మోడీ రాష్ట్రంలో.. మహిళను వివస్త్రగా ఊరేగించిన భర్త.. గ్రామ పెద్దలు..
posted on Jul 16, 2021 @ 2:49PM
అది ప్రస్తుత దేశ ప్రధాని మోడీ. ఒకప్పుడు ముఖ్యమంతి బాధ్యతలు నిర్వహించిన రాష్ట్రము. దేశంలోనే ఆదర్శం గా చెప్పుకుంటున్న రాష్ట్రము. అక్కడ రామరాజ్యం అమలు అవుతుందని. అక్కడ ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని అని గొప్పలు చెప్పుకుంటారు. ఆ రాష్ట్రము అభివృద్ధిలో ఆకాశాన్ని తాకిందని.. దేశంలో ఉన్న పారిశ్రామిక వేత్తలకు పుట్టినిల్లు అని చెప్పుకుంటున్నాం.. అదే రాష్టంలో మహిళలు రక్షణ లేదు.. ఒక మహిళ తప్పు చేసిందని.. ఆ మహిళను వివస్త్ర చేసి ఊర్లో గణేష్ ని ప్రచారం చేసినట్లు ప్రచారం చేశారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం..
మనుషులు తప్పులు చేస్తుంటారు.. అది ఆడవాళ్లు అయినా, మగవాళ్ళు అయినా.. అందుకు వాళ్ళు శిక్షలు అనుభవిస్తుంటారు. గుజరాత్ లో జరిగిన ఈ దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పరాయి పురుషుడితో పారిపోయిన భార్యను వెతికి పట్టుకున్న భర్త.. అమానుషానికి పాల్పడ్డాడు. గ్రామ పెద్దలతో కలిసి ఆమెను నగ్నంగా గ్రామంలో ఊరేగించాడు. అంతేకాకుండా ఆమె భుజాలపై ఎక్కి ఊరేగాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
వివరాలలోకి వెళితే.. దహోడ్ జిల్లాలో ఓ గిరిజన ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి(26), భార్య (23)తో కలిసి నివాసముంటున్నాడు. ఈ క్రమంలో గతనెల అతని భార్య, వేరొక వ్యక్తి మోజులో పడి అతడితో పారిపోయింది. అతనితో కలిసి జీవిస్తుంది. దీంతో ఆమె భర్త కోపం వచ్చింది.. తన భార్య పై ఎలాగైనా ప్రతీకారం తెరుచుకోవాలనుకున్నాడు. ఆమె భర్త, గ్రామస్థులు కలిసి వారి ఆచూకీని గుర్తించి, ఆమెను గ్రామానికి తీసుకొచ్చారు. ఈ విషయమై జూలై 6న పంచాయితీ పెట్టారు. వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా అతడితో పారిపోయిందని ఆమెను భర్త, కుటుంబ సభ్యులు, గ్రామా పెద్దలు అంత కలిసి ఇష్టంవచ్చినట్లు కొట్టారు. అంతటితో ఆగకుండా ఆమెను వివస్త్రను చేసి ఊరేగించారు. నగ్నంగా పరిగెట్టాలని హింసించారు. ఆ తర్వాత చేసిన తప్పుకు గాను తన భర్తను భుజాన ఎత్తుకొని నడవాలని గ్రామ పెద్దలు ఆదేశించారు. ఇందుకు సంబంధించిన వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఈ ఘటన పై కేసు నమోదు చేశారు. బాధితురాలి భర్తతో పాటు మరో 18 మందిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
ఒక దేశ ప్రధాని.. అంతక మందు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వచించిన రాష్ట్రము లో ఇలాంటి సంఘటలను జరగడం చాలా దురదృష్టకరం అని చెప్పుకోవాలి.. భార్య ఒకడిని ప్రేమించిందని భర్త భార్య ప్రేమించినవాళ్లకు ఇచ్చి పెళ్లి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు.. కానీ భార్య తప్పు చేసిందని ఇలా ఆమెను వివస్త్రగా చేసిగ్రామంలో ఊరేగించిన ఏకైక రాష్ట్రము గుజరాత్ అని.. ఇలాంటి సంఘటనలు ఎక్కువగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జారుతాయని చెప్పవచ్చు..