మావోయిస్టు అగ్రనేత నంబాల మృతి.. ఖండించిన పౌరహక్కుల సంఘం
posted on May 21, 2025 @ 5:43PM
వచ్చే ఏడాది మార్చి 31లోపు నక్సలిజాన్ని అంతం చేయాలని సంకల్పించినట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా తెలిపారు. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఇవాళ ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. నంబాల మృతిని అమిత్ షా అధికారికంగా ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 27 మంది మృతి చెందారు. ఇందులో సీపీఐ మావోయిస్ట్ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు కూడా ఉన్నారు. నక్సల్స్ ఉదమ్యానికి నంబాల వెన్నెముకగా నిలిచారు.
నక్సలిజాన్ని అంతమొందించడంలో ఇది కీలక ముందడుగు. ముప్పై ఏళ్ల పోరాటంలో ఇంత పెద్ద నాయకుడ్ని మట్టుబెట్టడం ఇదే తొలిసారి అని ట్వీట్టర్‌లో షా పేర్కొన్నారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ తర్వాత 54 మందిని అరెస్ట్ చేశాం. మరో 84 మంది లొంగిపోయారు. 2026 ఏడాది మార్చి చివరికల్లా నక్సలిజాన్ని అంతమొందదిస్తాం’అని షా ఎక్స్ వేదికగా ప్రకటించారు. బసవరాజు తలపై రూ.1.5 కోట్ల భారీ రివార్డు ఉందని అధికారులు పేర్కొన్నారు. ఎన్ కౌంటర్ మృతుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఉన్నాడని ఉదయం నుంచి ఇప్పటివరకు అనే కథనాలు వచ్చినప్పటికీ, అమిత్ షా చేసిన తాజా ప్రకటనతో ఆయన మృతి విషయం నిర్ధారణ అయింది.
2019 గడ్చిరౌలిలో 15 మంది పోలీసుల మృతి నంబాల సూత్రధారి. 2018లో గణపతి రాజీనామాతో మావోయిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. మావోయిస్టు పార్టీలో చేరిన తర్వాత తన పేరును బసవరాజ్‌గా మార్చుకున్నారు. ఆయన 2010లో ఛత్తీస్‌గఢ్‌లో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి ఘటనకు సూత్రధారి. మరోవైపు ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు నంబాల కేశవరావు మృతి వార్తలను పౌరహక్కుల సంఘం ఖండించింది. ఆయన క్షేమంగా ఉన్నారని, ఆ ప్రచారం అవాస్తమని సంఘం కార్యదర్మి చంద్రశేఖర్ తెలిపారు