మంత్రిగారి సెల్పీతో వచ్చిన కష్టాలు..
posted on Apr 18, 2016 @ 11:09AM
ఈ రోజుల్లో సెల్ఫీలు తీసుకోవడం చాలా కామన్ థింగ్. సామాన్య ప్రజల నుండి సెలబ్రిటీలు దాకా అందరూ సెల్ఫీలు తీసుకొని తమ ముచ్చటను తీర్చుకుంటున్నారు. ఇప్పుడు అలాగే సెల్ఫీ తీసుకొని చిక్కుల్లో పడ్డారు ఓ మంత్రిగారు. మహారాష్ట్రలో నీటి పారుదల శాఖా మంత్రిగా ఉన్న పంకజా ముండే లాతూర్ పర్యటనలో ఉన్నారు. ఈనేపథ్యంలో ఆమె లాతూర్ లోని కరువు ప్రాంతాల్లో తిరుగుతూ సెల్ఫీలు తీసుకుంది. అక్కడితో ఆగకుండా ఆ ఫొటోలని సోషల్ మీడియా సైట్లో పోస్ట్ చేసింది. అంతే అది చూసిన నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎండిపోయిన మంజీరా నది ముందు సెల్ఫీలు దిగడం ఏంటంటూ.. ఆమె వైఖరి రైతులను అవమానపరిచేదిగా ఉందంటూ మండిపడుతున్నారు. అయితే వీటికి స్పందించిన పంకజా ముండే ఆ విమర్సలను పట్టించుకోకుండా.. లాతూరుకు నీటిని అందించేందుకు ఏన్నో ఏర్పాట్లూ శరవేగంగా సాగుతున్నాయని మరో పోస్టును పెట్టారు.