నేటి నుంచి మూడు రోజులు హైదరాబాద్ లోనే మోడీ
posted on Jul 2, 2022 7:38AM
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ప్రధాని మోడీ శనివారం (ఈ రోజు) హైదరాబాద్ రానున్నారు. నగరంలో రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. అయితే మోడీ మూడు రోజుల పాటు హైదరాబాద్ లోనే మకాం వేయనున్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హైదరాబాద్ చేరుకున్నారు.
జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హెచ్ఐసీసీ ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. ఇక ఆదివారం సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభ కోసం అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. హైదరాబాద్ లో మోడీ పర్యటించే ప్రాంతాలన్నిటినీ ఇప్పటికే స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ తమ అధీనంలోకి తీసుకుంది. అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
అదేవిధంగా ఆదివారం (రేపు) సాయంత్రం పరేడ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో పాల్గోనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు మధ్యాహ్నం 2.55 గంటలకు హైదరాబాద్ కు చేరుకోనున్నారు. సోమవారం ఉధయం వరకు మోదీ ఇక్కడే ఉంటారు. శని, ఆది వారాల్లో రాత్రి హైటెక్స్ లోని నోవాటెల్ హోటల్ లో బస చేస్తారు. మోదీ సహా కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల బీజేపీ సీఎంలు, బీజేపీ జాతీయ స్థాయి నేతలు హైదరాబాద్ రానుండటంతో నగరంలో పటిష్ఠ బందోబస్తు ను ఏర్పాటు చేశారు.
మోదీ పర్యటించే ప్రాంతాలను ఎస్పీజీ బలగాలు తమ ఆదీనంలోకి తీసుకున్నాయి. అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తూ పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. ఇక ఆదివారం సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో మోడీ ప్రసంగించనున్నారు. ఈ సభలో వేదికపై మోడీతో పాటు ఆరుగురికి మాత్రమే అనుమతి ఉంది. ఈ సభా వేదికపై మోడీతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మరో ముగ్గురికి మాత్రమే అవకాశం ఉంటుంది.