అంటే పిల్లలకో భరోసా. తమకు ఏ ఆపదా రాకుండా చూసుకుంటాడనే ధీమా. తమ మంచి చెడుల్లో వెన్నంటే ఉంటాడనే నమ్మకం. అలాంటిది.. మేనమామ చేష్టల వల్ల తమకు ఆపద పొంచిఉంటే? మేనమామే తమ ప్రాణాలకు ముప్పు కలిగించే పనులు చేస్తుంటే..? ఏపీలో ఇన్నాళ్లూ అదే జరిగిందంటున్నారు విద్యార్థులు. మేనమామలా ఉంటానన్న సీఎం జగన్.. కరోనా కల్లోల సమయంలో పరీక్షలు పెడతానంటూ తమ ప్రాణాలతో చెలగాటమాడారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులూ పరీక్షలు వద్దంటూ వేడుకున్నా.. జగనన్న చెవికి ఆ ఆక్రందనలు వినిపించనేలేదంటున్నారు. భవిష్యత్ పేరుతో ఎగ్జామ్స్ విషయంలో మంకుపట్టుపట్టారు. ఓ వైపు దేశమంతా పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేసినా.. ఏపీ సర్కారు మాత్రం పరీక్షలు నిర్వహిస్తామంటూ పంతానికి పోయింది. విద్యార్థులకు రెండు నెలలుగా కంటి మీద కునుకు లేకుండా చేసింది.
రెండు నెలలుగా స్టూడెంట్స్ తరఫున గట్టిగా పోరాడింది ఒకే ఒక్కడు--నారా లోకేశ్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పది, ఇంటర్ పరీక్షల రద్దు కోసం ప్రతినిత్యం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఎప్పటికప్పుడు విద్యార్థులతో, తల్లిదండ్రులతో, విద్యా నిపుణులతో ఆన్‌లైన్లో సమావేశమవుతూ, వారితో మాట్లాడుతూ, వారి అభిప్రాయాలు తెలుసుకుంటూ.. ఎగ్జామ్స్ రద్దు కోసం అలుపెరగని పోరాటం చేశారు. లేఖలతో సర్కారుపై చిన్నపాటి యుద్దమే చేశారు. ఈ విషయంలో నిజంగా నారా లోకేశ్ కృషిని అభినందించాల్సిందే. ఒకటీ, రెండు రోజులు ఎవరైనా స్పందిస్తారు. పత్రికా ప్రకటనలతో చేతులు దులుపేసుకుంటారు. కానీ, నారా లోకేశ్ అలా కాదు. జగనే అంటే జగన్‌కంటే జగమొండిఘటంగా తేలాడు. వారాల తరబడి విసుగు చెందక విద్యార్థుల కోసం బలంగా వాయిస్ వినిపించారు. దాదాపు 10 లక్షల మందిని కరోనా కాటు నుంచి కాపాడారు.
నాయకుడంటే నారా లోకేశ్‌లా ఉండాలి. నాయకత్వ లక్షణాలంటే అలా ఉండాలి. నారా లోకేశ్ బాగా పరిణితి చెందారు. తండ్రికి తగ్గ తనయుడిగా మారాడు. ఒక ఇష్యూని ఎత్తుకుంటే.. ఇక ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చివరి వరకూ పోరాడే మనస్తత్వం చాలా కొద్ది మందికే ఉంటుంది. అంతెందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌నే తీసుకొండి. పవర్‌ఫుల్ లీడర్ అనుకుంటారు అంతా. కానీ, ఆయన ఏ ఇష్యూనూ చివరి దాకా చేపట్టిన చరిత్ర లేదు. నాలుగు రోజులు హడావుడి చేసి వదిలేస్తారు. నారా లోకేశ్ అలా కాదు.. చంద్రబాబులానే తుదకంటూ పోరాడుతున్నారు. 70 ఏళ్ల వయస్సులోనూ చంద్రన్న నవ యువకుడిలా పని చేస్తున్నారు. జగన్‌రెడ్డి ప్రభుత్వ అరాచకాలపై అలుపెరగని యోథుడిలా పోరాడుతున్నారు. నారా లోకేశ్ సైతం తండ్రి బాటలోనే పోరు పథం ఎంచుకున్నారు. ఫలితం వచ్చే వరకూ విశ్రమించకుండా ఫైట్ చేస్తున్నారు. ఆయన మాటలు, చేష్టల్లో వాడి-వేడి పెరిగింది. వైసీపీ ఆరోపించినట్టు తాను పప్పు కాదు నిప్పు అని నిరూపించుకున్నారు. డౌట్ ఉంటే టచ్ చేసి చూడండి.. కాలిపోద్ది అంటూ సవాల్ విసురుతున్నారు. ఇటీవల కర్నూలు జిల్లాలో ఫాక్షన్ జంట హత్యల సమయంలోనూ లోకేశ్ బెబ్బులిలా గర్జించారు. ఎవరినీ వదిలిపెట్టాం.. వేటాడుతాం.. అంటూ జగన్‌రెడ్డికి ఫ్యాక్షన్ తరహాలోనే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నారా లోకేశ్.. ఇప్పుడు రాటుదేలిన నాయకుడు. పట్టుదల ఉన్న పోటుగాడు. సత్తా ఉన్న మొనగాడు. అందుకే, పది, ఇంటర్ పరీక్షల రద్దుపై ఆయన చేసిన పోరాటమే నిదర్శనం. అందుకే,, విద్యార్థిలోకం ఆయనకు మనసారా కృతజ్ఞతలు చెబుతోంది. తల్లిదండ్రులు ఆయన్ను మనసారా దీవిస్తున్నారు. యువత లోకేశ్ ఫోటోలకు పాలాభిషేకం చేస్తున్నారు. నారా లోకేశ్.. ఇప్పుడో దమ్మున్న డైనమిక్ లీడర్.
