రాయపాటికి వారెంట్

 

 

 

 

కాంగ్రెస్ సీనియర్ నేత, గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు కి నాంపల్లి కోర్ట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. 2006లో ఐసీఐసీఐ బ్యాంక్‌కు ఇచ్చిన చెక్ ఒకటి బౌన్స్ అయ్యింది. దీనిపై అప్పట్లో బ్యాంక్ అధికారులు కేసు నమోదు చేశారు. అయితే అప్పటి నుంచి ఈ విషయమై కోర్టులో విచారణ కొనసాగుతున్నది. విచారణ సమయంలోనే రాయపాటి స్వయంగా హాజరుకావాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆయన హాజరుకాకపోవడంతో తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్లను కోర్టు జారీచేసింది. ఏప్రిల్ 18న రాయపాటి కోర్టుకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.

Teluguone gnews banner