తెలుగుదేశం కోసం నందమూరి మోక్షజ్ఞ ఏం చేస్తున్నాడు?
posted on Apr 21, 2014 @ 3:21PM
నందమూరి, నారా కుటుంబాలు ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తేవడానికి కృషి చేస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్, బాలకష్ణ, కళ్యాణ్‌రామ్, తారకరత్న... వీళ్ళందరూ ఇంటిపట్టున వుండకుండా ఎన్నికల ప్రచారం పనుల్లో పూర్తిగా నిమగ్నమై వున్నారు. మరి ఈమధ్యే ఓటు హక్కు కూడా వచ్చిన నందమూరి తారకరామ మోక్షజ్ఞ ఏం చేస్తున్నాడు. బయటకి వచ్చి ప్రచారం చేయబోతున్నాడా? తెలుగుదేశం పార్టీ బలపడటం కోసం తనవంతుగా ఏం చేస్తున్నాడు? ఈ ప్రశ్నలు నందమూరి, నారా అభిమానుల్లో వున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం దొరికింది. మిగతా అందరూ పాత పద్ధతులలో వెళ్తూ తెలుగుదేశానికి ప్రచారం చేస్తుంటే, మోక్షజ్ఞ మాత్రం హైటెక్ పద్ధతులలో తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తున్నాడట. అది కూడా సోషల్ మీడియా ఆధారంగా! మోక్షజ్ఞ సోషల్ మీడియాలో నిపుణులైన కొంతమందిని ఒకచోట చేర్చి తెలుగుదేశం పార్టీకి సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో ప్రచారం చేయించే కార్యక్రమంలో నిమగ్నమై వున్నాడట. గత నెల రోజులుగా మోక్షజ్ఞ ఇదే ప్రాజెక్టులో తలమునకలుగా వున్నట్టు సమాచారం. దీన్నిబట్టి అర్థమవుతున్నదేంటంటే, నందమూరి వంశంలో మోక్షజ్ఞ కూడా ముదురే!