టీచర్స్ ఎమ్మెల్సీగా రామకృష్ణ గెలుపు
posted on Mar 25, 2015 @ 4:15PM
గుంటూరు-కృష్ణా జిల్లాల టీచర్స్ శాసనమండలి స్థానానికి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన ఏఎస్ రామకృష్ణ గెలుపొందారు. ఏఎస్ రామకృష్ణ తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావుపై తొలి ప్రాధాన్యత ఓటుతో ఆయన విజయం సాధించారు. యూటీఎఫ్ తరపున బరిలోకి దిగిన ఏఎస్ రామకృష్ణకు 6986 ఓట్లు రాగా, కేఎస్ లక్ష్మణరావుకు 5037 ఓట్లు వచ్చాయి. తన ఓటమిని అంగీకరిస్తున్నట్టు లక్ష్మణరావు తెలిపారు.అటు తెలంగాణ జిల్లాలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల తొలి రౌండ్ ఫలితం సాయంత్రానికి వెలువడనున్నట్లు రిటర్నింగ్ అధికారి సత్యనారాయణరెడ్డి తెలిపారు. రాత్రంతా కౌంటింగ్ కొనసాగనుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల తొలి రౌండ్ కౌంటింగ్ జరుగుతోంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు ఆధిక్యంలో వున్నారు.