జగన్ వైపు విశ్వరూప్..!
posted on Sep 26, 2013 @ 6:40PM
రాష్ట్ర మంత్రి విశ్వరూప్ రాజీనామాతో కాంగ్రెస్‌లో కలకలం చెలరేగింది. గత కొంత కాలంగా విశ్వరూప్ వైఎస్ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి సన్నిహితంగా ఉంటున్నారు. ఈ రోజు గవర్నర్ నరసింహన్‌కు తన రాజీనామా లేఖను సమర్పించిన విశ్వరూప్ త్వరలో వైకాపాలో చేరే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. రేపో, ఎల్లుండో జగన్‌ను కలిసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
గవర్నర్ నరసింహన్‌కు రాజీనామా లేఖ సమర్పించిన తరువాత మీడియా తో మాట్లాడుతూ...ఏపీ ఎన్జీవోల సమ్మెకు మద్దతుగా తాను రాజీనామా చేశానని అన్నారు. ఇంతవరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆగమని చెప్పినందువల్లే రాజీనామా చేయకుండా ఆగానని చెప్పారు. 60 రోజులుగా సీమాంధ్ర ప్రజలు ఉద్యమాలు చేస్తుంటే కేంద్రం పట్టించుకోవడం లేదని అన్నారు. తన రాజీనామా గవర్నర్ ఆమోదించారనే భావిస్తున్నట్లు చెప్పారు.