ఏపీలో పది, ఇంటర్ పరీక్షల రద్దు కోసం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పోరాట క్రమమిది..
ఏప్రిల్ 18
విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్ల ఆందోళన దృష్ట్యా పరీక్షలు రద్దు చేయాలి లేదా వాయిదా వెయ్యాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏప్రిల్ 18 న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారికి మొదటి లేఖ రాశారు.
ఏప్రిల్ 20
టిఎన్ఎస్ఎఫ్,విద్యార్థి సంఘాల నేతలు,విద్యావేత్తలు,న్యాయవాదులతో ప్రభుత్వంపై పోరాట ప్రణాళిక సిద్ధం చేసేందుకు నారా లోకేష్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు.
ఏప్రిల్ 22
రాష్ట్రంలో ఉన్న విద్యావేత్తలు,డాక్టర్లు,తల్లిదండ్రులు,విద్యార్థులతో నారా లోకేష్ టౌన్ హాల్ కార్యక్రమం నిర్వహించి అందరి అభిప్రాయాలు తెలుసుకొని ప్రభుత్వానికి 48 గంటల డెడ్ లైన్ ఇచ్చారు.
ఏప్రిల్ 24
48 గంటల డెడ్ లైన్ పూర్తి అయిన సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించిన నారా లోకేష్.విద్యార్థుల జీవితాలతో ఆటలొద్దు ఇతర రాష్ట్రాల తరహాలో పరీక్షలు రద్దు చెయ్యాలి,అత్యధిక కేసులు మే లో నమోదు అవుతాయి అని నిపుణులు చెబుతున్న సమయంలో పరీక్షల నిర్వహణ మంచిది కాదంటూ మరో సారి ప్రభుత్వాన్ని లోకేష్ హెచ్చరించారు.
ఏప్రిల్ 26
పరీక్షలపై విద్యార్థులు,తల్లిదండ్రుల అభిప్రాయాలు, వారి ఆందోళన వివరిస్తూ ఆధారాలతో సహా 1778 పేజీలలో గౌరవ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కి లేఖరాసి జోక్యం చేసుకోవాలని లోకేష్ విన్నవించారు. రాష్ట్రంలో ఉన్న విద్యావేత్తలు,డాక్టర్లు,తల్లిదండ్రులు,విద్యార్థులతో నిర్వహించిన టౌన్ హాల్ కార్యక్రమంలో అందరి అభిప్రాయం మేరకు న్యాయ పోరాటం చెయ్యాలని నిర్ణయం.
ఏప్రిల్ 28
తల్లితండ్రులు,పిల్లల తరపున వారి అభిప్రాయాలు మేరకు హై కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయించిన లోకేష్
మే – 2
విలేకరుల సమావేశం నిర్వహించి పరీక్షలు వాయిదా కాదు రద్దు చెయ్యాలని డిమాండ్
మే -5
పరీక్షలు రద్దు చెయ్యాలంటూ ముఖ్యమంత్రికి మరో లేఖ
మే-13
కరోనా తో తండ్రిని,తాతని కోల్పోయిన ఇంటర్ విద్యార్థి లోకేష్ తో మాట్లాడి అన్నగా అండగా ఉండి చదువు కొనసాగించడానికి సహాయం చేస్తానని హామీ. పదో తరగతి పరీక్షలు రద్దు చేసి తెలంగాణ తరహాలో పాస్ చెయ్యాలని డిమాండ్
మే-25
పరీక్షల రద్దు విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రికి లేఖ
మే-29
పరీక్షలు రద్దు చెయ్యాలని ముఖ్యమంత్రిని కోరుతూ పత్రికా ప్రకటన
జూన్ -2
పరీక్షల రద్దు డిమాండ్ తో విద్యార్థులు,తల్లిదండ్రులతో ముఖాముఖీ కార్యక్రమం
జూన్-8
కరోనా కల్లోల సమయంలో పరీక్షల నిర్వహణ – విద్యార్థుల పై పెరుగుతున్న ఒత్తిడి అంశం పై మానసిక వైద్య నిపుణులు, విద్యార్థులతో లోకేష్ ముఖాముఖీ
జూన్ -11
ఇతర రాష్ట్రాల మాదిరిగా పరీక్షలు రద్దు చెయ్యాలని ముఖ్యమంత్రికి లోకేష్ లేఖ
జూన్-16
కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు -విద్యాసంవత్సరం వృధా అనే అంశం పై విద్యార్థులు,విద్యావేత్తలతో లోకేష్ ముఖాముఖీ కార్యక్రమం
జూన్ – 21
మొండి పట్టుదలకు పోయి పరీక్షలు నిర్వహించడం ప్రమాదం అంటూ పత్రికా ప్రకటన
జూన్ -23
పరీక్షలు రద్దు చెయ్యాలి, సుప్రీంకోర్టుకి అఫిడవిట్ సమర్పించాలి అంటూ పత్రికా సమావేశం.
జూన్ -24
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తక్షణమే మెంటల్ మామ పరీక్షలు రద్దు చెయ్యాలని పత్రికా ప్రకటన.