క్వారెంటైన్‌కు తరలించడానికి అడ్డుకుంటున్న ఎంఐఎం!
posted on Apr 16, 2020 @ 1:43PM
ఎంఐఎం నేతల ఓవర్ యాక్షన్ పోలీసులకు తలనొప్పిగా మారుతోంది. కరోనా అనుమానితులను క్వారెంటైన్‌కు తరలిస్తున్న పోలీసులను ఎంఐఎం పార్టీకి చెందిన మునిసిపల్ డిప్యూటీ మేయర్ అడ్డుకున్నారు. పైగా పోలీసులతో వాదులాటకు దిగడంతో ఏమీ చేయలేక పోలీసులు వెళ్ళిపోయారు. తెలంగాణాలో రెడ్ జోన్లు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే.. మరోవైపు అవగాహన లేని రాజకీయ నాయకులు పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ.. వైరస్ వ్యాప్తికి పరోక్షంగా కారణమవుతున్నారు.
నిజామాబాద్ డిప్యూటీ మేయర్ ఇద్రీస్ ఖాన్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. నగరంలోని ఆటోనగర్‌లో కరోనా అనుమానితులను క్వారంటైన్‌కు తరలిస్తుండగా అడ్డుకున్నాడు డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్. వైద్య సిబ్బంది, పోలీసుల విధులకు ఆటంకం కల్పించిన ఎం.ఐ.ఎం. నేత, డిప్యూటీ మేయర్ ఇద్రీస్ ఖాన్‌తో పాటు ఓ కార్పొరేటర్ భర్త సహా 10 మందిపై ఆరో టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు పరిస్థితిని, తమకున్న ప్రభుత్వ ఆదేశాలను వివరిస్తున్నా కూడా డిప్యూటీ మేయర్ పరుష పదజాలంతో పోలీసులను దుర్భాషలాడాడు రోడ్డుపై హంగామా సృష్టించిన ఎంఐఎం నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.