రాజకీయాలు చేస్తూ శవాల పైన ప్యాలాలు వేరుతున్నారు! ప్రజలు ఐసో లేషన్ లో పెట్టినా బుద్ధి లేదు!
posted on Apr 14, 2020 @ 9:33AM
ఈ సమయంలో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు, అలంటీ వారిని ఇప్పటికే ప్రజలు ఐసో లేషన్ లో పెట్టారు. అయిన వారికి బుద్ధి రాలేదంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఘాటుగా విమర్శించారు. ఊరంతా ఒకదారి అయితే ఉలికి కట్టది ఒక దారి అన్నట్టు... కొంతమంది రాజకీయ పార్టీల తీరు ఉంది. వలస కార్మికులను ఆదుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఒక్క వలస కార్మికునునైన అదుకున్నారా...? అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.
కరోన విషయంలో దేశములో ఏ రాష్ట్రం చేయని విధముగ తెలంగాణ బాగా పని చేస్తుంది అని ఉప రాష్ట్రపతి వెంకయ్య, కేంద్ర మంత్రి అర్జున్ ముండ మెచ్చుకొన్నారు. ఇప్పటికే రాష్ర్టంలో 87% మందికి 12 కిలోల బియ్యం ఇచ్చాం. రాష్ట్రంలోని రేషన్ కార్డ్ దారులకు 87లక్షల 55వేల మందికి 13వందల 14 కోట్ల డబ్బులు వేయబోతున్నాం. గతంలో ఎప్పుడు లేనివిధంగా ఈ రబీలో అత్య అధికంగా ధాన్యం వచ్చింది. ఆర్థికమాంద్యం దెబ్బతిన్న కూడా రైతులకు ఇబ్బంది లేకుండా కేసీఆర్ చేస్తుంటే... ప్రతిపక్షలకు ఇవి కనబడడం లేదా...?
24 గంటలు సీఎం కేసీఆర్ రాష్ట్రం కోసం పనిచేస్తున్నాడు. నేను ఇప్పుడు ప్రతిపక్షల మీద విమర్శలు కావాలని చేయడం లేదు... వారు అనే మాటలు విని బాధతో మాట్లాడుతున్న. రాష్ట్ర ప్రభుత్వం కరోన కోసం ఇప్పటివరకు 3వేల 147 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఇక్కనైన ప్రతిపక్షలు చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని హరీశ్‌రావు సూచించారు.